- Home
- Entertainment
- Malavika Mohanan Glamour Pics : నడుమును స్ప్రింగ్ లా వంచుతూ మాళవిక మోహనన్ స్టిల్స్ .. లేటెస్ట్ పిక్స్ వైరల్..
Malavika Mohanan Glamour Pics : నడుమును స్ప్రింగ్ లా వంచుతూ మాళవిక మోహనన్ స్టిల్స్ .. లేటెస్ట్ పిక్స్ వైరల్..
మలయాళ నటి మాళవిక మోహనన్ (Malavika Mohanan) తన గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చూపులతో మత్తెక్కిస్తోంది. చిరునవ్వుతో నెటిజన్ల మనస్సు దోచుకుంటోంది. మాళవిక వైట్ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది.

మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ తన కేరీర్ లో ఆచితూచీ అడుగేస్తోంది. తనకు వచ్చే మూవీ ఆఫర్లను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటోంది. ఏడాదికి ఒక్క సినిమా తీసినా.. తనకు మంచి గుర్తింపు వచ్చేలా, తన పాపులారిటీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతోంది.
2013 నుంచి మాళవిక మోహనన్ సినీ ఫీల్డ్ లో యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా సినిమాల్లో కనిపించకపోయినా.. ఏడాదికో మూవీ చేస్తూ తన కేరీర్ ను ముందుకు నడిపిస్తోంది. మలయాళంలో తన తొలిచిత్రం చేసిన మాళవిక ప్రస్తుతం తమిళం, హిందీ మూవీల్లోనూ నటిస్తోంది.
గతేడాది రిలీజ్ అయిన మల్టీస్టారర్ తమిళ మూవీ ‘మాస్టర్’లో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం విజయవంతం అయ్యింది. తెలుగులోనూ మాస్టర్ మూవీని రిలీజ్ చేయడంతో ఇక్కడా.. మాళవిక మోహనన్ కు మంచి గుర్తింపే వచ్చిందని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా స్టార్ హీరోలు రజినీ కాంత్, దుల్కర్ సల్మాన్, ప్రుథ్వీరాజ్ సుకుమారన్ సరసన నటించి పాపులర్ అయ్యింది.
ప్రస్తుతం మాళవికా తమిళ హీరో ధనుష్ (Dhanush) నటించిన ‘మారన్’ మూవీలో నటించింది. ఈ మూవీ చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలె తమిళం, తెలుగు భాషల్లో మారన్ మూవీ ట్రైలర్లను విడుదల చేశారు. ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. అలాగే మరో హిందీ చిత్రం ‘యుద్రా’లోనూ మాళవిక నటిస్తోంది.
కాగా, మారన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాలవిక సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది. ఫొటోలు షేర్ చేస్తూ ‘మారన్ మూవీ ప్రమోషన్స్ మొదటి రోజు ’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఫొటోల్లో మాళవిక వైట్ శారీ, మ్యాచింగ్ బ్లౌస్ ధరించింది. స్లిమ్ ఫిట్ బాడీలో నడుమును స్ప్రింగ్ లా వంచుతూ కుర్రాళ్ల గుండెల్లో మంటపెట్టేస్తోంది. గుచ్చే చూపులతో నెటిజన్ల అటెన్షన్ ను డ్రా చేస్తోంది. మాళవిక పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానులు ఖుషీ అవుతున్నారు. తన గ్లామర్ కు ఫిదా అయిపోతున్నారు.