మంచు లక్ష్మిదే తప్పా లేక ఇండిగో ది కాదా?
ఇండిగో విమానంలో ప్రయాణించిన మంచు లక్ష్మి తన లగేజీతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, తన బ్యాగ్‌ను సరిగ్గా తనిఖీ చేయలేదని ఆమె ఆరోపించారు. అయితే, ఆమె బ్యాగ్‌లో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఇండిగో వివరణ ఇచ్చింది.

Manchu Lakshmi, IndiGo, MOHANBABU
ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఆ సంస్థకు చెందిన విమానంలో తాను ప్రయాణించగా.. ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు. సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించారని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
Manchu Lakshmi
‘‘నా లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్లు చెప్పినవిధంగా చేయకపోతే గోవాలోనే నా సామాను వదిలేస్తామని అన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించారు. ఇదొక రకమైన వేధింపు.
నా కళ్లెదుట సెక్యూరిటీ ట్యాగ్ కూడా వేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? ఈవిధంగా ఎయిర్‌లైన్స్‌ను ఎలా నడపగలుగుతున్నారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఇకపై తాను ఈ ఎయిర్‌లైన్స్‌కు దూరంగా ఉంటానని వెల్లడించారు. తనతోపాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఈ విషయమై విమానయాన సంస్ద స్పందించింది. మీ బ్యాగ్ లో నిషేధించిన వస్తువులు ఉన్నాయని అందుకే సెక్యూరిటీ వాళ్లు ఆపారని.. తర్వాత వారికి సహకరించినందుకు ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ఆమె ఆ ట్వీట్ పెట్టకపోతే నిషేధిత వస్తువులు తీసుకెళ్లారని ఎవరికీ తెలియదు.కానీ ఇండిగో సంస్థను బ్లేమ్ చేద్దామని ట్వీట్ పెట్టారని తెలుస్తోంది . కానీ బ్యాగులో నిషేధిత వస్తువులు ఉన్నాయని ఆ సంస్థ బయట పెట్టడంతో .. మంచు లక్ష్మి అసలు అవేంటో చెప్పాల్సి వచ్చింది.
కత్తి, ఫోర్క్ ఉన్నాయని చెప్పింది. అవి ఉండటం తప్పా అన్నట్లుగా చెప్పి సెక్యూరిటీ ట్యాగ్ వేయలేదని నిష్ఠూరమాడుతూ చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మి గోవాకు వెళ్లి కత్తి, ఫోర్కుల్ని తెస్తారని అనుకోలేరు. అాలంటి వస్తవులు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అనవసరంగా ఎయిర్ లైన్స్ పై నిందలు వేయబోయి మంచు లక్ష్మి బుక్కయిపోయారని నెటిజన్లు సెటైర్లు వేసే పరిస్దితి ఏర్పడింది.