అనుష్కను అరుంధతిగా మార్చిన మమతా మోహన్ దాస్, ఫోన్ చేసి రాజమౌళి ఏమన్నారంటే..?
మాజీ హీరోయిన్ మమతా మోహన్ దాస్ సంచలన విషయాలు వెల్లడించింది. ఒకానొక టైమ్ లో రాజమౌళి తనతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుని ఎంతో బాధపడింది బ్యూటీ. తను వదులుకున్నఅవకాశాన్ని తలుచుకుని కుమిలిపోయింది.

తనజీవితంలో గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది మాజీ హీరోయిన్ మమతా మోహన్ దాస్. ఈ విషయాన్ని స్వయంగా ఓఇంటర్వ్యూలో వెల్లడించింది మమతా మోహన్ దాస్. అంతే కాదు ఈ విషయంలో తనతో రాజమౌళి మాట్లాడారని.. ఆయన అన్నమాటకు తన గుండె పగిలినంత పని అయ్యిందంటోంది మలయాళ హీరోయిన్.
ఒక సారి రాజమౌళి మమతా మోహన్ దాస్ కి కాల్ చేశారట. ఆయన ఒక మాట అనడంతో మమతా మోహన్ దాస్ చాలా గుండె పగిలినంత పని అయ్యిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది బ్యూటీ. . ఇంతకీ రాజమౌళి ఎందుకు అన్నారు.. మమతా మోహన్ దాస్ వదులుకున్న సినిమా ఏంటీ..? ఇప్పటికీ ఆమె బాధపడేది ఏ సినిమా గురించి...?
అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి సంగతి అందరికి తెసిందే.. ఈసినిమాతో అనుష్కకు ఎంత పేరు వచ్చిందో కూదా అందరికి తెలుసు. అయితే ఈ అరుంధతి సినిమా అవకాశం ముందుగా మమతా మోహన్ దాస్ కి వచ్చిందట. విచిత్రం ఏంటీ అంటే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడిగితే సినిమా చేస్తానని ఒప్పుకోవడంతో పాటు.. సంతకం కూడా చేశారట మమత మోహన్ దాస్.
సినిమా చేయాలి అని రెడీ అయిన తనను తన మేనేజర్ వద్దని ఆపాడట. ఆ నిర్మాణ సంస్థ మంచిది కాదని చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నానని.. అయితే ఆ తర్వాత అరుంధతి సినిమా రిలీజ్ అయినాక ఎంతో బాధపడినట్టు పేర్కొన్నారు మమత. అప్పటికీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి రెండు, మూడు నెలల పాటు సినిమా చేయమని రిక్వస్ట్ చేశారని.. కానీ నేనే కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తూ వచ్చానని వెల్లడించింది.
అరుంధతి సినిమా రిలీజ్ అవ్వకముందే .. యమదొంగ సినిమా కోసం రాజమౌళి తనకు కాల్ చేశారని.. ఆ సమయంలో అరుంధతి సినిమాని అనవసరంగా మిస్ చేసుకున్నావని అన్నారట. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది అని అన్నారని, వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావని అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. రాజమౌళి అలా అనడంతో తన గుండె పగిలిపోయినట్లు అయ్యిందని.
రాఖీ సినిమాతో సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన మమతా మోహన్ దాస్... తెలుగులో చాలా సినిమాలకు పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారిపోయింది. యమదొంగ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ కి జోడీగా నటించిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హోమం, చింతకాయల రవి, కింగ్, కేడీ సినిమాల్లో నటించి మెప్పించింది.
సక్సెస్ ఫుల్ మూవీ కెరీర్ ను చూసిన మమతా మోహన్ దాస్ క్యాన్సర్ వల్ల పూర్తిగా సినిమాలకు దూరమయ్యింది. మమతా మోహన్ దాస్ రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. 2010లో ఒకసారి, 2013లో ఒకసారి. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ నుంచి గెలిచినా.. మరో అనారోగ్యం బారిన పడినట్టు తెలుస్తోంది.