- Home
- Entertainment
- Janaki Kalaganaledu: మళ్లీ బేడీసికొట్టిన మల్లిక ప్లాన్.. అబద్దం చెప్పిన వెన్నెల.. పోటీకి పయనమైన జానకి, రామచంద్
Janaki Kalaganaledu: మళ్లీ బేడీసికొట్టిన మల్లిక ప్లాన్.. అబద్దం చెప్పిన వెన్నెల.. పోటీకి పయనమైన జానకి, రామచంద్
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 31 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో మల్లిక (mallika), జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి రామచంద్ర, జానకి లపై లేనిపోని మాటలు అని చెప్పి జ్ఞానాంబను రెచ్చ గొడుతుంది. అప్పుడు జ్ఞానాంబ, మల్లిక మాటలు విని ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత జ్ఞానాంబ(jnanamba), తనతో పాటు వెన్నెల లను తీసుకొని వెళ్తుంది. ఇప్పుడు మల్లిక తన ప్లాన్ సక్సెస్ అవుతున్నందుకు సంతోష పడుతూ ఉంటుంది.
ఇంతలో జానకి రామచంద్ర (rama chandra)లు ఆ టికెట్ చూస్తూ తీసుకుని లోపలికి వస్తారు. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి వెళ్లి బస్సు కు టైం అవుతుంది ఇంకా రెడీ అవకుండా ఏం చేస్తున్నారు, మీ నాన్న బస్సు టికెట్స్ తెచ్చి ఇచ్చారా అని అడగగా ఆ ఇప్పుడే తెచ్చి ఇచ్చారు అని చెప్తాడు రామ. అప్పుడు జ్ఞానాంబ(jnanamba)టికెట్ ఇలా ఇవ్వు అని అనడంతో మల్లికా సంతోషంతో గంతులు వేస్తూ ఉంటుంది.
అప్పుడు రామచంద్ర(rama Chandra)ఎందుకు అమ్మ అని అడగగా ఏమి లేదు నాన్న బస్సు ఎన్ని గంటలకు వెళుతుంది,ఏ సమయానికి వెళుతుందో తెలిస్తే నాకు కొంచెం మనశాంతిగా ఉంటుంది అని అంటుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి బస్సు టికెట్ ని వెన్నెల లకు ఇవ్వగా వెన్నెల (venella)ఆ టికెట్ చదివి హైదరాబాద్ కాకుండా విజయవాడ కి వెళ్తున్నారు అని అబద్ధం చెబుతుంది.
ఆ మాట విని మల్లిక (mallika)ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు జ్ఞానాంబ, మల్లిక ను వంటగదిలో పని ఉంది రమ్మని చెబుతుంది. అప్పుడు గోవిందరాజు(govinda raju)మల్లిక ప్లాన్ రివర్స్ అయినందుకు నవ్వుతూ అసలు జరిగిన విషయాన్ని వివరిస్తాడు. అప్పుడు మల్లికా టీవీలో చూసి ఏదో ఒక ప్లాన్ తో లోపలికి వెళుతుంది.
మరొకవైపు జానకి (janaki)ఇల్లు క్లీన్ చేస్తూ కింద పడి పోతూ ఉండగా ఇంతలో రామ చంద్ర వచ్చి పట్టుకుంటాడు. అప్పుడు వారిద్దరూ కొద్దిసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. ఇక ఆ రోజు రాత్రి మల్లిక,జ్ఞానాంబ(jnanamba)రూమ్ లోకి వెళ్ళి టాబ్లెట్స్ మారుస్తుంది. రేపటి ఎపిసోడ్ లో జ్ఞానాంబ రూమ్ లోకి వచ్చి మల్లిక మార్చిన టాబ్లెట్స్ వేసుకుంటుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.