MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సూపర్ హిట్ 'మార్కో' OTT రిలీజ్ మేటర్

సూపర్ హిట్ 'మార్కో' OTT రిలీజ్ మేటర్

ఉన్ని ముకుందన్ నటించిన 'మార్కో' సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వస్తున్న వార్తలపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 08 2025, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
unni Mukundan movie marco

unni Mukundan movie marco


మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ లీడ్​ రోల్​లో నటించిన సినిమా 'మార్కో' సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఫుల్ యాక్షన్ జానర్​లో దర్శకుడు హనీఫ్ ఈ సినిమా తెరకెక్కించి సెన్సేషన్ సక్సెస్ సాధించారు. ఈ చిత్రం డిసెంబర్ 20న మలయాళంలో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.

తర్వాత నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, జనవరి 3న తమిళ్​లోనూ రిలీజ్ అయ్యింది. హింస ఉన్నా ఫుల్  యాక్షన్ జనాలకు బాగా నచ్చింది. బాక్సాఫీస్ వద్ద మార్కో దుమ్ము రేపుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Unni Mukundan Marco

Unni Mukundan Marco


'మార్కో'  సినిమా అతి తక్కువ టైమ్ లోనే  రూ.100 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. 15 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి వరల్డ్​వైడ్​గా ఈ సినిమా రూ. 100కోట్ల కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ అఫీషియల్​గా ప్రకటించారు. దీంతో మలయాళంలో రూ.100 కోట్లు వసూల్ చేసిన అతి కొద్ది సినిమాల్లో మార్కో కూడా చేరిపోయింది.  కేవ‌లం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఈ క్రమంలో ఈ సినిమా  OTT రిలీజ్ గురించి వార్తలు మొదలయ్యాయి.

36
Unni Mukundan Marco

Unni Mukundan Marco


'మార్కో' డిసెంబర్ 20న మలయాళం లో రిలీజ్ అయింది. దాంతో ఈ మూవీని 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని టాక్ నడిచింది. జనవరి చివరలో లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో 'మార్కో' మూవీ ఎక్స్టెంటెడ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చాయి. తాజాగా మేకర్స్  క్లారిటీ ఇచ్చారు.  చిత్ర టీమ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ను రిలీజ్ చేసి, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి క్లారిటీ ఇచ్చింది.

46


  ఆ పోస్ట్ లో ఏముందంటే...  "మార్కో మూవీ ఓటీటీ రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పలు రూమర్లు సర్కులేట్ అవుతున్నాయి. వాటి గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాము. ఇప్పటికైతే మేము ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ కి లేదా ఏ ఓటీటీ డీల్ కి సైన్ చేయలేదు.

ఒకవేళ ఇలాంటి న్యూస్ ఏదైనా బయటకు వచ్చిందంటే, అది ఖచ్చితంగా ఫేక్ న్యూస్. మార్కో మూవీ సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం క్రియేట్ చేసాము. ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఈ సినిమాను ఎంజాయ్ చేయడాలనే మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ ఈ మూవీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మేం కూడా ఈ సినిమాను మిమ్మల్ని థియేటర్లలోనే చూడమని రికమెండ్ చేస్తాము. 
 

56


ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న ఇంటెన్సిటీ, విజువల్స్, సౌండ్ డిజైన్ ను ఎక్స్పీరియన్స్ చేయాలంటే థియేటర్లో చూస్తేనే బెటర్. ఒకవేళ ఓటీటీ డీల్స్ గనక ఫైనలైజ్ అయితే, తప్పకుండా మేమే అఫీషియల్ గా ఆ న్యూస్ ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకుంటాము. సదరు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తాము.

కాబట్టి అప్పటిదాకా మార్కో మూవీకి సంబంధించిన ఎలాంటి ఓటీటీ వార్తలను సర్కులేట్ చేయొద్దని, అలాంటి వార్తలు వచ్చినా నమ్మొద్దని ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాను దగ్గరలోని థియేటర్లలో చూసి ఎంజాయ్ చేద్దాం. ప్రతి ఒక్కరికి ఈ సినిమాకు సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు" అంటూ సుధీర్ఘ నోట్ రిలీజ్ చేశారు నిర్మాతలు. 

  

66
marco sequels

marco sequels


రివేంజ్ డ్రామాగా మార్కో మూవీ తెర‌కెక్కింది. కొచ్చిన్‌లోని గోల్డ్ సిండికేట్ లీడ‌ర్ జార్జ్ (సిద్ధిఖీ) త‌మ్ముడు విక్ట‌ర్ (ఇషాన్‌)అంధుడు. విక్ట‌ర్‌ను కొంద‌రు దారుణంగా చంపేస్తారు. విక్ట‌ర్‌ను చంపిన వాళ్ల‌పై మార్కో ప‌గ‌తో ర‌లిగిపోతాడు. ఆ హంత‌కుల‌ను మార్కో ఎలా క‌నిపెట్టాడు? ఈ హ‌త్య‌కు టోనీ ఇసాక్‌, ర‌సెల్ ఇసాక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? మార్కో రివేంజ్ కార‌ణంగా జార్జ్ ఫ్యామిలీకి ఎలాంటి న‌ష్టం జ‌రిగింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
MS Subbulakshmi: మరణించి 20 ఏళ్లు దాటినా.. తిరుమలలో నిత్యం వినిపించే స్వరం, ఎమ్ఎస్ సుబ్బులక్ష్మి ఖాతాలో చెరపలేని రికార్డులెన్నో..
Recommended image2
Sneha Photos: ఏంజెల్‌లా మెరిసిపోతున్న స్నేహ.. పోజులతో పనిలేదు, చిన్న స్మైల్‌ చాలు.. చూస్తే ఫిదా
Recommended image3
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved