- Home
- Entertainment
- చివరికి కృష్ణంరాజు, మోహన్ బాబు సినిమాలని కూడా రచ్చకి లాగిన మంచు బ్రదర్స్.. అవి ఏ చిత్రాలో తెలుసా
చివరికి కృష్ణంరాజు, మోహన్ బాబు సినిమాలని కూడా రచ్చకి లాగిన మంచు బ్రదర్స్.. అవి ఏ చిత్రాలో తెలుసా
మంచు ఫ్యామిలీలో కొన్ని వారాలుగా ఆస్తి గొడవలు, ఆధిపత్య పోరు జరుగుతోంది. మంచు మనోజ్ కి తన సోదరుడు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆస్తి పంపకాల విషయంలో ఇంట్లో గొడవలు వీధికెక్కాయి. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు.

మంచు ఫ్యామిలీలో కొన్ని వారాలుగా ఆస్తి గొడవలు, ఆధిపత్య పోరు జరుగుతోంది. మంచు మనోజ్ కి తన సోదరుడు విష్ణు, తండ్రి మోహన్ బాబుతో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఆస్తి పంపకాల విషయంలో ఇంట్లో గొడవలు వీధికెక్కాయి. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. మోహన్ బాబు ఇంట్లోకి మంచు మనోజ్ తన అనుచరులతో బలవంతంగా వెళ్ళడానికి ప్రయత్నించడం.. గేటు దగ్గర హంగామా చేయడం చూశాం.
జర్నలిస్ట్ పై దాడి సంఘటనలో మోహన్ బాబు తీవ్ర ఆరోపణలు, కేసులు ఎదుర్కొన్నారు. ఇంత జరిగినా గొడవలు చల్లారడం లేదు. సంక్రాంతి పండుగ వాతావరణంలో కూడా గొడవలు తప్పలేదు. మోహన్ బాబు, మంచు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు తిరుపతి కాలేజీలో భోగి పండుగని ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇంతలో మంచు విష్ణు కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయ్నతించగా పెద్ద రచ్చ జరిగింది. కాలేజీలోకి వెళ్లేందుకు మనోజ్ కి అనుమతి ఇవ్వలేదు.
చివరికి పోలీసుల అనుమతితో తన తాత సమాధి వద్దకి వెళ్లేందుకు మాత్రమే మంచు మనోజ్ కి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత మంచు మనోజ్.. కాలేజీలో జరుగుతున్న వ్యవహారాలపై మాట్లాడుతూ తన సోదరుడు మంచు విష్ణుపై విమర్శలు చేశారు. కానీ ఊహించని విధంగా మనోజ్, విష్ణు మధ్య ట్విట్టర్ లో కూడా వార్ మొదలయింది. వీళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు కుక్కలతో పోల్చుకుంటూ విమర్శలు చేసుకోవడం దారుణంగా ఉంది.
ఈ ట్వీట్ వార్ లో విష్ణు, మనోజ్ చివరికి కృష్ణంరాజు, మోహన్ బాబు సినిమాలని కూడా తెరపైకి తీసుకువచ్చారు. మంచు విష్ణు.. మోహన్ బాబు 'రౌడీ' చిత్రంలోని డైలాగ్ పోస్ట్ చేస్తూ మనోజ్ ని ట్రోల్ చేశారు. 'సింహం కావాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటావని ఆశ' ఇది తన ఫేవరిట్ డైలాగ్ అంటూ విష్ణు పోస్ట్ చేశారు.
విష్ణుకి కౌంటర్ గా మంచు మనోజ్ కృష్ణంరాజు సినిమా గురించి పోస్ట్ చేశారు. 'కన్నప్ప లో కృష్ణం రాజు గారిలాగా కావాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్ అంటూ మనోజ్ కౌంటర్ ఇచ్చాడు. కృష్ణంరాజు కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు చిత్రాల పోస్టర్స్ ని పోస్ట్ చేశాడు. అన్నదమ్ములు ఇంత నీఛంగా బహిరంగంగా ట్రోల్ చేసుకుంటున్నారు ఏంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.