- Home
- Entertainment
- మంచు మనోజ్, మౌనికని ఆశ్చర్యపరిచిన రాంచరణ్.. వాళ్ళిద్దరితో బాండింగ్ కట్, నెటిజన్ల కామెంట్స్ వైరల్
మంచు మనోజ్, మౌనికని ఆశ్చర్యపరిచిన రాంచరణ్.. వాళ్ళిద్దరితో బాండింగ్ కట్, నెటిజన్ల కామెంట్స్ వైరల్
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం తన సతీమణి ఉపాసనతో మాల్దీవుల వెకేషన్ లో ఉన్నాడు. ఉపాసన ప్రస్తుతం గర్భవతి. దీనితో చరణ్, ఉపాసనతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం తన సతీమణి ఉపాసనతో మాల్దీవుల వెకేషన్ లో ఉన్నాడు. ఉపాసన ప్రస్తుతం గర్భవతి. దీనితో చరణ్, ఉపాసనతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజెర్ చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా రాంచరణ్ తాజాగా మంచు హీరో మనోజ్ ని సర్ప్రైజ్ చేశాడు. మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు రాంచరణ్, ఉపాసన దంపతులు కొన్ని గిఫ్ట్స్ పంపారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒక పెద్ద గిఫ్ట్ ప్యాక్ తో పాటు, ఫ్లవర్ బొకే, కొన్ని బొమ్మలు ఉన్నాయి.
చరణ్ నుంచి అసలు ఊహించని విధంగా గిఫ్ట్స్ రావడంతో మంచు మనోజ్ సైతం ఆశ్చర్యపోయాడు. 'ఇలాంటి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఎంతో సంతోషాన్నిస్తాయి. థ్యాంక్యూ స్వీట్ కపుల్ రాంచరణ్, ఉపాసన.. లవ్యూ మిత్రమా.. మీరు మాల్దీవుల నుంచి తిరిగొచ్చాక తప్పకుండా కలుస్తాను అని మనోజ్ ట్వీట్ చేశారు.
Ram Charan
మంచు మనోజ్ ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలతో మంచి రాపో మైంటైన్ చేస్తుంటారు. ఇటీవల రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మంచు మనోజ్, మంచు లక్ష్మి స్పెషల్ కేక్ తో సెలెబ్రేట్ చేశారు. మంచు మనోజ్ ట్వీట్ కి నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
Ram Charan Allu Arjun
ఇటీవల కొన్ని రోజులుగా రాంచరణ్ తో ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాండింగ్ గురించి అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే వీరి చర్యలు కూడా ఫ్యాన్స్ కి అనుమానం కలిగించే విధంగానే ఉన్నాయి. రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎలాంటి విషెస్ తెలపలేదు.
అలాగే నిన్న అల్లు అర్జున్ బర్త్ డే కి రాంచరణ్ ఎదో మొక్కుబడిగా విష్ చేసారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ మాత్రం బావ బావ అంటూ చాలా ఫన్నీగా ట్విట్టర్ లో మెసేజ్ లు పెట్టుకున్నారు. దీనితో రాంచరణ్ తో.. అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య సంబంధాలు సరిగ్గా లేవని రూమర్స్ వినిపిస్తున్నాయి. చరణ్ తాజాగా మనోజ్ కి గిఫ్ట్స్ పంపడంతో.. బన్నీ, ఎన్టీఆర్ తో బంధం ముగిసినట్లేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మనోజ్,చరణ్ స్నేహితులైతే చాలా బావుంటుందని కూడా సూచిస్తున్నారు.