- Home
- Entertainment
- Niharika: మెగా డాటర్ నిహారిక కమ్ బ్యాక్.. తాను నేర్చుకున్నదిదే అంటూ డేరింగ్ పోస్ట్.. వైరల్
Niharika: మెగా డాటర్ నిహారిక కమ్ బ్యాక్.. తాను నేర్చుకున్నదిదే అంటూ డేరింగ్ పోస్ట్.. వైరల్
మెగా డాటర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని డిలీట్ చేసిన విషయం తెలిసింది. మళ్లీ ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే కమ్ బ్యాక్ మాత్రం మామూలుగా ఉండదంటూ చాటుకుంది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.

నిహారిక(Niharika) ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తుంది. అవి వివాదాస్పద అంశాలే కావడంతో మరింత హాట్ టాపిక్ అవుతుంది. నిహారికా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ పబ్ కేసులో బుక్కయ్యింది నిహారికా. డ్రగ్స్ తీసుకుంటున్న పబ్‌లో నిహారికా కనిపించడంతో ఆమెపై కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీస్ లు ఆమెని విచారించారు. అయితే ఈ కేసులో నిహారికకి సంబంధం లేదని తండ్రి నాగబాబు తెలిపారు.
కానీ నిహారికపై ఆరోపణలు, విమర్శలు, ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. సైలెంట్‌గా నిహారికని తప్పించారనే కామెంట్లు వినిపించాయి. మరోవైపు ఈ మధ్య ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్‌లో వీడియోని పంచుకుంది. దీనిపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. నిహారికాని ట్రోలర్స్ ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. జనరల్‌గా నిహారిక తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూనే ఉంటుంది. కానీ ఆ వీడియో మాత్రం విమర్శలకు తావిచ్చింది.
దీంతో మండిపోయిన నిహారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌నే డిలీట్ చేసి ట్రోలర్స్ నోళ్లు మూయించింది. ఏ గొడవ లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. నిహారికాని ఆమె అభిమానులు ఇన్నాళ్లు మిస్ అయ్యారు. దాదాపు ఎనిమిది వారాల గ్యాప్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్. అయితే రెట్టింపు ఉత్సాహంతో, మరింత డేర్‌గా ఆమె కమ్ బ్యాక్ కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఓ పోస్ట్ పంచుకుంది.
అయితే ఈ ఎనిమిది వారాల్లో తాను తెలుసుకున్న అంశాలివే అంటూ నిహారిక మూడు పాయింట్లని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మొదటిది `ఈ ప్రపంచం ఇంకా అంతం కాలేదు`, రెండు - `ఇతరులు ఏం చేస్తున్నారన్నది నేను పట్టించుకోను`, మూడు-`ఇప్పుడు నేను నిజంగా రీఫ్రెష్ అయ్యాను. పోస్ట్ లు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నాను` అంటూ పేర్కొంది నిహారిక.
దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ ఆమె పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు ఇన్నాళ్లు మిస్ అయ్యామని చెబుతున్నారు. చిరంజీవి కూతురు శ్రీజ స్పందించి ఫైరింగ్ ఎమోజీని పంచుకుంది. ఆమె అభిమానులు వెల్ కమ్ టూ కమ్ బ్యాక్ అని, మీకు మేము అండగా ఉంటామని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తంగా కమ్‌బ్యాక్‌తోనే ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది నిహారిక.
మెగా డాటర్‌గా టాలీవుడ్‌లో పాపులర్ అయిన నిహారిక హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. హోస్ట్ గానూ మెరిసింది. కానీ అక్కడ కూడా ఆదరణ దక్కలేదు. ఇక లాభం లేదని భావించిన ఆమె మ్యారేజ్ చేసుకుంది. రెండేళ్ల క్రితం చాలా గ్రాండ్‌గా నిహారిక.. చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయ్యింది. అయితే తన ప్రొడక్షన్ మాత్రం కంటిన్యూ చేస్తుంది.