meenakshi chaudhary: మతిపోగొడుతున్న మీనాక్షి, కిలాడి బ్యూటీ కిర్రాక్ అందం
కిర్రాక్ అందంతో మతి పొగొడుతోంది మీనాక్షీ. కిలాడి బ్యూటీ మత్తు కళ్ళతో మెస్మరైజ్ చేస్తోంది. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోస్ తో రచ్చ చేస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో.. చిన్నగా ఇండస్ట్రీలో ఇమేజ్ డెవలప్ చేసుకుంటుంది మీనాక్షీ చౌదరి. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మీనాక్షి చౌదరి... మెల్ల మెల్లగా స్టార్ డమ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. చిన్న సినిమాలతో స్టార్ట్ చేసి.. స్టార్ హీరోల సరసన మెరుస్తోంది బ్యూటీ.
అందంతో ఫిదా చేస్తోంది మీనాక్షీ. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటో లో ఆమె బయటకు తొంగి చూస్తూ.. యవ్వనాలు ప్రదర్శనతో మతులు పోగొట్టేస్తుంది. వీటికి తోడు కొంటె చూపులతో కట్టి పడేస్తూ... అందాల విందు చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తున్నాయి.
ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షీ చౌదరి. ఈ సినిమా యావరేజ్ అనిపించుకున్నా... మూవీలో మీనాక్షీ నటన మరియు లుక్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఖిలాడి సినిమాలో ఛాన్స్ ను దక్కించుకుంది బ్యూటీ.
ఖిలాడీ సినిమాలో రవితేజ తో రొమాన్స్ చేసిన మీనాక్షి చౌదరి కి మంచి గుర్తింపు దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా నిరాశ పర్చడంతో టాలీవుడ్ లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. మంచి సినిమా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడు త్వరలోనే ఒక తమిళ సినిమాకు సైన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగులె మరో అవకాశం ఆమెను వరించిందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా ఇప్పటి వరకు కమర్షియల్ హిట్ ను అయితే అందుకోలేదు మీనాక్షీ చౌదూరి. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత తో అందరిని ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ అని నిరూపించుకుంటుంది.
సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి స్టార్ హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలను చేసేందుకు ఆసక్తిగా ఉంది. చూడగానే వావ్ అనిపించే అందం ఈ అమ్మడి సొంతం. అందుకే ఈమెకు కాస్త వెనుక ముందు అయినా కూడా మంచి కమర్షియల్ హిట్స్ దక్కితే చాలు అనుకుంటుంది హీరోయిన్.