- Home
- Entertainment
- ఈ సారి అర్జున్ కపూర్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్, సపోర్ట్ గా నిలిచిన ప్రియురాలు మలైకా
ఈ సారి అర్జున్ కపూర్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్, సపోర్ట్ గా నిలిచిన ప్రియురాలు మలైకా
ఎప్పుడూ ఏదో ఒక రకంగా ట్రోల్స్ కు గురవుతుంటారు అర్జున్ కపూర్, మలైకా అరోరా. నెటిజన్లు ట్రోల్ చేయడం.. వారు ఘాటుగా స్పందించడం ఇది కామన్ అయిపోయింది. ఇప్పుడు మరోసారి గట్టిగా ట్రోల్స్ మొదలెట్టారు నెటిజర్లు... అయితే ఈసారి మాత్రం అర్జున్ కపూర్ వంతు వచ్చింది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ట్రోల్స్ చేయడం కామన్. కొంత మంది అయితే పని కట్టుకుని స్టార్స్ ను ఒక ఆట ఆడుకుంటుంటారు. ముఖ్యంగా.. మలైకా, అర్జన్ కపూర్ లాంటి జంటటను ఆడుకోవడం నెటిజన్లకు సరదాగామారిపోయింది. వీరి రిలేషన్ షిప్ పై ఎప్పుడు ఏదో ఒక రకంగా ట్రోలింగ్ చేసే సోషల్ మీడియా జనాలు.. రీసెంట్ మళ్లీ మొదలు పెట్టారు., అయితే ఈసారి మాత్రం మలైకాను వదిలేసి అర్జున్ కపూర్ ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్-మలైకా ఆరోరాలను తరచూ ట్రోలర్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇద్దరి మధ్య 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉందని, మలైకా పెళ్లయి విడాకులు కావడంతో వీరిద్దరిపై ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈ లవ్‌బర్డ్స్‌పై విమర్శలు చేశారు ట్రోలర్స్. అయితే ప్రతిసారి మలైకాను టార్గెట్ చేసే నెటిజన్లు ఈ సారి అర్జున్ కపూర్‌పై విమర్శల దాడి చేశారు.
ఈ మధ్య కాస్తా బరువెక్కిన అర్జున్ ప్రతిరోజు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.. ఈ వర్కౌట్ వీడియోపై ఓ ఆకతాయి నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. తన కామెంట్‌లో అర్జున్ ఫిట్‌నెస్ ట్రైనర్ డ్రూ నీల్‌ను ట్యాగ్ చేశాడు. ఇలాంటి క్లయింట్ ఉండటంమీఅదృష్టం.ఇలాంటి క్లైయింట్ ఉంటే మీకు డబ్బలు వస్తూనే ఉంటాయి. తరచూ అతను వర్కౌట్స్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికీ సరైన షేప్‌ను పొందలేడు అంటూ ఓ నెటిజన్ అర్జున్‌పై కౌంటర్ వేశాడు.
ఇది చూసిన అర్జున్ ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి అతడికి రీకౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఫిట్‌నెస్ అంటే బాడీ మీద కట్స్ కనిపించడం, సిక్స్ ప్యాక్‌తో కూడిన షేప్ ఉండటం అనుకుంటున్నారు. ఎలా అంటే ఫేస్ లేని బాడీ డీపీలా. కానీ నా దృష్టిలో ఫిట్‌నెస్‌కు అసలు అర్థమేంటంటే ఏ వ్యక్తి అయితే ఎలాంటి ప్రాబ్లంబ్స్ లేకుండా ప్రతి రోజు హెల్దీ అండ్ డైలీ లైఫ్ ను, ప్రశాంతమైన జీవితాన్ని గడుపతాడో అదే ఫిట్ నెస్ అని నేను అనుకుంటాను అన్నారు.
సైలెంట్‌గా తన జీవితం తాను గడిపేవాడు. తన గురించి తాను మాత్రమే శ్రద్ధ తీసుకునేవాడే ఫిట్‌గా ఉన్నట్లు. అంతేకాని మోహం చాటేసిన డీపీలా ఉండటం కాదు అంటూ ఘాటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన అర్జున్ ప్రియురాలు, మలైకా అరోరా అతడికి మద్దతుగా నిలిచింది. అర్జున్ ఇన్‌స్టా స్టోరీని స్క్రిన్ షాట్ తీసి బాగా చెప్పావ్ అర్జున్. ఇలాంటి విమర్శలు, ట్రోల్స్ నీ కాంతిని దూరం చేయకూడదు. నీ ఈ ప్రయాణంలో నీకు మరింత ధైర్యం, శక్తి రావాలని కోరుకుంటున్నా అని పేర్కొంది.
ప్రస్తుం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ఈ పోస్ట్ లపై నెటిజ్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది వీరికి సపోర్ట్ గా నిలుస్తుండగా.. మరికొంత మంది మాత్రం కౌంటర్లిస్తున్నారు. ఈ మధ్య మలైకా-అర్జున్‌ల పెళ్లి వార్తలు బి-టౌన్‌లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. త్వరలో ఈ జంట పెళ్ళి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది