MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Malli Pelli Review: నరేష్‌, పవిత్రల `మళ్ళీ పెళ్ళి` రివ్యూ, రేటింగ్‌

Malli Pelli Review: నరేష్‌, పవిత్రల `మళ్ళీ పెళ్ళి` రివ్యూ, రేటింగ్‌

నరేష్‌, పవిత్ర లోకేష్‌ కలిసి నటించిన `మళ్ళీ పెళ్ళి` చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు శుక్రవారం(మే 26) రిలీజ్‌ అయ్యింది.  సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

4 Min read
Author : Aithagoni Raju
| Updated : May 26 2023, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సీనియర్‌ నటుడు నరేష్‌ పెళ్లిళ్ల మ్యాటర్‌ చాలా కాలంగా వార్తల్లో నిలుస్తుంది. ఆయన పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ ఇద్దరు కలిసి `మళ్ళీ పెళ్ళి` సినిమా చేయడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి, క్రేజ్‌ నెలకొంది. ఎం.ఎస్‌. రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాని నరేష్‌ స్వయంగా నిర్మించారు. నరేష్‌, పవిత్ర లోకేష్‌ ల కథగానే ఈ సినిమాని తెరకెక్కించారని ట్రైలర్లు చూస్తే అర్థమయ్యింది. అదే ప్రచారం జరుగుతుంది. నేడు శుక్రవారం(మే 26) ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. మరి నిజంగానే రియల్‌ లైఫ్‌ స్టోరీనా? అసలు సినిమా ద్వారా నరేష్‌ ఏం చెప్పదలుచుకున్నాడు? సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కథః
నరేంద్ర(నరేష్‌).. పెద్ద యాక్టర్‌, 350కిపైగా సినిమాలు చేశాడు. ఇప్పటికీ బిజీగా ఉంటాడు. ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఇంట్లో ఒక ఆడ తోడు ఉంటే బాగుండని వెయిట్‌ చేస్తున్న రోజులవి. ఆ సమయంలో పార్వతి(పవిత్ర లోకేష్‌)ని ఓ సినిమా షూటింగ్‌లో చూస్తాడు నరేంద్ర. తొలి చూపులోనే ఏదో ఎట్రాక్షన్‌ తనని వెంటాడుతుంది. ఇలా వరుసగా షూటింగ్‌లో కలుస్తారు, పరిచయం పెరుగుతుంది. స్నేహం బలపడుతుంది. నరేష్‌ మనసులో ప్రేమ పుడుతుంది. దీంతో ఆమెలాంటి భార్య తనకు లైఫ్‌లో ఉండాలని భావిస్తుంటాడు. మరోవైపు మూడో భార్య సౌమ్య సేతుపతి(వనితా విజయ్‌ కుమార్‌)తో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆమె డబ్బుల కోసం వేదిస్తూనే ఉంటుంది. మరోవైపు పార్వతి తన భర్త ఫణీంద్ర(రవివర్మ)తో సరైన ప్రేమని పొందలేకపోతుంది. వీరి మధ్య గొడవలు అవుతుంటాయి. మరి పార్వతి, ఫణీంద్రల మధ్య గొడవేంటి? నరేంద్ర, సౌమ్యల మధ్య గొడవలకు కారణమేంటి? నరేంద్ర, పార్వతి ఎలా దగ్గరయ్యారు? వీరి జీవితాల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నానేది మిగిలిన సినిమా. 
 

36

విశ్లేషణః 
`మళ్ళీ పెళ్ళి`.. సినిమా నరేష్‌ లైఫ్‌ని ప్రతిబింబించేలా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నరేష్‌, తన మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రలోకేష్‌ లైఫ్‌లను, ఈ ముగ్గురి మధ్య జరిగిన సన్నివేశాల ఆధారంగానే, యదార్థంగా రూపొందించినట్టు అనిపిస్తుంది. ఓ రకంగా ఇది నరేష్‌ ఆటో బయోగ్రఫీ మూవీ అని చెప్పొచ్చు. తన మూడో భార్య తన జీవితంలోకి ఎలా వచ్చింది, ఆమెతో గొడవలేంటి? ఈ క్రమంలో పవిత్ర లోకేష్‌కి ఎలా ఆకర్షితుడయ్యాడు. ఆమె పెళ్లి జీవితంలోని సమస్యలేంటి? అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే సినిమా పరంగా ఇది నరేష్‌ కోణంలో సాగే మూవీలా అనిపిస్తుంది. అంటే గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అనేక ఆరోపణలు ఉన్న క్రమంలో నరేష్‌ తన వెర్షన్‌లో జనానికి క్లారిటీ ఇచ్చేందుకు ఈ సినిమా తీసుకున్నట్టు అనిపిస్తుంది. బహుశా అందుకే ఆయన ఈ సినిమా నిర్మించి ఉంటారు. 

నరేష్‌ ఈ సినిమాలో తన మూడో భార్యని విలన్‌గా చూపించే ప్రయత్నం చేశాడు, తనని ఓ సైకోలా, శాడిస్ట్ గా, డబ్బుల కోసం వేధించే వ్యక్తిగా, బ్లాక్‌ మెయిలర్‌లా చూపించారు. తాను మాత్రం ఇంటి తోడు కోసం, మంచి భార్య కోసం, ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునే వ్యక్తిగా చూపించుకున్నాడు. ఈ క్రమంలో పవిత్ర లోకేష్‌తో ప్రేమకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. మరోవైపు పవిత్ర లోకేష్‌ స్టోరీలో అతని భర్తని విలన్‌గా చూపించారు. అగ్ర కులం వ్యక్తిగా, పవిత్రని తక్కువగా చూసేవాడిగా, తనని కేవలం తన స్టేటస్‌ కోసం ఆమెని వాడుకున్నట్టుగానే చూపించారు. వాస్తవం ఏంటనేది మాత్రం వాళ్లకే తెలియాలి. కానీ చూసే ఆడియెన్స్ కి మాత్రం ఇటు నరేష్‌, పవిత్రల కోణంలో సాగే సినిమాగే, ఎజెండా మూవీలాగే అనిపిస్తుంది. 
 

46

సినిమాగా చూస్తే ఇది కొంత ఇంట్రెస్టింగ్‌గా, మరికొంత బోరింగ్‌గా సాగుతుంది. చాలా వరకు వాళ్ల లైఫ్‌లో జరిగే సన్నివేశాలు గుర్తుకొస్తుంటాయి. దీంతో కిక్‌ మిస్‌ అయ్యింది. మరోవైపు నరేష్‌, పవిత్ర మధ్య లవ్‌ స్టోరీ భరించలేని విధంగా ఉంటుంది. లేట్‌ వయసులో ఘాటు ప్రేమ కోసం తపించే సీన్లు జీర్ణించుకోలేని విధంగా ఉంటాయి. సినిమా ఓ ఫ్లో ఉండదు. కాసేపు నరేష్‌ స్టోరీ, మరికాసేపు తన మూడో భార్య స్టోరీ, ఇంకాసేపు లవ్‌ స్టోరీని, మరికాసేపు పవిత్ర లోకేష్‌ స్టోరీని చూపించడం, వెనక్కి ముందుకు వెళ్లడం అంతా కన్‌ ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. అదే సమయంలో  సీన్లలో సహజత్వం మిస్‌ అయ్యింది. జనరల్‌గా ఫ్యామిలీ స్టోరీస్‌లో చాలా ఎమోషన్స్, వారి పెయిన్‌ ఉంటుంది. దాన్ని బలంగా, అంతే సీరియస్‌గా, ఎమోషనల్‌గా చూపిస్తేనే కనెక్ట్ అవుతుంది. లేదంటే చిరాకు తెప్పిస్తుంది. ఈ సినిమా విషయంలో రెండోది జరిగింది. సన్నివేశాలల్లో సహజత్వం లేదు, వారి ప్రేమలో ఫీల్‌ లేదు, పైగా టీనేజ్‌ కుర్రాడిలా నరేష్‌ ఇచ్చే బిల్డప్‌, స్టయిల్‌ ఓవర్‌గా అనిపిస్తుంది. వారి పర్సనల్‌ లైఫ్‌ని కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు. కామెడీ అంటే నవ్వులు పూయించే కామెడీ కాదు, వారి లైఫ్‌ కామెడీగా, సీన్లు కామెడీగా అనిపిస్తాయి. అయితే నరేష్‌ తనపైనే తాను పంచ్‌లు వేసుకోవడం, నరేష్‌, మూడో భార్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్లు, అలాగే అనన్య నాగళ్ల ఎపిసోడ్‌(పవిత్ర యంగ్‌ ఏజ్‌ ఎపిసోడ్‌) ఆకట్టుకుంటాయి. ఓ రొమాంటిక్‌ ఫీల్‌ని తీసుకొస్తాయి. మ్యూజిక్‌ సినిమాకి హెల్ప్ అవుతుంది. పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకునేలా ఉంది. 
 

56

నటీనటులుః

నరేష్‌.. నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇరగదీస్తాడు. ఇక తన సొంత కథ కావడంతో మరింతగా రెచ్చిపోయాడు. వన్‌ మ్యాన్‌ షో చేశారు. తనదైన కామెడీతో నవ్వులు పూయించారు. పవిత్ర లోకేష్‌ సెటిల్డ్ గా చేసింది. ఆకట్టుకుంటుంది. నరేష్‌ మూడో భార్యగా వనితా విజయ్‌ కుమార్‌ ఇరగదీసింది. ఆమె సన్నివేశాలు మరింతగా ఆకట్టుకుంటాయి. కృష్ణగా శరత్‌బాబు, విజయ నిర్మలగా జయసుధ ఓకే అనిపించారు. అనన్య నాగళ్ల రొమాంటిక్‌ సీన్లలో ఇరగదీసింది. ఆమె పాత్ర మరో హైలైట్‌. రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ, భద్రం, మిగిలిన పాత్రలు పర్వాలేదు. 

టెక్నీకల్‌గాః
దర్శకుడు ఎంఎస్‌ రాజు సినిమాని కామెడీ వేలో చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. ఈ సినిమాకి ఎమోషన్స్ ముఖ్యం. కానీ వాటికి ప్రయారిటీ ఇవ్వలేదు. లవ్‌ ట్రాక్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అయితే ఆయన నరేష్‌ సలహాలకు, ఆయన డామినేషన్‌కి లోబడే సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో సన్నివేశాల మధ్య కనెక్టివిటీ మిస్‌ అయ్యింది. సినిమాకి ఉండాల్సిన ఫీల్‌ మిస్‌ అయ్యింది. సురేష్‌ బొబ్బిలి సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అరుల్‌ దేవ్‌ బీజీఎం ఫర్వాలేదు. ఎడిటింగ్‌ పరంగా ఇంకా కేర్‌ తీసుకోవాల్సింది. కనెక్టివిటీ చూసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవలేదు. నరేష్‌ సొంత సినిమా కావడంతో బాగానే ఖర్చు పెట్టాడు.  
 

66

ఫైనల్‌గాః నరేష్‌ కోణంలో తీసుకున్న పెళ్లిళ్ల కథ. సీరియస్‌ కథని కామెడీ చేసుకున్నాడు. చివరికి తన లైఫ్‌నే కామెడీగా చేసుకున్నట్టయ్యింది. ఏదో ఉందని ఆశించి వెళ్లే వాళ్లకి నిరాశ తప్పదు.  

రేటింగ్‌ః 2.25

నటీనటులు : నరేష్ విజయకృష్ణ, పవిత్రా లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనితా  విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు
ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల రెడ్డి
నేపథ్య సంగీతం : అరుల్ దేవ్!స్వరాలు : సురేష్ బొబ్బిలి 
నిర్మాత : నరేష్ విజయకృష్ణ 
రచన, దర్శకత్వం : ఎంఎస్ రాజు
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved