- Home
- Entertainment
- నాజుకు అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తున్న మాళవిక.. వైట్ డ్రెస్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ..
నాజుకు అందాలతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తున్న మాళవిక.. వైట్ డ్రెస్ లో మైమరిపిస్తున్న గ్లామర్ బ్యూటీ..
మలయాళీ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది. ట్రెండీ వేర్స్ ధరిస్తూ కవ్వించేలా ఫోజులిస్తోంది. తాజాగా మినీ డ్రెస్ లో మతిపోయేలా ఫొటోషూట్ చేసింది.

మాళవిక మోహనన్ మాలయాళంతో పాటు అన్ని భాషల చిత్రాల్లో నటిస్తోంది. తమిళం, కన్నడ, హిందీలోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ ను చూసి తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదే విషయాన్ని ఇటీవల తన అభిమానులతోనూ తెలియజేసింది. ఫ్యాన్స్ కు ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా దగ్గరా ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది మాళవిక మోహనన్. ఈ సందర్భంగా నాలుగు రోజుల కింద ట్వీటర్ వేదికన #AskMalvika క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని ఇలా ప్రశ్నించాడు. ‘మీరు తమిళ బిగ్ స్టార్స్ అయిన రజినీకాంత్, థళపతి విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వీరి తర్వాత ఎవరితో నటించాలని ఆశిస్తున్నారు?.’ అనే ప్రశ్నకు బదులుగా ‘నిజానికి విజయ్ దేవరకొండతో రొమాంటిక్ లేదా రోమా్ కామ్ సినిమాల్లో నటించాలనుకుంటున్నాను’ అని చెప్పింది.
దీంతో ఈ బ్యూటీ ఎప్పటికైనా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు బిగ్ ప్లాన్ వేస్తున్నట్టుగా అర్థమవుతోంది. మాళవిక తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అని చెప్పాలి. తమిళ స్టార్ హీరో విజయ్ థళపతి నటించిన ‘మాస్టర్’, రజినీకాంత్ నటించిన ‘పేట’ చిత్రాల్లో నటించింది. ఈ చిత్రాల్లో తెలుగు భాషలోనూ రిలీజ్ అయ్యియి. అలా తెలుగు ఆడియెన్స్ ను అలరించింది.
ఇప్పటి కే వరుస చిత్రాల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్న మాళవిక మరోవైపు సోషల్ మీడియాలోనూ పాపులారిటీని పెంచుకుంటోంది. ఇందుకోసం లేటెస్ట్ ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. ఈ మేరకు తాజాగా ట్రెండీ వేర్ లో మతిపోయే ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
ఈ పిక్స్ లో మాళవిక వైట్ మినీ డ్రెస్ లో దర్శనమిచ్చింది. స్లీవ్ లెస్ అందాలు, థండర్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. హాట్ ఫోజులతో కుర్రాళ్ల గుండెల్లో అలజడి సృష్టిస్తోంది. ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘సమ్మర్ ఫేవరెట్ కలర్ వైట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఏదేమైనా ఈ యంగ్ బ్యూటీ అందాల ధాటికి సోషల్ మీడియా షేక్ అవుతుందనే చెప్పాలి.