- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ హీరోయిన్ రీఎంట్రీ మూవీ కన్ఫమ్.. రాజకుమారిగా తెలుగులోకి వస్తోన్న మీరా జాస్మిన్..
పవన్ కళ్యాణ్ హీరోయిన్ రీఎంట్రీ మూవీ కన్ఫమ్.. రాజకుమారిగా తెలుగులోకి వస్తోన్న మీరా జాస్మిన్..
మీరా జాస్మిన్ తెలుగులో హోమ్లీ బ్యూటీగా అలరించింది. పవన్, బాలయ్య, రవితేజ వంటి స్టార్లతోనూ నటించి మెప్పించింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తుంది.

పవన్ కళ్యాణ్ తో `గుడుంబా శంకర్` చిత్రంలో నటించి ఆకట్టుకుంది మీరా జాస్మిన్. ఇందులో పవన్, మీరా జాస్మిన్ ల మధ్య ప్రేమ ఆద్యంతం రక్తి కట్టింది. సినిమా ఆడలేదుగానీ, ఈ ఇద్దరి జోడీ చేసిన రచ్చ ఆడియెన్స్ ని అలరించింది. లవ్, రొమాన్స్ యువత హృదయాలను టచ్ చేసింది. ఇలా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రవితేజ, గోపీచంద్ వంటి స్టార్స్ తోపాటు శివాజీ, జగపతిబాబు, రాజశేఖర్‌లతోనూ కలిసి నటించింది మీరా జాస్మిన్.
మీరా జాస్మిన్ తిప్పి కొడితే తెలుగులో 12 సినిమాలు చేసింది. కానీ ఈ అమ్మడు వేసిన ముద్ర మామూలు కాదు. క్యూట్ అందాలతో అలరించింది. హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. గ్లామర్ షోకి దూరంగా ఉంటూ తెలుగు దనం ఉట్టిపడేలా చేసింది. కేరళా కుట్టి కావడంతో అందాల ప్రదర్శనకి దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించింది. వారికి దగ్గరయ్యింది. `గోరింటాకు` చిత్రంలో రాజశేఖర్ కి చెల్లిగా ఆద్యంతం మెప్పించింది.
2010లో `ఆకాశరామన్న` చిత్రంలో మెరిసింది. అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రంతో బాగానే మెప్పించింది. కానీ సినిమా ఆడలేదు. దీంతో ఆమె తెలుగులో తగ్గించింది. మూడేళ్ల తర్వాత `మోక్ష` అనే మూవీలో మెరిసింది. ఇక అప్పట్నుంచి ఆమె మళ్లీ కనిపించలేదు. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయ్యింది. మొత్తం సినిమాలే మానేసింది. 2014 తర్వాత ఒకటి అర మలయాళ మూవీస్‌లో మెరిసింది.
ఇక గత రెండేళ్ల క్రితం నుంచి మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన భర్త నుంచి ఆమె విడిపోతున్నట్టు, అందుకే మళ్లీ సినిమాల్లోకి వచ్చినట్టు ప్రచారం జరిగింది. కానీ ఆమె పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మీరా జాస్మిన్ మళ్లీ ఆడియెన్స్ ని పలకరిస్తుంది. ఇప్పటికే మలయాళంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రెండు మూడు సినిమాలు చేసింది. అంతేకాదు తెలుగులోనూ రీఎంట్రీకి గత కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తుంది.
ఆ మధ్య `విమానం` అనే ఓటీటీ మూవీలో గెస్ట్ రోల్‌లో మెరిసింది మీరా జాస్మిన్. తాజాగా ఫుల్ లెన్త్ క్యారెక్టర్‌తో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతుంది. `స్వాగ్` అనే చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపికైంది మీరా జాస్మిన్. ఈ మేరకు ఇందులోని ఆమె పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చూడ్డానికి రాజకుమారిని తలపిస్తుంది. నగలు, డిజైనింగ్ శారీలో అదిరిపోయింది మీరా లుక్. ఇది వైరల్ అయ్యింది. శ్రీవిష్ణు హీరోగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ఆయన 14 గెటప్పుల్లో కనిపించబోతున్నాట. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి హసిత్ గోలీ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణలో బిజీగా ఉందీ మూవీ. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త గ్లామర్ పాళ్లు పెంచడానికి కూడా సిద్ధమే అని తెలుస్తుంది. ఆమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేసుకుంటూ నెటిజన్లని ఆకర్షిస్తుంది. పొట్టి బట్టల్లోనూ మెరిసింది. ఈక్రమంలో సినిమాల్లోనూ ఆమె గ్లామర్ పాత్రలు చేస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతం మీరా జాస్మిన్ తెలుగులో `స్వాగ్`తోపాటు తమిళంలో `టెస్ట్`, మలయాళంలో ఓ మూవీలో నటిస్తూ బిజీగా ఉంది. మరింత బిజీ అవుతుంది.