MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన క్లీంకార, చిరంజీవి ఇంట అవార్డుల పంట..

మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన క్లీంకార, చిరంజీవి ఇంట అవార్డుల పంట..

మెగా ఫ్యామిలీకి అదృష్ట దేవతగా మారింది. రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లింకార.  ఈమెగా మనవరాలు పుట్టిన తరువాతే ఈ ఫ్యామిలీలో వరుసగా అవార్డ్ లు హడావిడి పెరింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 27 2024, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తాజాగామెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషన్ పొందారు. కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ కు పద్మ విభూషన్ ప్రకటించడంతో ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటాయి. కాగా ఈమధ్య కాలంలో వరుసగా మెగా ఫ్యామిలీలో అవార్డ్ ల పంట పండుతోంది.  రికార్డ్ లను వేటాడుతున్నారు మెగా హీరోలు  అన్నీ మంచి శకునములే అన్నట్టుగా.. అంతా హ్యాపీగా ఉన్నారు. ఆమధ్య గ్యాప్ వచ్చినా.. ప్రస్తుతం పండగలు కూడా ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే దీనికంతటికీ కారణం మెగా మనవరాలు క్లింకారనే అంటున్నారు ఫ్యాన్స్. 
 

27

అవును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనల గారాలపట్టి క్లింకార. ఈ స్టార్ కిడ్ అలా పుట్టీ పుట్టడంతోనే మెగా పవర్ స్టార్ నటించిన  ఆర్ఆర్ఆర్ సినిమాకు  రెండు ఆస్కార్లు వచ్చాయి. ఆస్కార్లు సాధించడం అంత తేలికైన విషయం కాదు. అది కూడా టాలీవుడ్ సినిమా ఈ ఘనత సాధించి హాలీవుడ్ రేంజ్ కు మన హీరోలు ఎదగడం సాధారణ విషయం కాదు కదా..?

37

అంతే కాదు రామ్ చరణ్ కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. జేమ్స్ కామరూన్ లాంటి దర్శకుడు రామ్ చరణ్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..పొగడ్తలతో ముంచెత్తారంటే.. చరణ్ కు ఎంత ఇమేజ్ వచ్చిందో చెప్పనక్కర్లేదు.  గ్లోబల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో సత్కారాలు పొందాడు. అంతే కాదు ఆస్కార్ జ్యూరీలో మెంబర్ గా కూడా ప్లేస్ కొట్టేశాడు. ఇలా అంతర్జాతీయంగా రామ్ చరణ్ కు పేరు రావడంలో ఆయన కృషి ఎంత ఉందో.. మెగా మనవరాలు అడుగు పెట్టిన అదృష్టం  కూడా అంతే ఉంది అంటున్నారు ప్యాన్స్. 
 

47

ఇక రీసెంట్ గా మెగా ఫ్యామిలీ హీరో.. అల్లు అర్జున్ కూడా  బెస్ట్ హీరో క్యాటగిరీలో నేషనల్ అవార్డ్ ను సాధించాడు. టాలీవుడ్ కు ఇంతకు ముందు బెస్ట్ హీరో క్యాటగిరీలో అవార్డ్ రాలేదు.. ఇన్నేళ్ళ తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొదటిపాకి ఎత్తమ కథానాయకుడు క్యాటగిరీలో జాతీయ అవార్డ్ సాధించి వ్యాక్తిగా అల్లు అర్జున్ నిలిచిపోయాడు. ఇక ఈవియంలో క్లింకార లక్కీలెక్ కాస్త పనిచేసిందనే అంటున్నారు ఫ్యాన్స్. 

57

మెగా ఫ్యామిలీలో సంబరాలు .. సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. క్లింకార పుట్టడంతో వారింట శుభకార్యాలు, శుభాలు వరుసగా జరుగుతున్నాయి. . రీసెంట్ గా వరుణ్ తేజ్ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగింది.  అంతే కాదు రామ్ చరణ్ బిజినెస్ లలో కూడా చాలా లాభాలు ఆర్జిస్తున్నారట. క్లింకార పుట్టిన తరువాత వాళ్ళ బిజినెస్ లుక కూడా ఊపు అందుకున్నట్టు టాక్ నడుస్తోంది. 
 

67

ఇక మెగాస్టార్ చిరంజీవి దేశంలోనే రెండోవ అత్యున్నత పురస్కారం అందుకోబోతున్నారు. గతంలో పద్మభూషణుడు అయిన చిరంజీవి  విశ్వంభరుడుగా.. పద్మవిభూషణుడిగా మారారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి క్యూ కట్టారు స్టరా్ సెలబ్రిటీలు.  చిన్నా పెద్ద అని లేకుండా ఇండస్ట్రీకి  సబంధించిన అన్నిరంగాల వారు మెగాస్టార్ కు శుభాంకాంక్షలు తెలపడం కోసం ఆయన ఇంటికి వెళ్ళారు. 

77
Chiranjeevi Ram Charan Klin Kaara

Chiranjeevi Ram Charan Klin Kaara

ఇక ఇన్ని శుభాలు వారి వారి కృషితో పాటు..మెగాఫ్యామిలీలో క్లింకార అడుగు పెట్టిన తరువాతే జరుగుతున్నాయి. దాంతో క్లింకార మెగా ఫ్యామిలీ అదృష్ట దేవత అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఇంత వరకూ క్లింకార ఫేస్ ను ఫ్యాన్స్ కు చూపించలేదు. మెగా వారసురాలు ఎలా ఉంటుందా అనేది బయట ఎవరికీ తెలియదు. దాంతో ఎప్పుడు ఆమె ఫేస్ రివిల్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Lakshmi Manchu: మా నాన్న ఎందుకు బతికాడు, మిగిలినవాళ్లు ఎందుకు చనిపోయారు.. మంచు లక్ష్మి బోల్డ్ రియాక్షన్‌
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: చందు పై యాక్సిడెంట్ ప్లాన్.. నీచానికి దిగజారిన భాగ్యం వల్లి
Recommended image3
Devayani Daughter: కోర్ట్ మూవీ రీమేక్ లో సుస్వాగతం హీరోయిన్ కూతురు.. పట్టలేని సంతోషంలో దేవయాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved