మంచు మనోజ్ మామూలోడు కాదుగా.. భార్యతో కలిసి అంబానీ ఈవెంట్‌లో సందడి.. ఏకైక తెలుగు హీరో..
మంచు మనోజ్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఆయనే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖేష్ అంబానీ ఈవెంట్‌లో పాల్గొనడం చర్చనీయాంశం అవుతుంది.
మంచు మనోజ్(Manchu Manoj).. పెళ్లి తర్వాత యాక్టివ్ అయ్యాడు. ఆయన భూమా మౌనికా రెడ్డి(Bhuma Mounika Reddy) ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఓ టీవీ షో చేసేందుకు రెడీ అయ్యారు. బిగ్గెస్ట్ షో చేయబోతున్నట్టు తెలిపారు. అదే సమయంలో తన సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు మంచు మనోజ్.
మంచు మనోజ్.. తన భార్య మౌనికా రెడ్డితో కలిసి ముంబయిలో సందడి చేశాడు. రిలయన్స్, జీయో అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani)కి సంబంధించిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. ముంబయిలో అత్యంత లగ్జరీ మాస్ `జీయో వరల్డ్ ప్లాజా`(Jio World Plaza)ని బుధవారం ప్రారంభించారు. ఇది లగ్జరీ షాపింగ్ మాల్. సెలబ్రిటీలకు అడ్డా అయినా బాండ్రాలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినిమా సెలబ్రిటీలు చాలా మంది పాల్గొన్నారు.
అయితే ఇందులో మంచు మనోజ్, మౌనికారెడ్డిల జంట సందడి చేయడం విశేషం. ఈ ఆహ్వానం పొందిన ఏకైక తెలుగు హీరో మంచు మనోజ్ కావడం విశేషం. హీరోయిన్లు శృతి హాసన్, రష్మిక, పూజా, రకుల్ వంటి వారు ఇందులో పాల్గొన్నారు. కానీ హీరోల్లో మాత్రం మంచు మనోజ్‌కి మాత్రమే ఇందులో పాల్గొనడం ఆశ్చర్యపరుస్తుంది. దీనికి మించిన ఆశ్చర్యమేంటంటే.. ముఖేష్ అంబానీ.. మంచు మనోజ్, మౌనికా రెడ్డిలతో కాసేపు టైమ్ స్పెండ్ చేసి వారితో ముచ్చటించారు.
ప్రస్తుతం ఆయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు నుంచి ఈ జంట మాత్రమే హాజరు కావడంతో ఇప్పుడు మనోజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇక ఇందులో బ్లాక్ సూట్‌లో మెరిసిపోతున్నాడు మనోజ, మౌనికా రెడ్డి. ఇద్దరూ స్టయిలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. అయితే మనోజ్‌కి ఆహ్వానం రావడానికి కారణం ఏంటి? దాని వెనకాలున్న సీక్రెట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.
మంచు మనోజ్ ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లికి ముందే ఈ ఇద్దరు ప్రేమించుకున్నారని, ఫ్యామిలీ కారణాలతో వేర్వేరిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వారికి విడాకులిచ్చి ఇటీవల మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి మోహన్‌బాబుకి, విష్ణుకి ఇష్టం లేదనే వార్తలొచ్చాయి. అక్క మంచు లక్ష్మినే దగ్గరుండి పెళ్లి చేసింది. పైగా పెళ్లి తర్వాత విష్ణుకి, మనోజ్‌కి గొడవలయ్యాయి. దీంతో రకరకాల వార్తలొచ్చాయి. ప్రస్తుతం మనోజ్.. వారి ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.