- Home
- Entertainment
- Kannappa OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మంచు విష్ణు `కన్నప్ప`.. ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్
Kannappa OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి మంచు విష్ణు `కన్నప్ప`.. ప్లాట్‌ఫామ్, స్ట్రీమింగ్ డేట్
మంచు విష్ణు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ కలిసి నటించిన `కన్నప్ప` సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. చాలా లేట్‌గా ఓటీటీలో సందడి చేయడానికి వస్తుంది.

ఓటీటీలోకి `కన్నప్ప` మూవీ
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిన మూవీ `కన్నప్ప`రెండు నెలల క్రితమే ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించుకుంది. అయితే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోయినా మంచు విష్ణు, మోహన్ బాబులకు మాత్రం మంచి సంతృప్తినిచ్చింది. వారికి ప్రశంసలు దక్కాయి. అయితే ఈ సినిమా థియేటర్లో విడుదలై రెండు నెలలు దాటిపోయింది. జూన్ 27న ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
సెప్టెంబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో `కన్నప్ప`
`కన్నప్ప` మూవీ దాదాపు పది వారాల తర్వాత ఓటీటీలోకి రానుండటం విశేషం. సినిమా విడుదల సమయంలోనే మంచు విష్ణు ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పట్లో ఓటీటీలోకి రాదు అని, పది వారాల తర్వాతనే రానుందని చెప్పారు. ఇప్పుడు పది వారాల తర్వాతనే `కన్నప్ప` మూవీ ఓటీటీలోకి రాబోతుండటం విశేషం. సెప్టెంబర్ 4 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్‌లో `కన్నప్ప` మూవీ స్ట్రీమింగ్ కానుంది.
తిన్నడుగా అదరగొట్టిన మంచు విష్ణు
‘కన్నప్ప’ చిత్రం విష్ణు మంచు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. తిన్నడు పాత్రలో ఓ గిరిజన యోధుడిగా ఆయన పోషించిన పాత్ర అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మించగా.. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. న్యూజిలాండ్‌లోని అందమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచింది. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రాంకా, ప్రీతి ముకుందన్ వంటి తారాగణం కీలక పాత్రల్లో నటించారు.
ప్రభాస్, అక్షయ్ వంటి భారీ కాస్టింగ్‌తో వచ్చిన `కన్నప్ప`
వీరితోపాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటివారు ప్రత్యేక పాత్రలు పోషించడం వల్ల ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరి స్పెషల్ అప్పియరెన్స్ సినిమాను అందరి దగ్గరకు తీసుకు వెళ్లింది. విష్ణు మంచు కుమారుడు అవ్రామ్ మంచు నటుడిగా అరంగేట్రం చేయడం, అతని కుమార్తెలు అరియానా, వివియానా ఓ పాటలో నటించడంతో మరింత స్పెషల్‌గా మారింది. స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందరి హృదయాల్ని తాకింది. ‘శివా శివా శంకరా’ అనే పాట దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇక దేవుడంటే నమ్మకం లేని గిరిజన యోధుడు తిన్నడు కన్నప్పగా ఎలా మారాడు? దేవుడిని నమ్మేందుకు దారితీసిన పరిస్థితులేంటి? అనేదే ఈ సినిమా. ఆద్యంతం డివోషనల్‌గా సాగుతూ ఆకట్టుకుంది `కన్పప్ప`. థియేటర్లో పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ ఓటీటీలో ఏ మేరకు ఆదరణ పొందుతుందో చూడాలి.