- Home
- Entertainment
- Meera Jasmine Latest Photos: గ్లామర్ తో హంటింగ్ చేస్తున్న మీరా జాస్మిన్.. షర్ట్ బటన్స్ తీసేసి..
Meera Jasmine Latest Photos: గ్లామర్ తో హంటింగ్ చేస్తున్న మీరా జాస్మిన్.. షర్ట్ బటన్స్ తీసేసి..
తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన మీరా జాస్మిన్ (Meera Jasmine) కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు నెటిజన్లను ఆకర్షించేందుకు గ్లామర్ ఫొటోలతో హల్ చల్ చేస్తోంది.

2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘మీరా జాస్మిన్’. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.
అమాయక చూపులు, చిరు నవ్వు, నాజూకైన అందంతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది. మీరా జాస్మిన్ మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించిన మీరా జాస్మిన్ కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. ఈ అందాల భామ మళ్ళీ వెండితెర రీఎంట్రీకి రెడీ అవుతోంది. ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.
రీఎంట్రీలో అక్క, వదిన, ఇతర సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ (Ram Pothineni) సినిమాలో జాస్మిన్ ఎలా రోల్ చేయబోతున్నదనే సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు కూడా కన్షామ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, సౌత్ రీఎంట్రీని పక్కా చేసిన ఈ చిట్టి నడుము హీరోయిన్.. సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. కుర్రాళ్ల హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేలా హాట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. ఏకంగా షర్ట్ బటన్స్ తీసేసి ఫొటోలకు ఫోజులిస్తోంది.
తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్లూ కలర్ జీన్ షర్ట్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోంది మీరా జాస్మిన్. 40 ఏండ్లు పూర్తి చేసుకున్న సుందరి ఇంకా తన గ్లామర్ తో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది. సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.