మీరు హెల్ప్ చేయలేరు.. బట్ ప్రేమిస్తారంటోన్న మంచు లక్ష్మీ.. బ్లూ డ్రెస్‌లో కుర్రభామలకే పోటీనిస్తుందిగా!
మంచు లక్ష్మీ ఇటీవల గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది. కుర్ర హీరోయిన్లు కూడా మంచు లక్ష్మీ ముందు దిగదుడుపే అనేంతగా గ్లామరస్‌గా ముస్తాబై హోయలు పోయింది. వరుసగా ఫోటో షూట్‌లతో హీటు పెంచుతుంది.
మంచు లక్ష్మీ బ్లూ లెహంగాఓణీలో హోయలు పోయింది. యంగ్ హీరోయిన్లు కూడా మంచు లక్ష్మీ అందం ముందు దిగదుడుపే అనేంతగా హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది.
తాజాగా మంచు లక్ష్మీ పంచుకున్న లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కుర్రాళ్లతో గిలిగింతలు పెడుతున్నాయి.
ఈ సందర్బంగా మంచు లక్ష్మీ స్పందిస్తూ, `నేను బ్లూ డ్రెస్ ధరించడంతో అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ విషయంలో మీరు ఎలాంటి సహాయం చేయలేదు. కానీ నన్ను చాలా ప్రేమిస్తారు` అని పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలకు నెటిజన్లు, ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. మంచు లక్ష్మీ అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. హల్‌చల్ చేస్తున్నాయి.
మంచు లక్ష్మీ ఓ రకంగా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. ఆమె గతంలోనూ పలు టీవీ షోస్ చేసి మెప్పించింది. `మేము సైతం`, `లక్ష్మీ టాక్ షో`, `ప్రేమతో మీ లక్ష్మీ`, `సూపర్ జోడి`, `దూసుకెళ్తా`, `మీకోసం`, `మహారాణి` వంటి షోస్‌తో ఆకట్టుకుంది. `మిసెస్ సుబ్బలక్ష్మీ` అనే వెబ్ సిరీస్ కూడా చేసింది. ఇటీవల `పిట్టకథలు`లోనూ మెరిసింది. కొంత గ్యాప్‌తో మళ్లీ టీవీ షోలో మెరిసింది మంచులక్ష్మీ.
జీ తెలుగులో ఆదివారం `ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం` షోలో తన కూతురు విద్యా నిర్వాణతో కలిసి పాల్గొంది. తన కూతురుతో కలిసి స్టేజ్‌ని పంచుకోవడం విశేషం. మంచు లక్ష్మీ చేసిన ఇందులోని ఎపిసోడ్‌కి మంచి ఆదరణ లభించింది.
మంచు లక్ష్మీ ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది.
ఈ పిక్స్ సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
మంచు లక్ష్మీ, రకుల్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.