- Home
- Entertainment
- జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు, వాళ్లే నాకు తోడుగా ఉన్నారు... నిహారిక ఆసక్తికర కామెంట్స్
జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు, వాళ్లే నాకు తోడుగా ఉన్నారు... నిహారిక ఆసక్తికర కామెంట్స్
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఓ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను , ఆ సమయంలో కొందరు సపోర్ట్ గా నిలిచారని అన్నారు.

Niharika Konidela
మెగా ఫ్యామిలీలో రెబల్ డాటర్ నిహారిక కొణిదెల. నిహారిక హీరోయిన్ కావడాన్ని ఫ్యాన్స్, ఫ్యామిలీ మెంబర్స్ వ్యతిరేకించారు. పట్టుబట్టి నిహారిక తన పంతం నెగ్గించుకుంది. ఒక మనసు మూవీతో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది.
Niharika Konidela
హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేసిన నిహారికకు బ్రేక్ రాలేదు. దాంతో ఆమె పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ లో నిహారిక వివాహం రాజస్థాన్ లో ఘనంగా జరిగింది.
Niharika Konidela
అనూహ్యంగా నిహారిక భర్తతో విడిపోయింది. గత ఏడాది ప్రారంభంలో విడాకులు ప్రకటించారు. నిహారిక నటన పట్ల మక్కువతోనే భర్తతో విడిపోయిందనే టాక్ ఉంది.
ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. నటిగా, నిర్మాతగా రాణించాలి అనుకుంటుంది. ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది. నిహారిక చాలా కాలంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఒక బ్యానర్ నడుపుతుంది. ఈ బ్యానర్ లో చిత్రాలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు నిర్మించింది.
తాజాగా సాగు అనే షార్ట్ ఫిల్మ్ ప్రొమోషన్స్ లో నిహారిక పాల్గొంది. సాగు చిత్ర ప్రీమియర్ కి అతిథిగా హాజరైన ఆమె ఆ చిత్రానికి కనెక్ట్ అయ్యారట. అందుకు కారణం ఉందట. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వెరవకుండా ముందడుగు వేయాలి అనే పాయింట్ ఈ చిత్రంలో ఉందని, నిహారిక అన్నారు.
Niharika Konidela
సాగులో చెప్పిన ఒక పాయింట్ తో పాటు అనేక కారణాలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఏమైనా పర్లేదు నీకు అండగా మేము ఉన్నాం అనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉంటే జీవితంలో ఏదైనా చేయవచ్చు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సపోర్ట్ చేశారని, నిహారిక చెప్పుకొచ్చింది...
పరోక్షంగా ఆమె విడాకుల గురించి మాట్లాడింది. విడాకుల బాధ నుండి బయటపడేందుకు తన చుట్టూ ఉన్నవారు మద్దతుగా నిలిచారని నిహారిక చెప్పకనే చెప్పింది... నిహారిక ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టింది.