MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala Bandham: వేద మీద నిందలు వేసిన మాళవిక.. మాళవికను కాపాడుకునే ప్రయత్నంలో యష్?

Ennenno Janmala Bandham: వేద మీద నిందలు వేసిన మాళవిక.. మాళవికను కాపాడుకునే ప్రయత్నంలో యష్?

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు నవంబర్ 29 వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 29 2022, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో లాయర్ ఝాన్సీ చూడడానికి రోడ్డు ప్రమాదంలో కనిపిస్తున్న ఇది ఒక హత్యా ప్రయత్నం అని అంటుంది. అప్పుడు మాళవిక లాయర్ ఇదంతా కేవలం కల్పితం మాత్రమే అనడంతో వెంటనే లాయర్ ఝాన్సీ యాక్సిడెంట్ లో గాయపడింది సులోచన, యాక్సిడెంట్ చేసింది మాళవిక అనడంతో మాళవిక షాక్ అవుతుంది. అప్పుడు ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూవ్ చేస్తాను అని అనడంతో వెంటనే మాళవిక జడ్జిగారు ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒప్పుకుంటాను అని అనగా వెంటనే జడ్జిగారు మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే బోన్ లోకి వచ్చి చెప్పండి అని అంటారు.
 

26

అప్పుడు మాళవిక దొంగ నాటకాలు ఆడుతూ నా పేరు మాళవిక మాజీ భార్యని మేము విడిపోయి చాలా కాలం అయింది మమ్మల్ని చూసి తట్టుకోలేక ప్రజెంట్ భార్య వేద కోర్టులో దొంగ డ్రామాలు ఆడి కోర్టులో నా సొంత కూతురు ఖుషి ని నా నుంచి లాగేసుకుంది. కూతురు కోల్పోయిన బాధలో ఉన్న నన్ను వాళ్ళ అమ్మకు కారు యాక్సిడెంట్ చేశానని దొంగ కేసులు పెట్టి మైకురాలైన నామీద కక్ష కట్టింది. జైలుకు పంపించాలని చూస్తోంది అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటుంది మాళవిక. అసలు క్రిమినల్ నేను కాదు సార్ వేద అనడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

36

నా నుంచి నా పిల్లలను దూరం చేసి నన్ను ఒంటరి చేయాలని నా మీద కక్ష కట్టింది అంటూ వేద మీద లేనిపోని నిందలు వేసి దొంగ ఏడుపులు ఏడుస్తుంది మాళవిక. నేను ఇంకా పోరాడలేను. అందుకే నేను చెయ్యని తప్పును కూడా మీద వేసుకుంటున్నాను నేను ఈ తప్పును చేశాను ఆమె క్రిమినల్ అని ఉంటుంది మాళవిక. అప్పుడు చాలా వేద నికి ఇదే కదా కావాల్సింది నా బిడ్డలు నా నుంచి దూరం చేస్తున్నావు అని అనగా వెంటనే మాలిని వేదకు ధైర్యం చెబుతుంది. నువ్వు ఆ మాళవిక గురించి ఆలోచించొద్దు అది అలాగే నాటకాలు ఆడుతుంది నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది మాలిని. 
 

46

ఉరిశిక్ష వేయండి నన్ను చంపేయండి అంటూ జడ్జి గారి ముందు దొంగ నాటకాలు ఆడుతూ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది మాళవిక. ఆ తర్వాత మాళవిక కాఫీ తాగుతూ ఉండగా యష్ అక్కడికి వచ్చి కోర్టులో అంత ఓవరాక్షన్ చేయడం అవసరమా నీకు అని అంటాడు. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వేద వస్తుంది. ఇప్పుడు మాళవిక వేద ఇద్దరూ ఒకరినొకరు వాదించుకుంటూ ఉండగా అప్పుడు మాళవిక మరికొద్ది సేపట్లో నేను నిన్ను కోర్టులో ఓడిస్తాను అని అంటుంది. మరొకవైపు యష్ వాళ్ళ నాన్న వేద వాళ్ళ నాన్న ఎదురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మళ్లీ కోర్టు మొదలవడంతో అందరూ అక్కడికి వస్తారు.

56

అప్పుడు లాయర్ ఝాన్సీ మాళవిక నీ ప్రశ్నిస్తూ నాటకాలు ఆడినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు అని అంటుంది. అప్పుడు మాళవిక సులోచన ను చంపడానికి చూసింది అనడానికి మీ దగ్గర ఏమైనా సాక్షాలు ఉన్నాయా అని జడ్జి అడగడంతో ఉన్నాయి అంటూ లాయర్ ఝాన్సీ మాట్లాడుతూ నాకు క్లైంట్ సులోచన గారు ఈ మాళవిక ఇంటికి వెళ్లారు తన కూతురు కాపురంలో చిచ్చులు పెట్టొద్దు అని చెప్పారు. వార్నింగ్ కూడా ఇచ్చారు. అప్పుడు సులోచన గారు ఇంటి నుంచి బయటకు రాగానే వచ్చి కారుతో గుద్ది వెళ్లిపోయింది కానీ ఆమె అదృష్టవశాత్తు బతికారు అని అంటుంది లాయర్ ఝాన్సీ.
 

66

అప్పుడు మాళవిక జడ్జి గారు ఈ ఝాన్సీ గారు చెబుతున్నదంతా అబద్ధం నేను ఎందుకు చంపాలి అనుకుంటున్నాను అంటూ నాటకాలు ఆడుతుంది మాళవిక. అసలు ఆ యాక్సిడెంట్ చేసిన సమయంలో నేను అక్కడ లేను అనడంతో ఎక్కడికి వెళ్లారు ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది ఝాన్సీ. షాపింగ్ కి వెళ్ళాను అని అనడంతో లాయర్ ఝాన్సీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయగా మాళవిక తడబడుతుంది. అప్పుడు లాయర్ ఝాన్సీ ఎవరు ఆక్సిడెంట్ చేశారు అని గుచ్చి గుచ్చి అడగడంతో వెంటనే మాళవిక అబద్ధం చెబుతోంది అని అరుస్తాడు యష్. ఆ సమయానికి మాళవిక ఎవరితో ఉంది అని యష్ నీ అడగగా నాతోనే ఉంది అంటూ అబద్ధం చెబుతాడు. ఆ మాట విన్నా సులోచన వాళ్ళందరూ షాక్ అవుతారు. ఆ మాట విన్న వేద ఎమోషనల్ అవుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: అడవిలో భయంకరమైన ఫారెన్ లేడీ, టైం లూప్ కాన్సెప్ట్ తో కట్టి పడేస్తున్న మలయాళీ థ్రిల్లర్ మూవీ
Recommended image2
Toxic Preview Talk: టాక్సిక్ ప్రివ్యూ టాక్‌.. వాళ్లకు మాత్రం అదిరిపోయే ట్రీట్‌.. అసలు టార్గెట్‌ ఇదే
Recommended image3
Heroines Without Make up: మేకప్‌ లేకుండా సమంత, రష్మిక, నయన, త్రిష, మీనాక్షి, శ్రీలీల నయా లుక్‌.. చూస్తే ఇక అంతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved