MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర.. రిషీ వసు మధ్య పెరిగిన గొడవలు?

Guppedantha Manasu: దేవయానికి వార్నింగ్ ఇచ్చిన మహేంద్ర.. రిషీ వసు మధ్య పెరిగిన గొడవలు?

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు అక్టోబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

4 Min read
Author : Navya G
| Updated : Oct 01 2022, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..రిషి వసుధారతో, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నా అసిస్టెంట్ వి అదైనా గుర్తుందా అని అనగా, కాలేజీలో ఉన్నప్పుడు జీతం తీసుకుని మీ అసిస్టెంట్ గా ఉన్నాను సార్.కాలేజ్ అయిపోయిన తర్వాత జీతం తీసుకోకుండా జీవితాంతం మీకు అసిస్టెంట్ గా ఉంటాను అని అంటుంది. అప్పుడు రిషి, వసుధార ఎలా ఇంత సంతోషంగా మాట్లాడగలుగుతుంది నేను ఇక్కడ బాధపడుతున్నాను అని అనుకుంటాడు. అప్పుడు వసు మనసులో, ఇంత జరిగినా సరే నేను ఇంత ఆనందంగా ఎలా మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా సార్. కోపం కోపమే, ప్రేమ ప్రేమే కాదు సార్ అని వసు అంటుంది. ఇంతలో జగతి, మహీంద్రా అక్కడికి వచ్చి మంత్రిగారు మీటింగ్ కి పిలుస్తున్నారు అని చెప్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరుతారు అప్పుడు. అప్పుడు వసు, రిషి సర్ ఏమి మాట్లాడట్లేదు అని అనుకుంటుంది. 

28

రిషి కూడా,నేను మాట్లాడకపోయినా తనైన నాతో మాట్లాడాలి కదా అని అనుకుంటాడు. ఇంతలో వసు,రిషి చేయ పట్టుకుంటుంది.చెయ్య తియ్యి అని అనగా కార్ ఆపండి సార్ అని వసు అంటుంది. నేను ఆపును ఇప్పుడు ఎందుకు అని రిషి అనగా ఆపండి సార్ అని గట్టిగా ఉంటుంది వసు. ఇదేంటి డిమాండ్ చేస్తుంది అని రిషి అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మహేంద్ర జగతితో, ఈ రెండు వేలల్లో ఏదైనా ఒక వేలు పట్టుకో అని అంటాడు. ఇంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు ఏమైంది అంకుల్ అని అనగా, సరైన సమయంలో వచ్చావ్ గౌతమ్ ఈ రెండు వేలల్లో ఏదో ఒకటి పట్టుకో అని అనగా నేను రెండు పట్టుకుంటాను అని గౌతమ్ అంటాడు. అలా కాదు ఏదో ఒకటి పట్టుకో అని మహేంద్ర అంటాడు. గౌతమ్ ఒక వేలు పట్టుకుంటాడు. హమ్మయ్య అయితే రిషి,వసుధార లు కలిసే తిరిగి వస్తారు అని మహీంద్రా ఆనందపడతాడు. ఆ తర్వాత సీన్లో వసు, రిషి కార్ బయటకు దిగుతారు. అప్పుడు రిషి చేతికి వసుధారా బ్యాండేజ్ వేస్తుంది.

38

 అప్పుడు వసు,రిషి చేతిని పట్టుకొని ఈ చేయే నాకు అడ్మిషన్ ఇచ్చింది సర్! నాకు తోడుగా నడిచింది అని అనగా, నీకు అన్నీ తెలిసినప్పుడు ఎందుకు వసుధార ఎదురు మాట్లాడతావు అని రిషి అంటాడు. ఇప్పుడు పిల్లలకి బొమ్మలు ఇష్టమైతే తల్లిదండ్రులు కొంటారు సార్ కానీ అదే ప్రమాదమైనవి అయితే కొనరు కదా సార్ అలాగే ఈ విషయం మీకు మంచిదై ఉండొచ్చు కానీ నాకు మంచిగా అనిపించలేదు అని అంటుంది. దానికి రిషి, చూసేవాళ్ళు కన్నా అనుభవించే వాళ్ళుగా బాధ తెలుస్తుంది వసుధార నేను నీకు ఒక ఉదాహరణ చెప్తాను.ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చింది అనుకో గౌతమ్ కి ఆ విషయం చెప్తే నీళ్లు తాగురా తగ్గిపోతుంది అని చెప్తాడు. కానీ ఆ నొప్పి నాది, ఆ బాధ నాకే తెలుస్తుంది. చెప్పడం కన్నా అనుభవించడం కష్టం అని చెప్తాడు రిషి. అప్పుడు ప్రేమ అంటేనే బాధని భారాన్ని పంచుకోవడం, ఒకరి సమస్యలు ఇంకొకరు పరిష్కరించుకోవడం అని అంటుంది. 

48

అప్పుడు రిషి, నేను నీకు ఒకటి చెప్పాను. కానీ నువ్వు అది రివర్స్లో చెప్పావు. నాకు కావాల్సిన సమాధానం ఇది కాదు ఆ సమాధానం నీ దగ్గర ఉన్నది అయినా చెప్పడం లేదు అని రిషి అనగా బయలుదేరుదాం సార్ అని వసు అంటుంది.దీనికి సమాధానం చెప్పు అని రిషి అడుగుతాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలే  వెతుక్కుంటాయి సార్ అని కారులో వెళ్లి కూర్చుంటుంది వసుధార. అప్పుడు రిషి మనసులో, చేయి చాపితే అందే అంత దూరంలో ఉన్నావు కానీ మన ఇద్దరి మనసులూ దూరమవుతునాయి ఏమో అని భయంగా ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో వసు,రిషి లు మంత్రితో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మంత్రిగారు రిషితో, వసుధార చాలా తెలివైన అమ్మాయి చురుకైనది కానీ తనకి ఈ ఉద్యోగం సరైనది కాదు అని నాకు తెలుసు కానీ తను ఇదే ఉద్యోగమ్ కావాలి అని పట్టు పట్టింది అందుకే ఇచ్చాను అని అంటారు.
 

58

 అప్పుడు రిషి, ఇందాక వసు అనుకోకుండా వచ్చింది సార్ ఉద్యోగం అని చెప్పిన విషయం గుర్తుతెచ్చుకుంటాడు. అప్పుడు వసుధార టెన్షన్ పడుతుంది. అప్పుడు మంత్రిగారు, మీరిద్దరూ ఇలాగే ఉండండి వసుధార నీ కోల్పోవద్దు రుషి అని అంటాడు. అప్పుడు రిషి మనసులో,మంత్రిగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అన్ని విషయాలు తెలిసినట్టు అని అనుకుంటాడు. అప్పుడు మంత్రిగారు ఇంక మీటింగ్ అయిపోయింది అని వాళ్ళని పంపించేస్తారు. ఆ తర్వాత సీన్లో ధరణి, జగతి, మహీంద్రా హాల్లో కూర్చుని ఉంటారు  అప్పుడు మహేంద్ర, జగతి తో, వాళ్ళిద్దరూ ఆనందంగానే తిరిగి వస్తారు.గౌతమ్ వేలు పట్టుకున్నాడు కదా ఇంక వాళ్ళు విడిపోరు. ఎలాగా కాలేజ్ సెలవులే కదా, తిరగని హాయిగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంకా దగ్గరవుతారు అని అంటాడు. అప్పుడు జగతి,ధరణి కూడా ఆనందంగా ఉంటారు. ఇంతలో దేవయాని  అక్కడికి వచ్చి, ధరణి ఏం చేస్తున్నావు ఎందుకలా నవ్వుతున్నావు అని అంటుంది. 

68

అసలు మీరు రిషి తల్లిదండ్రులేనా! ఏంటి మహేంద్ర పెళ్ళాం వచ్చేసరికి కొడుకుని మర్చిపోయావా! ఒకప్పుడు రిషి వెనకాతలే తిరిగే వాడివి, రిషి ఈ డ్రెస్ వేసుకో, ఇది తిను అని. కానీ ఇప్పుడు జగతి మాయలో ఉన్నావు అని అనగా మహేంద్ర కి కోపం వచ్చి, జగతికి నేను ఎప్పుడూ దూరం అవ్వలేదు.తన మనసు ఎప్పుడూ నా దగ్గర ఉన్నది అని అంటాడు. అప్పుడు దేవయాని, అయితే నేను తప్పు చెప్తున్నానా! అయినా రిషి ని, వసుధార ని కలపడానికి ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నారా రిషి సంతోషంగా ఉండాలని కోరుకోవాలి కానీ పెద్దలుంటే గౌరవం లేని వాసుదార తో ముడి వెయ్యాలని చూస్తే నేను ఊరుకోను. అయినా ఇదంతా నీ వల్లే వచ్చింది జగతి, చిన్నప్పుడే రిషిని వదిలి నీ దారి నువ్వు చూసుకున్నావు. కన్నతల్లిల నేనే రిషిని పెంచాను ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి నీ రికమండేషన్ తో వసదారకి అడ్మిషన్ ఇప్పించావు. ఇప్పుడు ఇదంతా నీ వల్లే జరుగుతుంది అని తిడుతుంది.

78

 అప్పుడు మహేంద్ర కి కోపం వచ్చి, వదిన గారు రిషి మా కన్న కొడుకు. రిషి కేది మంచో, ఏది చెడ్డ మాకు తెలుసు అని అంటాడు.దానికి దేవయాని, అంటే రిషి నా కొడుకు కాదా. నాకు తనకి ఏం సంబంధం లేదని అంటున్నావా మీ ఇద్దరీ కన్నా రిషి కి నేనంటేనే ఎక్కువ ఇష్టం. అయినా జగతి, నువ్వు ఎప్పుడూ ఇక్కడి నుంచి వెళ్తే అప్పుడే ఇంటికి మనశ్శాంతి వస్తుంది అని దేవయాని అంటుంది.అప్పుడు మహేంద్ర కి కోపం వచ్చి, రిషి మా కొడుకు. రిషి కి ఏది మంచో ఏది చెడు మాకు తెలుసు. అయినా మీ గురించి ఒక్క విషయం అన్నయ్యకు గాని,రిషికి గాని చెప్తే తర్వాత ఇంట్లో మీ స్థానం ఏంటో మీకు తెలుసా అని అంటాడు.
 

88

 అప్పుడు జగతి మహీంద్రా తో, ఏం చేస్తున్నావ్ మహేంద్ర ఓర్పుగా ఉండు అని అనగా, ప్రతి విషయంలో ఓర్పు పనికిరాదు జగతి మంచిగా ఉంటే మనమే చెడైపోతాము అని అంటాడు. అప్పుడు దేవయాని, ఏంటి మహేంద్ర బెదిరిస్తున్నావా అని అనగా, నేను మర్యాదగానే చెప్తున్నాను వదినా ఇంతటితో ఈ విషయం ఆపేయండి. రిషి, వసుధార జోలికి వెళ్లొద్దు. వాళ్ళిద్దరి మధ్యలో జోక్యం చేసుకుంటే బాగుండదు వదినగారు అని అంటాడు. అప్పుడు జగతి మహీంద్రా ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. దేవయాని మహేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Hansika Divorce: తప్పుడు రైలు ఎక్కడం కంటే దిగిపోవడమే మంచిది.. విడాకులపై హన్సిక
Recommended image2
జేడీ చక్రవర్తి హీరోగా క్షుద్రపూజల నేపథ్యంలో 'చేతబడి' మూవీ.. టైటిల్ తోనే అంచనాలు పెంచేశారుగా
Recommended image3
Illu Illalu Pillalu:మొన్న ప్రేమ, ఇప్పుడు నర్మద.. ఇల్లు ఇల్లాలు సీరియల్ నుంచి ఔట్, ఏం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved