నడుమొంపులతో నయగారాలు పోతుంది నిహారిక, చిరునవ్వులతో మురిపిస్తున్న మెగా డాటర్
మెగా డాటర్ నిహారికా వరుస ఫోటో షూట్లతో సందడి చేస్తోంది. ఈమధ్య సోషల్ మీడియాలో నిహారిక హడావిడి ఎక్కువైపోయింది. ఇన్ స్టా గ్రామ్ ను గ్లామర్ ఫోటోలతో నింపేస్తోంది.
కెరీర్ మీద గట్టిగా కాన్సంట్రేట్ చేసినట్టుంది నిహారికా కొనిదెల.. ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. మెగా డాటర్ ఫోటో షూట్లు అంటే కాస్త అటూ ఇటుగానే ఉంటాయి అనుకుంటే.. రోజు రోజుకు హాట్ డోస్ పెంచుతూ వస్తోంది బ్యూటీ.
హోస్ట్ గా, హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో కొన్నాళ్లు యాక్టీవ్ గా ఉంది నిహారిక. అయితే ఆ టైమ్ లోనే చైతన్య జొన్నలగడ్డతో పెళ్ళి జరగడంతో.. ఫిల్మ్ కెరీర్ కు పుల్ స్టాప్ పెట్టేసింది బ్యూటీ. అయితే అనూహ్యంగా ఆమె పెళ్ళితరువాత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు కొన్ని అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి.
పెళ్లితరువాత ఎక్కువ కాలం కలిసి ఉండకుండానే మనస్పర్ధలతో విడాకుల వరకూ వెళ్లారు నిహారిక -చైతన్యలు. రీసెంట్ గా విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. అటు చైతన్య కూడా నిహారిక గురించి ఇండైరెక్ట్ గా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయ్యింది.
Niharika Konidela
ఇక విడాకుల తరువాత సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసింది మెగా డాటర్. వరుస ఫోటో షూట్లు చేస్తూ.. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. షాక్ ఇస్తోంది. కెరీర్ లో హీరోయిన్ గా చేయాలి అనుకుంటుందా..? లేక సరదాకి ఇలా ఫోటో షూట్లు చేస్తుందా తెలియదు కాని.. సోషల్ మీడియాను మాత్రం ఊపు ఊపేస్తోంది బ్యూటీ.
Niharika Konidela
మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ అయిన ఒకే ఒక అమ్మాయి నిహారిక. ఈ క్రమంలో ఆమె కాస్త వ్యతిరేకత కూడా ఫేస్ చేసింది.. కుటుంబం నుండి కూడా పెద్దగా సపోర్ట్ దక్కలేదు. ఒక మనసు మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన నిహారిక... సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించింది.
హీరోయిన్ గా నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో 2020లో పెద్దల కుదిర్చిన సంబంధం వెంకట చైతన్యతో వివాహం జరిగింది. మనస్పర్థలతో నిహారిక-వెంకట చైతన్య విడిపోయారు. ఈ ఏడాది విడాకుల ప్రకటన చేశారు. నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. నటిగా, నిర్మాతగా ఎదగాలని ఆమె ఆశపడుతున్నారు.
రీసెంట్ గా నిహారిక అన్న.. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ పెళ్ళి.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో జరిగింది. ఈ పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మెగా డాటర్. కాక్ టైల్ పార్టీలో, రిసెప్షన్ లో కూడా హాట్ హాట్ డ్రెస్ లతో హడావిడి చేసింది.