తెలుగు తెరపై మరో మలయాళ భామ, టాలీవుడ్ లో పోటీ తట్టుకోగలదా..?
టాలీవుడ్ కి మలయాళ తాకిడి ఇంకా తగ్గలేదు. తెలుగు తెరపై మెరవడానికి కొత్త తారలు ఆరాటపడుతున్నారు. రీసెంట్ గా మరో మలయాళ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది.

టాలీవుడ్ లో ఇప్పికే మాలయాళ ముద్దుగుమ్మల సందడి ఎక్కువగా ఉంది. తెలుగు తెరకి ఫస్ట్ నుంచీ మలయాళ భామల తాకిడి ఎక్కువే. ఇక్కడ బాలీవుడ్ భామల జోరుకు బ్రేకులు వేసి.. మలయాళ హవా నడించారు బ్యూటీస్. ఈ క్రమలోనే మరో భామ టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఆమె ఆత్మీయ రాజన్.
శేఖర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతోంది మలయాళ భామ ఆత్మీయ రాజన్. రాజశేఖర్ హీరోగా చేసిన ఈ సినిమా ఈ నెల 20వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యింది రాజన్.
జీవిత దర్శకత్వం వహించిన ఈ సినిమా, మలయాళంలో ఆ మధ్య వచ్చిన జోసెఫ్ సినిమాకి రీమేక్. అసలు పాటలే లేని ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు చేర్పులు చేసి.. పాటలు చేర్చి రిలీజ్ చూయబోతునర్నారు. ఇక ఆ సినిమాలో ఆత్మీయ రాజన్ పోషించిన పాత్రకిగాను, తెలుగులోను ఆమెనే తీసుకున్నారు.
రీసెంట్ గా మలమాళ భామ తో రాజశేఖర్ .. ఆత్మీయ రాజన్ పై షూట్ చేసిన పాటను రిలీజ్ చేశారు టీమ్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.
విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో చోటుచేసుకున్న అనూహ్యమైన సంఘటనల చుట్టూ తిరిగిన కథే శేఖర్ సినిమా. ఈ మూవీలో ఆత్మీయ రాజన్ పాత్ర స్పెషల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లో ఆమె నిలబడగలదా చూడాలి.