స్వలింగ సంపర్కుల వివాహానికి సుప్రీంకోర్టు నో.. ఈ తీర్పు దేశానికే సిగ్గు చేటు, మంచు లక్ష్మి తీవ్ర వ్యాఖ్యలు
మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. అప్పుడప్పుడూ మంచు లక్ష్మి తాను చేసే కామెంట్స్ వల్ల ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది.
ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది.
మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది.
అయితే అప్పుడప్పుడూ మంచు లక్ష్మి తాను చేసే కామెంట్స్ వల్ల ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది.తాజాగా మంచు లక్ష్మి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మంచు లక్ష్మి తన రియాక్షన్ తో ట్రోలింగ్ కి గురవుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కుల వివాహంపై కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
మంగళవారం రోజు సుప్రీం కోర్టు స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్దత చేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం ప్రకటించింది. స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దం చేయలేమని.. వారిని దంపతులుగా గుర్తించలేమని సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవచ్చు అని పేర్కొంది.
Manchu Lakshmi
స్వలింగ సంపర్క వివాహాలకు సుప్రీం కోర్టు నో చెప్పడంతో మంచు లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేసింది. సుప్రీం నిర్ణయంతో తన గుండె బద్దలైంది అని మంచు లక్ష్మి పేర్కొంది. సుప్రీం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే సిగ్గు చేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపోయింది. ప్రేమ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన దేశమే ఇలా స్వలింగ సంపర్కుల పట్ల నిర్ణయాలు తీసుకోవడం షేమ్ ఫుల్ అని పేర్కొంది.
మంచు లక్ష్మి వ్యాఖ్యలతో ఆమెపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. నీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఉండడం సిగ్గు చేటు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మన కల్చర్ రూట్స్ తెలుసుకో అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. అలాగే మంచు లక్ష్మికి మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఉన్నారు.