MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మౌనికని వదిలేసి డబ్బు కోసం ఆ పని చేసుంటే నేను బ్రతకడమే వేస్ట్.. సంచలన విషయం రివీల్ చేసిన మంచు మనోజ్

మౌనికని వదిలేసి డబ్బు కోసం ఆ పని చేసుంటే నేను బ్రతకడమే వేస్ట్.. సంచలన విషయం రివీల్ చేసిన మంచు మనోజ్

 తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక.. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Apr 19 2023, 04:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

హీరో మంచు మనోజ్, భూమా మౌనిక ఇటీవల వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వీరిద్దరికి ఇది రెండవ వివాహమే. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మంచు ఫ్యామిలీ నుంచి మనోజ్.. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి భూమా మౌనిక రావడంతో వీరిద్దరి ప్రేమ పెళ్లిపై అందరిలో ఆసక్తి పెరిగింది. 

 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

వివాహం తర్వాత వీరిద్దరూ సంతోషంగా జీవితం సాగిస్తున్నారు. తాజాగా మంచు మనోజ్, భూమా మౌనిక.. కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలా మొదలైంది షోలో పాల్గొన్నారు. ఈ షోలో వెన్నెల కిషోర్.. మౌనిక, మనోజ్ జీవితంలో అనుభవించిన కష్టాలు.. వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది లాంటి విషయాల్ని అడిగి తెలుసుకున్నారు. 

 

37

మొదట లవ్ ప్రపోజ్ నేనే చేశాను అని మనోజ్ తెలిపారు. మౌనిక జీవితంలో అనుభవించిన కష్టాల చూసి నా కష్టాలు చాలా చిన్నవి అనిపించింది. అప్పుడే ఆమె పై ప్రేమ మొదలయింది. ఆమెని కలసి నువ్వంటే ప్రాణం.. నీతో జీవితాంతం సంతోషంగా బతకాలని ఉంది అని చెప్పా. నువ్వు ఒప్పుకుంటే నిన్ను, బాబుని నా జీవితంలోని ఆహ్వానిస్తా అని చెప్పా. 

 

47

అప్పుడు మౌనిక అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా ? సమాజం, కుటుంబం గురించి ఆలోచించావా ? మీ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ? అని అడిగింది. అవన్నీ ఆలోచించకు.. మా ఇంట్లో నేను చెబితే ఒకే చెబుతారు. అయినా అది నా ప్రాబ్లెమ్. నేను చూసుకుంటాను అని చెప్పా. దీనితో మౌనిక కూడా ఓకే చెప్పింది. శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. అప్పుడే మా వనవాసం మొదలయింది అని మనోజ్ తెలిపారు. 

 

57

చాలా కాలం క్రితం మంచు మనోజ్ అహం బ్రహ్మాస్మి అనే చిత్రాన్ని ప్రారంభించారు. మౌనిక కోసమే ఆ చిత్రాన్ని మనోజ్ వదిలేశాడట. ఆ చిత్రం ఏమైంది అని వెన్నెల కిషోర్ ప్రశ్నించగా మనోజ్ అసలు విషయం రివీల్ చేశాడు. అహం బ్రహ్మాస్మి కోసం రెండేళ్ల పాటు కష్టపడ్డాం. ఈ చిత్ర ఓపెనింగ్ కి నా మిత్రుడు రాంచరణ్ వచ్చారు. అదే సమయంలో మౌనికతో నా బంధం ఏర్పడింది. 

 

67

మౌనిక నన్ను నమ్ముకుని వచ్చింది. ఆ సమయంలో నేను కెరీర్ కోసం, డబ్బు కోసం ఆశ పడి ఉంటే నేను బ్రతకడమే వేస్ట్. నేను అలా బ్రతకలేను. సినిమానా.. మౌనికా అని అనుకున్నప్పుడు నేను మౌనికని ఎంపిక చేసుకున్నా. ఇక్కడ ఉంటే మాకు ఇబ్బంది అవుతుందని చెన్నై కి వెళ్లాం. ఏడాదిన్నర పాటు చెన్నైలోనే ఉన్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు.  దీనితో తప్పని పరిస్థితుల్లో అహం బ్రహ్మాస్మిని వదిలేశా. దర్శకుడు శ్రీకాంత్ ని క్షమించమని కోరా. ఇప్పుడు శ్రీకాంత్ వైష్ణవ్ తేజ్ తో సినిమా చేస్తుండడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. 

 

77

భవిష్యత్తులో అహం బ్రహ్మాసి చిత్రం చేస్తా. కానీ అంతకంటే ముందు కొన్ని సినిమాలు చేసి డబ్బు కూడబెట్టుకోవాలి. ఆ తర్వాత మౌనికతో కలసి సొంతంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తానేమో అంటూ సరదాగా మంచు మనోజ్ తెలిపారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image2
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Recommended image3
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved