Manchu Lakshmi: మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదుగా... ఈ వయసులో ఆ తెగింపు ఏంటి బాబోయ్!
మంచు లక్ష్మి మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో వచ్చారు. ఆమె డిజైనర్ వేర్ ధరించి రాయల్ లుక్ ట్రై చేశారు. మంచు లక్ష్మి ఫోటో షూట్ వైరల్ అవుతుంది.

మంచు లక్ష్మి అసలు తగ్గడం లేదు. ట్రెండీ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ ఫోజులిచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ వరుణ్ చక్కిలం ప్రత్యేకంగా రూపొందించిన బట్టల్లో మెరిశారు. తనకు గ్రాండ్ రాయల్ లుక్ ఇచ్చిన సదరు డిజైనర్ కి ధన్యవాదాలు ఆమె తెలిపారు.
ఎప్పటిలాగే ఆమె ఫోటోలను ట్రోల్ చేసేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారు. ఈ వయసులో ఇలాంటి పోజులు అవసరమా, మీకు మేకప్ ఎక్కువైంది అంటూ నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మంచు లక్ష్మి అవేమీ పట్టించుకోదు. పనీ పాట లేని వాళ్ళు చేసే పనులంటూ కొట్టిపారేస్తుంది. మంచు ఫ్యామిలీని తరచుగా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉంటారు.
Manchu Lakshami
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు ఫ్యామిలీ చిత్రాలు చేస్తూనే ఉంటారు. గత ఏడాది మంచు విష్ణు హీరోగా జిన్నా విడుదలైంది. అది డిజాస్టర్ అయ్యింది. 2021లో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన సన్ ఆఫ్ ఇండియా థియేటర్స్ లోకి వచ్చింది. ఆ మూవీ డబుల్ డిజాస్టర్. చివరికి మంచు లక్ష్మికి కూడా కాలం కలిసి రావడం లేదు. ఎన్ని సినిమాలు చేసినా కనీస ఫేమ్ సంపాదించలేకపోతున్నారు .
Manchu Lakshami
తాజాగా ఆమె అగ్ని నక్షత్రం టైటిల్ తో ఓ మూవీ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలో విడుదల కానుంది. అగ్నినక్షత్రంతో పాటు కొన్ని చిత్రాలు వెబ్ సిరీస్లలో నటిస్తున్నట్లు మంచు లక్ష్మి వెల్లడించారు. అగ్ని నక్షత్రం మూవీలో మంచు లక్ష్మి లుక్ ఆకట్టుకుంది.
ఇక మంచు లక్ష్మి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. తమ్ముడు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నారు. మార్చి 3న మంచు మనోజ్ పెళ్లి జరగనుందని విశ్వసనీయ సమాచారం. ఆల్రెడీ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి.
నంద్యాలకు చెందిన పొలిటికల్ ఫ్యామిలీ భూమా మౌనికను మనోజ్ వివాహం చేసుకుంటున్నారు. కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారు. గతంలోనే వీరికి పరిచయం ఉన్నట్లు సమాచారం. ఇక మౌనికకు కూడా మొదటి భర్తతో విడాకులయ్యాయి. మనోజ్ 2019లో ప్రణతి రెడ్డితో విడిపోయిన విషయం తెలిసిందే.