8 కంటైనర్లని న్యూజిలాండ్ తరలించిన మంచు విష్ణు.. కన్నప్ప కోసం భారీ ప్లాన్, తగ్గేదే లే..
మంచు విష్ణు కి చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు.
మంచు విష్ణు కి చాలా కాలంగా సరైన సక్సెస్ లేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే మంచు విష్ణు తన కలల ప్రాజెక్ట్ కోసం తెరవెనుక చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప పాత్రలో నటించాలనేది మంచు విష్ణు కోరిక.
తన కలల ప్రాజెక్ట్ ని నెరవేర్చుకునే దిశగా మంచు విష్ణు అడుగులు పడుతున్నాయి. ఇటీవల శ్రీకాళహస్తిలో మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. మహాభారతం టెలివిజన్ సిరీస్ దర్శకులలో ఒకరైన ముకేశ్ కుమార్ సింగ్.. మంచు విష్ణు 'కన్నప్ప' చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. విష్ణు సరసన కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్ గా ఎంపికైంది.
కానీ వివిధ కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. దీనితో చిత్ర యూనిట్ కొత్త హీరోయిన్ వేటలో ఉంది. ఇంతలో ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలని చిత్ర యానిటీ ఫినిష్ చేస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో సింగిల్ షెడ్యూల్ లో జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రం కోసం భారీ సెట్లు, ఇతర సామాగ్రి అవసరం అవుతాయి. వీటికోసం గత 5 నెలలుగా 800 మంది సిబ్బంది కష్టపడుతున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. సెట్స్ కి సంబంధించిన సామాగ్రి, ఆయుధాల తయారీ పనులు పూర్తయ్యాయి. దీనితో షూటింగ్ కోసం సామాగ్రి మొత్తాన్ని 8 భారీ కంటైనర్లలో న్యూజిలాండ్ తరలించినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. సముద్రమార్గం ద్వారా వీటిని తరలించారు.
వీడియో ద్వారా సామాగ్రి, సెట్ కి సంబందించిన వస్తువులు, ఆయుధాల్ని చూపించారు. అబ్బురపరిచేలా ఆయుధాలు, సెట్ కి సంబంధించిన భాగాలు ఉన్నాయి. చూస్తుంటే మంచు విష్ణు మూవీ క్వాలిటీ, అవుట్ ఫుట్ విషయంలో ఎక్కడా రాజీ పడుతున్నట్లు అనిపించడం లేదు.
న్యూజిలాండ్ లో అతి త్వరలో షూటింగ్ షురూ కానుంది. నటీనటులంతా న్యూజిలాండ్ వెళ్లనున్నారు. త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తాం అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది.