30 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉన్న హీరోతో రొమాన్స్, భారీ ఫ్లాపులతో బెంబేలెత్తించిన హీరోయిన్
ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు బాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగారు. ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా అయితే స్టార్ హీరోలని డామినేట్ చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు.వారి తరహాలోనే రాణించాలని మానుషీ చిల్లర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.

Manushi chhillar
కొందరు హీరోయిన్లు అందంతో ఆకట్టుకున్నప్పటికీ విజయాలకు ఆమడ దూరంలో ఉంటారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లాంటి హీరోయిన్లు బాలీవుడ్ లో స్టార్లుగా ఎదిగారు.
ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా అయితే స్టార్ హీరోలని డామినేట్ చేస్తూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి చేరుకున్నారు. వారి తరహాలోనే బాలీవుడ్ లో రాణించాలని 2017లో మిస్ వరల్డ్ గా నిలిచిన మానుషీ చిల్లర్ సినిమాల్లోకి అడుగుపెట్టింది.
హీరోయిన్ గా ఆమె ఏమాత్రం రాణించలేకుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా అయితే నిర్మాతలు బెంబేలెత్తే డిజాస్టర్లు ఎదురయ్యాయి. వరుణ్ తేజ్ సరసన నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్రం మినిమమ్ వసూళ్లు కూడా సాధించలేదు. ఆ మూవీ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత ఆమె బాలీవుడ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ బడే మియా చోటే మియా అయితే గత ఏడాది బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఈ చిత్రంలో కలసి నటించారు.
తనకంటే వయసులో 30 ఏళ్ళు పెద్ద అయిన అక్షయ్ కుమార్ కి జోడిగా మానుషీ ఈ చిత్రంలో నటించింది. ఈ మూవీతో మానుషీ విమర్శలు కూడా ఎదుర్కొంది. మానుషీ చిల్లర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.