#Eagle Review:ఈగల్ మూవీ ట్విట్టర్ రివ్యూ, రవితేజ మాస్ కమ్ బ్యాక్
ఈరోజు( జనవరి 9) ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించి ఈగల్ సినిమా. అయితే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్‌లో గురువారం రాత్రి (ఫిబ్రవరి 8) ప్రీమియర్లు స్టార్ట్ అయ్యాయి. మరి ఈ సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఏమని రివ్యూ ఇస్తున్నారంటే..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన సినిమా ఈగల్. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవ్వగా.. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ఈసినిమా రిలీజ్ అవుతోంది.
Eagle
ఈగల్ సినిమాపై మిక్స్డ్ టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ ఉందని.. సెకండ్ హాఫ సినిమా యావరేజ్ గా ఉందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో నెటిజన్ మాత్రం డైరెక్షన్ సూపర్ గా ఉందని.. రవితేజ యాక్టింగ్ అద్భుతం అని.. బిజీఎం అయితే చించేశాడంటూ ట్వీట్ చేశాడు.
ఇక రవితేజ ఫ్యాన్స్ అయితే సినిమాపై పాజిటీవ్ ప్రచారం గట్టిగా చేసుకుంటున్నారు. మైండ్ బ్లోయింగ్ మూవీ అని.. యాక్షన్ సీక్వెన్స్ లు ఇరగదీశారని.. పెర్ఫామెన్స్ లు బెస్ట్ ఇచ్చారని.. క్లైమాక్స్ అయితే అసలు చెప్పడానికి లేదు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
చాలా వరకూ ఈగల్ పై పాజిటీవ్ రివ్యస్ వస్తున్నాయి. బొమ్మ బ్లాక్ బస్టర్ అయి కొందరు అంటుంటే..మరికొందరేమో.. రవితేజ్ మాస్ కంబ్యాక్ అంటూ.. ఖుషీ అవుతున్నారు. మరో నెటిజన్ అయితే రవన్న ఇరుగదీసి దెబ్బ కొట్టాడు అంటూ.. ఓ వీడియోను పోస్టు చేశాడు.
Eagle
ఇక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉన్నాయి అని ఓ నెటిజన్ అనగా...రవితేజ తన ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ బాగుంది అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
ఇకహీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా కామెంట్లు పెట్టారు. ఆమె సహజంగా నటించిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారునెటిజన్లు.
ఈగిల్ ఫస్టాఫ్ బాగుంది. థియేటర్‌లో ఇంటర్వెల్ సీన్ బ్లాస్ట్ అయింది. రవితేజ బీస్ట్ లా కనిపించాడు. ముక్యంగా యాక్షన్ సీన్లు.. వీఎఫ్ ఎక్స్ లు బాగున్నాయి. బాగా వర్కౌట్ అయ్యాయి. అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. సెకండాఫ్ చాలా బాగుంది. రవితేజ కమ్ బ్యాక్ మూవీ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు అన్నారు మరో యూజర్.