- Home
- Entertainment
- దీపికా పదుకొనె పై మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు, మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ...?
దీపికా పదుకొనె పై మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు, మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ...?
బాలీవుడ్ తో పాటు.. దీపికా పదుకొనేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.. ఒక్కప్పటి బాలీవుడ్ శృంగారతార మల్లికా షెరావత్. ఇప్పటి అప్పటి పరిస్థితులను విశ్లేసిస్తూ.. మాట్లాడింది మల్లికా.

బాలీవుడ్ శృంగారతారల్లో మల్లికా షెకావత్ స్థానాన్ని ఎవరూ బర్తీ చేయలేరు. ఆమె అందాల ఆరబోతకు ఇప్పకీ ఫ్యాన్స్ విపరీతంగా ఉంటారు. ఆమె ఫిగర్ తో పాటు ఫెర్ఫామెన్స్ కు కూడా ఫిదా అయ్యేవారు ఎందరో.. శృంగార దేవతగా ఎంతో మంది కొలిచిన మల్లికా.. ఈ మధ్య ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
బాలీవుడ్ ను మల్లికా ఒక ఊపు ఊపుతున్న టైమ్ లోనే హీరోయిన్ గా ఎదిగింది దీపికా పదుకొనే. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా దీపికా క్రేజ్ వేరు. ఇక దీపికా సినిమాను ఉదాహరిస్తూ..మల్లిక చేసిన కామెంట్స్ బాలీవుడ్ లో ఆసక్తి కలిగిస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ తార మల్లికా షెరావత్. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే గెహ్రాయియా సినిమాలో చేసింది తాను 15 ఏళ్ల కిందటే మర్డర్ సినిమాలో చేశానని చెప్పుకొచ్చింది. కిస్సింగ్ సీన్లు, బికినీ గురించి ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారని, కానీ, ఇవన్నీ తాను దీపిక కంటే ముందే చేశానని వివరించింది.
అప్పటి ప్రేక్షకుల ఆలోచనల కాని.. బుద్ది కాని అంతగా ఎదగలేదని విమర్శించింది మల్లికా. అటువంటి టైమ్ లోనే తాను అవన్నీ లెక్క చేయకుండా సాహసం చేశానంటోంది. అంతేకాదు, బాలీవుడ్ లోని ఓ వర్గం తనను మానసిక వేదనకు గురిచేస్తోందని మల్లికా శెరావత్ ఆరోపిస్తోంది.
ఎంతసేపు సినిమాలో తన శరీరం గురించి, అందం గురించి, ఎక్స్ ఫోజింగ్ గురించే మాట్లాడతారే కానీ, తన యాక్టింగ్ స్కిల్స్ ను గుర్తించే వారు కరువయ్యారని మల్లికా బాధపడింది. మొదట్లో హీరోయిన్లు పద్దతిగా సావిత్రి టైపులో అతి మంచితనంతో ఉండేవారని.. అందుకే వారికోసం అలాంటి పాత్రలే రాశారన్నారు.
అప్పట్లో ఏమీ తెలియని అమాయ పాత్రలు ఉండేవి.. లేకుంటే క్యారెక్టర్ లేని వ్యాంప్ లుగానే ఉండేవారని మల్లిక వివరించింది. నాటి హీరోయిన్ల కోసం ఈ రెండు తరహా పాత్రలే రాసేవారని.. అంతకు మించి ఆప్షన్ లేక తాము ఏదో ఒకటి ఎంచుకోవల్సి వచ్చేదంటోంది సీనియర్ బ్యూటీ..
కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని ఆమె అభిప్రాయ పడింది. ఇప్పుడు కొంచెం ఆడవారిని మనుషుల్లా చూపిస్తున్నారని మల్లికా అంటోంది. మంచి వెయిట్ ఉన్న పాత్రలతో పాటు.. విమెన్ సెంట్రిక్ మూవీస్ పెరిగిపోవడం.... మంచో.. చెడో.. ప్రేమో అభిమానమో.. ఇప్పటి హీరోయిన్ పాత్ర బాగుందంటూ.. మల్లికా షెరావత్ తనభావాలు పంచుకున్నారు.