హాలీవుడ్‌లో ఉంటే స్టార్ అయ్యేదాన్ని.. మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను హాలీవుడ్ యాక్టర్ అని.. మళ్ళీ హాలీవుడ్ కే వెళ్తానంటోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ లో ఉన్న ఆమెకు మళ్లీ.. ఆలోచన ఎందుకు వచ్చింది.

అదిరిపోయే అవుట్ ఫిట్స్, శారీ లుక్ లో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తున్నారు. కొత్తదనం చూపిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మంచు లక్ష్మి. ఈ సందర్భంగా వరుసగా పోస్టులు పెడుతూ ఆసక్తికరంగా మారుతున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచువారి ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. మంచి మెహాన్ బాబు హీరోగా, విలన్ గా, నిర్మాతగా, ఇడస్ట్రీ పెద్దగా, బిజినెస్ మోన్ గా, రాజకీయ నాయకుడిగా. మల్టీ టాలెంట్ చూపించి.. స్టార్ గా ఎదిగారు. ఆయన వారసత్వం తీసుకుని మోహాన్ బాబు ఇద్దరు కొడుకులు.. ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోనే సెటిల్ అయ్యింది.
మెహన్ బాబు తరువాత ఆయన వారసత్వం తీసుకుని.. మంచు లక్ష్మీకూడా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకుంటుంది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా, హోస్ట్ గా, డైరెక్టర్ గా.. ఇలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయింది మంచు. అంతే కాదు గతంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండి వచ్చిన మంచులక్ష్మీ.. తెలుగు ఇండస్ట్రీలో పిక్స్ అయిపోయింది.
ఇక ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురైన సెలబ్రిటీ ఫ్యామిలీ అంటే..మంచు ప్యామిలీనే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా మోహన్ బాబు, మంచ లక్ష్మీ, విష్ణు మాట్లాడిన మాటలు.. ఎక్కువగా ట్రోల్ అవుతుంటాయి. మీమ్స్ కూడా చేస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ స్టార్స్ మాట్లాడటం కూడా...అలానే మాట్లాడుతారు.ట్రోలర్స్ కు మంచి స్టఫ్ అందించేలా స్టెట్ మెంట్స్ ఇస్తుంటారు.
Manchu Lakshmi
ఇక తాజాగా మంచు లక్ష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మంచులక్ష్మి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను హాలీవుడ్ యాక్టర్ ని, అక్కడ కొన్ని సినిమాలు చేశాను. అక్కడే ఉంటే ఈ పాటికి స్టార్ అయ్యేదాన్ని. కానీ పాప కోసం, ఫ్యామిలీ దగ్గరగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను అన్నారు.
అంతే కాదు... ఇప్పుడు కూడా అవకాశం వస్తే కచ్చితంగా మళ్ళీ హాలీవుడ్ కి వెళ్ళిపోతాను. ఈసారి మాత్రం వెళ్తే తిరిగి రాను. ఇక్కడ చాలా కష్టపడ్డాను. కానీ ఇక్కడ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎక్కువ ఇవ్వరు. మధుశాలిని, బిందు మాధవి, నిహారిక, శివాని.. ఇలా చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఛాన్సులు లేవు అన్నారు.
అంతే కాదు మన ఆడియన్స్ కూడా బయటి అమ్మాయిలనే చూస్తున్నారు. అంతే కాని మనతెలుగు అమ్మాయిలు హీరోయిన్లు గా ఉంటే చూడటానికి ఎందుకో ఇష్టపడటంలేదు. వేరే రాష్ట్రాల నుంచి హీరోయిన్స్ ని తీసుకొస్తే మాత్రం ఆహా..ఓహో అనేస్తారు అని అంది మంచు లక్ష్మీ.
ఇక సరిగ్గా మంచు లక్ష్మికి ఓ ప్రశ్న ఎదురయ్యింది. మరి మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు ఛాన్సులు ఇవ్వొచ్చు కదా అని యాంకర్ ప్రశ్నించగా.. . నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంది, కానీ నేను ఎంతమందికి ఇవ్వగలను, నాకే సరైన ఛాన్సులు లేవు, ఇంక నేనెలా ఇవ్వగలుగుతాను అని అన్నారు మంచు. ఇక ఇప్పుడు మంచు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంచలనంగా మారాయి.