Niharika: చీకటి గదిలో నిహారిక టెంప్టింగ్ పోజులు... గ్లామర్ డోస్ పెంచేస్తున్న మెగా డాటర్!
నటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న నిహారిక బోల్డ్ ఫోటో షూట్స్ తో గ్లామరస్ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Niharika Konidela
నిహారిక కొణిదెల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా డార్క్ థీమ్ తో టెంప్టింగ్ పోజుల్లో కాకరేపింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Niharika Konidela
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. నాగ శౌర్య హీరోగా విడుదలైన ఒక మనసు చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. నిహారిక హీరోయిన్ కావడాన్ని మెగా ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. అయినా హీరోయిన్ కావాలన్న తన కోరిక నెరవేర్చుకుంది.
Niharika Konidela
హీరోయిన్ గా తెలుగులో నిహారిక మూడు చిత్రాలు చేశారు. తమిళంలో ఓ చిత్రంలో నటించారు. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిరంజీవి పాన్ ఇండియా మూవీ సైరా నరసింహారెడ్డిలో గెస్ట్ రోల్ చేసింది.
Niharika Konidela
నటిగా ఫెయిల్ కావడంతో నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్నా యాక్టింగ్ కి దూరం కాకూడదని నిహారిక అనుకున్నారు. 2020 డిసెంబర్ నెలలో నిహారిక పెద్దలు చూసిన వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. కారణం తెలియదు కానీ ఇద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి.
Niharika Konidela
కొద్దిరోజుల క్రితం నిహారిక-వెంకట చైతన్య విడాకుల ప్రకటన చేశారు. విడాకుల ప్రకటన అనంతరం నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాము. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో కొంత ప్రైవసీ కావాలి, దయచేసి అర్థం చేసుకోగలరంటూ నిహారిక పోస్ట్ పెట్టారు.
పెళ్లి అయ్యాక నిహారిక నటనకు దూరమైంది. మరలా ఇప్పుడు యాక్టీవ్ అయ్యింది. ఇటీవల డెడ్ ఫిక్స్సెల్స్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. కాంటెంపరరీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. అయితే పెద్దగా ఆదరణ దక్కించుకోలేదు.
Niharika Konidela
అలాగే నిహారిక సొంత ఆఫీస్ ఓపెన్ చేసింది. ఆమెకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఈ బ్యానర్లో వెబ్ సిరీస్లు, చిన్న చిత్రాలు చేయాలని ప్లాన్ చేస్తుంది. యువ రచయితలు, దర్శకులతో చర్చలు జరుపుతోంది. ఇక నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి...