- Home
- Entertainment
- టాలీవుడ్ లోకి మరో మలయాళీ హీరోయిన్, సినిమా ఓపెనింగ్ రోజే మనసులు దోచేసింది.. ఫొటోస్ చూశారా
టాలీవుడ్ లోకి మరో మలయాళీ హీరోయిన్, సినిమా ఓపెనింగ్ రోజే మనసులు దోచేసింది.. ఫొటోస్ చూశారా
మరో మలయాళీ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ తో కనిపిస్తున్న ఆమె పేరు మీనాక్షి దినేష్.

meenakshi dinesh
మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్ లోకి హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. నిత్య మీనన్, సాయి పల్లవి, సంయుక్త మీనన్, అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో రాణిస్తున్నారు.
Meenakshi Dinesh
ఇప్పుడు మరో మలయాళీ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సినిమా ఓపెనింగ్ రోజే ఆమె తెలుగు యువత హృదయాల్ని కొల్లగొట్టేస్తోంది. క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ తో కనిపిస్తున్న ఆమె పేరు మీనాక్షి దినేష్.
Meenakshi Dinesh
హీరో గోపీచంద్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించబోతోంది. ఇటీవల ఈ చిత్ర పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. గోపీచంద్ చాలా ఏళ్లుగా ఒక్క హిట్ చిత్రం కోసం పరితపిస్తున్నాడు.
Meenakshi Dinesh
గోపీచంద్ కి చివరగా భీమా, విశ్వం లాంటి డిజాస్టర్లు పడ్డాయి. విశ్వం తర్వాత గోపీచంద్ రెండు చిత్రాలని లైన్ లో పెట్టారు. అందులో ఒకటి ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఉండబోతోంది. దీనిపై ప్రకటన కూడా వచ్చింది.
Meenakshi Dinesh
మరో చిత్రం రీసెంట్ గా లాంచ్ అయింది. కుమార్ సాయి అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. హీరోయిన్ కూడా ఫైనల్ అయింది.
Meenakshi Dinesh
మీనాక్షి దినేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగులో ఆమెకి ఇదే తొలి చిత్రం. దీనితో ఈ హీరోయిన్ ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
Meenakshi Dinesh
క్యూట్ గా అందంగా ఉన్న మీనాక్షి దినేష్ ఫోటోలు యువతని ఆకర్షిస్తున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే మీనాక్షి అందరి హృదయాలు దోచుకుంటోంది. మలయాళంలో ఆమె పోరంజు మరియం జొస్ లాంటి చిత్రాల్లో నటించింది.
Meenakshi Dinesh
మీనాక్షి చీర కట్టులో కనిపించినా, మోడ్రన్ డ్రెస్సులు ధరించినా అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీనాక్షి వల్ల అయినా గోపీచంద్ కి అదృష్టం వరిస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో గోపీచంద్ తన వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.