నర్గీస్ పోజుని రీ క్రియేట్ చేసిన మీనాక్షి చౌదరి.. ముంబయిలో చీరలో అలనాటి తారలా మెరిసిపోతున్న `హిట్` బ్యూటీ
మీనాక్షి చౌదరి ఇప్పుడు టాలీవుడ్‌లో రైజింగ్ స్టార్. ఆమె హీరోయిన్‌గా ఒక్కో అవకాశం దక్కించుకుంటూ ఎదుగుతుంది. స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అందాల విందుతో అలరిస్తుంది.
`ఖిలాడీ` చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి. ఇందులో ఆమె మంచి నటన, క్రేజీ డాన్సులతో అలరించింది. మరోవైపు గ్లామర్ షోతో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. సినిమా ఆడలేదు కానీ, ఈ బ్యూటీకి పేరొచ్చింది.
`హిట్2` మూవీ ఈ బ్యూటీకి బ్రేక్ ఇచ్చింది. ఇందులో అడవిశేష్ లవర్‌గా నటించింది. సహజీవనం చేసే అమ్మాయిగా ఆయనతో కలసి నటించి మెప్పించింది. కాస్త గ్లామరస్‌గా, ఇంకాస్త బోల్డ్ గా నటించింది.
ఆ మధ్య `హత్య్` చిత్రంలో నటించింది. పాప్ సింగర్‌గా మెరిసింది. కాసేపు కనిపించినా, తన ఇంపాక్ట్ ని చూపించింది. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీ అవుతున్న ఈ భామ ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్ చేసింది.
ఉన్నట్టుండి నర్గీస్‌లా మారింది. అలనాటి తార నర్గీస్ దత్.. లా తనని తాను రీక్రియేట్ చేసుకుంది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది. ముంబయి బీచ్ సమీపంలోని చాటౌ మెరై్ మాన్షన్ లో 1950లో నర్గీస్ అలా బిల్డింగ్‌పై కూర్చొని ఫోటో దిగింది. ఈ ఐకానిక్ ఫోటోని మీనాక్షి పున సృష్టించడం విశేషం.
సేమ్ ప్లేస్, సేమ్ బిల్డింగ్, సేమ్ స్టయిల్‌లో మీనాక్షి చౌదరి ఫోటో దిగింది. తాను నర్గీస్ చిత్రాన్ని రీక్రియేట్ చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ, తాను ఈ వ్యూని మొదటిసారి చూసినప్పుడు ముంబయిలో ఉన్న మాయాజాలం చూసి ఆశ్చర్యపోయాను. అప్పట్నుంచి ఇప్పటి వరకు పెద్దగా మారలేదు.
ఈ సిటీ అందం, వెచ్చదనం, బీచ్ అలానే ఉందని, ఇది తనని ఎంతగానో ఆకట్టుకుంటుందని, ఆకర్షిస్తుందని తెలిపింది మీనాక్షి. ఈ సందర్భంగా రెడ్ వారీలో ఆమె దిగిన ఫోటోల నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. చూడ్డానికి మీనాక్షి కూడా నర్గీస్‌ని తలపిస్తుండటం విశేషం.
Meenakshi Chaudhary
ఇక మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉంది. ఆమె మహేష్‌తో `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తుంది. సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. మరోవైపు విశ్వక్ సేన్ తో ఓ చిత్రం చేస్తుంది. అలాగే వరుణ్ తేజ్‌తో `మట్కా` మూవీ, `లక్కీ భాస్కర్` సినిమాలతోపాటు తమిళంలో విజయ్‌తో ఓ సినిమా, `సింగపూర్ సెలూన్` అని మరో సినిమా చేస్తుంది మీనాక్షి.