MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: యష్ చెంప పగలగొట్టిన మాలిని.. సంతోషంలో సులోచన?

Ennenno Janmala Bandham: యష్ చెంప పగలగొట్టిన మాలిని.. సంతోషంలో సులోచన?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 18వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 18 2022, 01:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 ఈరోజు ఎపిసోడ్ లో యష్ బయటకు వచ్చి లాయర్ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో మీరేం టెన్షన్ పడకండి ఎంతమంది లాయర్లు వచ్చినా ఈ కేసు గెలవరు అని అంటాడు. అప్పుడు యష్ ఎలా అయినా ఈ కేసు గెలవకుండా చూడడానికి లాయర్ గారు అని అంటాడు. ఇంతలోనే మాలిని అక్కడికి వచ్చి మాటలు వింటూ ఉంటుంది. ఆ తర్వాత సులోచన చిత్ర పై అరుస్తూ ఎందుకే చిత్ర నిన్న రాత్రి అంత జరిగిన నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. పెదనాన్న చెప్పొద్దన్నారు పెద్దమ్మ అని అంటుంది. అప్పుడు నీ ఆరోగ్యం బాగోలేదు అని అనగా నాకు నా కూతురు కాపురం కంటే నాకు ఏది అంత ముఖ్యం కాదు అంటుంది సులోచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఏదో ఒకటి తేల్చేస్తాను అక్కడికి వెళ్దాం పదండి అని అక్కడికి పిలుచుకొని వెళ్తుంది సులోచన. ఇంతలో అక్కడికి పోయేసరికి మాలిని యష్ చెంప చెల్లుమనిపిస్తుంది. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అమ్మని కదా అందుకే ప్రతిసారి వెనకేసుకొచ్చాను. కానీ నువ్వు ఈ అమ్మ ప్రేమను అలుసుగా తీసుకొని చేయకూడని పనులు అన్ని చేస్తున్నావు అని కోపంగా మాట్లాడుతుంది మాలిని. నీ భార్యని వదిలేసి ఆ మాళవికతో రాసుకుని పూసుకొని తిరుగుతున్నావు అని అంటుంది.
 

36

ఆ మాట విన్న సులోచన ఆశ్చర్య పోతుంది. మన ఇంటి వియ్యపురాలు వేదకు అమ్మ నీకు అత్త అయిన సులోచన ని ఆ మాళవిక చంపాలి అనుకుంది అనటంతో ఆ మాట విన్న సులోచన షాక్ అవుతుంది. నిన్ను వేదని విడగొట్టాలని ప్రయత్నిస్తుంది ఖుషిని మన నుంచి దూరం చేయాలని చూస్తోంది అలాంటి మాళవికతో నువ్వు తిరుగుతున్నావా అంటూ కోప్పడుతుంది మాలిని. ఆ మాళవిక అంతా దారుణంగా మోసం చేసిన చాల లేదా ఇంకా ఆ నిజం మా దగ్గర దాచిపెట్టి తనని సేవ్ చేయాలని చూస్తావా అని అంటుంది. 

46

అప్పుడు ఇదిగో నీ భార్య వేద ఇంటి కోడలు దీని సంగతి ఏంటి అని నిలదీస్తుంది. నీకోసం నీ కూతురు కోసం జీవితాన్ని త్యాగం చేసిన ఆ వేదని బాధ పెడుతున్నావు. ఈరోజు చెబుతున్నాను గుర్తుపెట్టుకో మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే దానికి కారణం ఈ వేద అని అంటుంది మాలిని. ఇప్పుడు ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా యష్ మాత్రం మౌనంగా ఉంటాడు. తరువాత అక్కడి నుంచి యష్ వెళ్లిపోతాడు. సులోచన అదంతా చూసి అత్తలో అమ్మని చూశాను అని సంతోషంతో మాట్లాడుతుంది.
 

56

అప్పుడు సులోచన మాలిని చేతులు పట్టుకొని నాకు తెలిసిన వదిన కంటే తెలియని అమ్మని చూశాను అంటూ మాలిని గురించి గొప్పగా మాట్లాడుతుంది. అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మరొకవైపు యష్ జరిగిన విషయం తలచుకొని బాధతో కుమిలిపోతూ ఉంటాడు. అప్పుడు కంచు మాత్రం ఈ వేద మామూలుది కాదు అయినా అమ్మా నాన్నలు సపోర్ట్ చేసిన నేను మాత్రం సపోర్ట్ చేయను నేను కూడా యష్ కి సపోర్ట్ చేసి ఏది చేయాలో అది చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు ఒకచోట కూర్చుని జరిగిన విషయం తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
 

66

ఎందుకు దేవుడా నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు అని బాధపడుతూ ఉంటాడు యష్. ఇంతలోనే అక్కడికి  వేద వస్తుంది. మీరు ఇంతలా బాధపడుతున్న నేను మిమ్మల్ని ఓదార్చలేక పోతున్నాను అంటే ఈ కారణం నీకు తెలుసు అని అంటుంది. ఈ పోరాటంలో నేను ఓడిపోవాలని కోరుకుంటున్నాను అని అంటుంది వేద. అప్పుడు వేద కావాలనే ఆ మాళవిక యాక్సిడెంట్ చేయలేదు అనుకోకుండా జరిగింది అనటంతో సరే ఒప్పుకుంటాను. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రక్తపుమడుగులో ఉన్న మా అమ్మని ఎందుకు హాస్పిటల్ కి తీసుకొని వెళ్లలేదు అని బాధపడుతుంది వేద. అడిగి ఏ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉండవు కానీ నేను మిమ్మల్ని క్షమించాలి ఎందుకంటే ఆవిడ గారు మీ మాజీ భార్య అని బాధతో మాట్లాడుతుంది వేద.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved