MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prema Entha Madhuram: పేలైన మాన్సీ ప్లాన్.. ఆర్య ను చేరుకున్న అను!

Prema Entha Madhuram: పేలైన మాన్సీ ప్లాన్.. ఆర్య ను చేరుకున్న అను!

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ భార్యాభర్తల అనురాగానికి ప్రతీకగా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తన భర్తకి ఏదో అయిపోతుంది అని భయపడి భర్తకి దూరమై మళ్లీ భర్తకి చేరువైన ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Jun 10 2023, 07:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

 ఎపిసోడ్ ప్రారంభంలో సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాలి అంతేకానీ సమస్య నుంచి పారిపోకూడదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అయినా ఆ బాబుకి ఏదో అవుతుంది అని అనుకుంటే పాపతో పూజ చేయించిన రోజే ఏదో అయ్యి ఉండేది. మనసులో పిచ్చిపిచ్చి ఆలోచనలు ఏవి పెట్టుకోవద్దు ఇంకా నువ్వు దూరంగా ఉంటేనే ఆ బాబు మీకోసం ఆలోచిస్తూ ఏమైనా అయిపోగలడు అంటుంది బామ్మ.
 

28

 అలా అనొద్దు అంటూ కంగారు పడుతుంది అను. మరేంటమ్మా.. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నువ్వు బాధపడి ఆ బాబుని బాధ పెట్టొద్దు. మీరు చాలా మంచివారు మీకు ఎందుకు చెడు జరుగుతుంది. నేను చెప్పినట్లు విను పద మీ ఇంటికి వెళ్దాం. నామకరణం ఆ బాబు చేతుల మీదుగానే చేయిద్దాం అంటూ అనుని తీసుకొని బయలుదేరుతుంది బామ్మ.
 

38

 మరోవైపు అనుకి ఇష్టమైనవన్నీ రెడీ చేయమని వంట వాళ్లకి చెప్తుంది శారదమ్మ. నేను చేస్తాను ఆంటీ..ప్రాసెస్ మీరు చెప్పండి అంటూ ఉత్సాహంగా శారదమ్మ దగ్గర నేర్చుకుని మరీ వంటలు చేస్తుంది అంజలి. వీళ్ళ నమ్మకమే నిజమే అను తిరిగి వచ్చేస్తే నా పరిస్థితి  అంతే.. అని మనసులో కంగారుపడుతుంది మాన్సీ. మరోవైపు ఆటోలో వస్తున్న అను వాళ్ళని చూస్తుంది మాన్సీ మనిషి. ఫోటో తీసి మాన్సీ కి పంపిస్తుంది.
 

48

 ఫోన్ చేసి అను మీ ఇంటికి వస్తుంది మీకు ఫోటో తీసి పంపించాను చూడండి అని మాన్సీ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. తను దర్జాగా ఇంటికి  వస్తుంటే మీరేం చేస్తున్నారు సినిమా చూస్తున్నారా.. తనని ఇంటికి రాకుండా ఆపండి అంటూ కోప్పడుతుంది మాన్సీ. అలాగే మేడం అంటూ రౌడీలని తీసుకొని అనుని వెంబడిస్తుంది మాన్సీ మనిషి. అదృష్టం కొద్దీ కాస్తలో తప్పించుకొని అను వాళ్ళ వీధిలోకి వెళ్ళిపోతుంది.
 

58

అదే విషయాన్ని మాన్సీ కి ఫోన్ చేసి చెప్తుంది  మాన్సీ మనిషి. ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంతో రగిలిపోతుంది మాన్సీ. ఆ తరువాత గుమ్మం ముందు ఆటో ఆగితే అనుమానంగా చూస్తాడు జెండే. ఆటోలో నుంచి దిగుతున్న అను ని చూసి షాక్ అవుతాడు. తర్వాత ఆనందంతో ఆర్య ని కేక వేసి పిలుస్తాడు.నీరజ్ ఆటో దగ్గరికి వచ్చి వదినమ్మ.. అని పలకరించి పాపని ఎత్తుకుంటాడు. జెండే ఒక పాపని ఎత్తుకుంటాడు.
 

68

జెండే పిలుపుకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఆర్య అనుని చూసి ఎమోషనల్ అవుతాడు. దాదాపు అను ఆర్య ఇద్దరు కన్నీరు పెట్టుకుంటారు ఒకరిని ఒకరు హగ్ చేసుకుంటారు. ఎందుకు వెళ్లిపోయావు నావల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని అడుగుతాడు ఆర్య. అలాంటిదేమీ లేదు అంటూ జరిగిందంతా చెప్తుంది అను. మళ్లీ మీకు జీవితంలో కనిపించకూడదని అనుకున్నాను కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకపోయాను అందుకే వచ్చేసాను.
 

78

 బామ్మ కూడా నేను చేసింది మంచి పని కాదని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చింది అని చెప్తుంది అను.  బామ్మా అంటూ అనుమానంగా చూస్తాడు ఆర్య. బామ్మ ని చూసిన ఆర్య అంటే.. ఆరోజు గుడిలో పూజ చేయించిన పాప నిన్న ఇంట్లో చూసిన పాప.. అంటూ ఎమోషనల్ అవుతాడు ఆర్య. మన పాపే మనటంతో కన్నీరు పెట్టుకుంటూ జండే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్లి పిల్లలిద్దర్నీ ఎత్తుకొని ముద్దాడుతాడు. ఈ క్షణం కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూశానో తెలుసా.. మరి ఎప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు మన ప్రేమే మనకి రక్ష అంటాడు ఆర్య. మరి ఇప్పుడు ఇలా చేయను క్షమించమని అడుగుతుంది అను. 

88

వాళ్ళిద్దరూ అలా ఎమోషనల్ అవుతూ ఉండగానే సుబ్బు దంపతులు వస్తారు కూతుర్ని చూసి ఎమోషనల్ అవుతారు పిల్లల జర్నీ ఎత్తుకొని ముద్దాడుతారు. శారదమ్మ కూడా పిల్లల్ని ముద్దాడుతుంది. ముద్దులు మురిపాలు అన్ని ఇంటిబయటేనా.. ముందు వాళ్ళని లోపలికి రానీయండి అంటుంది అంజలి. ఆ దంపతులకి హారతి ఇస్తుంది అంజలి. కుడికాలు ముందు పెట్టి దంపతులిద్దరూ లోపలికి వస్తారు తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Recommended image2
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్
Recommended image3
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved