MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Animal ఈవెంట్‌లో రష్మికకి మహేష్‌ హగ్‌పై పేలుతున్న సెటైర్లు.. ఇంటికెళ్లాక నమ్రతతో ఉంటుంది చూడూ.. ఇదెక్కడి గోల

Animal ఈవెంట్‌లో రష్మికకి మహేష్‌ హగ్‌పై పేలుతున్న సెటైర్లు.. ఇంటికెళ్లాక నమ్రతతో ఉంటుంది చూడూ.. ఇదెక్కడి గోల

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా మధ్య `యానిమల్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చోటు చేసుకున్న సన్నివేశం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. దీనిపై మీమ్స్, ట్రోల్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

Aithagoni Raju | Updated : Nov 28 2023, 11:23 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన `యానిమల్‌` మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నారు. మల్లారెడ్డి తనదైన స్పీచ్‌తో దుమ్ములేపాడు. మరోవైపు రాజమౌళి సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌.. రాజమౌళిని ఉద్దేశిస్తూ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఇక మహేష్‌బాబు సైతం రణ్‌బీర్‌కి తాను అభిమానిని అంటూ చెప్పడం విశేషం. 

26
Asianet Image

ఇవన్నీ పక్కన పెడితే మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన ఈ `యానిమల్‌` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్‌బాబు, రష్మిక మందన్నా మధ్య చోటు చేసుకున్న సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. అది కాసేపు ఈవెంట్‌ని ఊపేసింది. ఇందులో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలోని `హీ సో క్యూట్‌.. హీ సో హ్యాడ్సమ్‌ ` అంటూ పాటని స్టేజ్‌పై రష్మిక పాడింది. మహేష్‌ని దగ్గరికి పిలిపించుకుని మరీ ఆమె ఈ సాంగ్‌ పాడటం విశేషం. 

36
Asianet Image

దీంతో ఆనందంలో మహేష్‌.. రష్మికని దగ్గర తీసుకుని ఆత్మీయంగా, ప్రేమతో మంచి హగ్‌ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆ హగ్‌ చాలా ప్రత్యేకంగా, క్రేజీగా ఉంది. అందుకు రష్మిక సైతం హ్యాపీ అయ్యింది. దీంతో ఈవెంట్‌లో మొత్తం దద్దరిళ్లింది. ఆ సన్నివేశం స్పెషల్‌ ఎట్రాక్షన్ అయ్యింది. కానీ ఇప్పుడు దానిపై సోషల్‌ మీడియాలో రచ్చ నడుస్తుంది. కొందరు ట్రోలర్స్, మీమర్స్ దీన్ని రకరకాలుగా మలుపులు తిప్పుతూ ఆడుకుంటున్నారు. `ఖలేజా` సినిమాలో హీరోయిన్‌ అనుష్కని ఓదార్చుతున్న పిక్‌ని జోడిస్తూ మీమర్స్ రెచ్చిపోతున్నారు. 
 

46
Asianet Image

జగన్‌ ఓదార్పు యాత్రలా ఉందని పంచ్ లు విసురుతున్నారు. దేవుడు ఓదార్చుతున్నాడని, ఇంకొందరు కాస్త శృతి మించిన కామెంట్‌ చేస్తున్నారు. ఇవన్నీ ఓ ఎత్తైతే.. ఇంటికెళ్లాక.. నమ్రతతో ఉంటది చూడూ అంటూ రచ్చ లేపుతున్నారు. ఇంకా బోల్డ్ కామెంట్స్ తో ట్రోల్‌ చేస్తున్నారు. దీనిపై మహేష్‌ ఫ్యాన్స్ స్పందిస్తూ ఇదెక్కడి దారుణం, అరేయ్‌ పాపం రా, అలా చేయకూడదురా అంటూ కౌంటర్లిస్తున్నారు. మొత్తంగా ఇది చాలా ఫన్నీగా వైరల్‌ అవుతుండటం విశేషం. మంచి ఎంటర్టైనింగ్‌గా మారింది. 
 

56
Asianet Image

ఇక ఈ సందర్భంగా రష్మికని ఉద్దేశించి మహేష్‌ మాట్లాడారు. ఆమె గురించి ఒక్క మాటల్లో చెప్పలేమని, ఇంకా చాలా మాట్లాడాలని తెలిపారు. అయితే ఆమె ఎదుగుతున్న తీరు గర్వంగా ఉందని తెలిపారు. అయితే మెయిన్‌ స్పీచ్‌లో రష్మిక గురించి ప్రస్తావించడం మర్చిపోయాడు మహేష్‌. చివరగా వెళ్లే క్రమంలో ఆమెని చూసి షాక్ అయ్యాడు. మళ్లీ మైక్ తీసుకుని ఆమెపై ప్రశంసలు కురిపించారు. దీంతో రష్మిక సైతం ఫుల్‌ ఖుషి అయ్యింది. ఇదిలా ఉంటే మహేష్‌బాబు, రష్మిక కలిసి `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి హిట్‌ అయ్యింది. 
 

66
Asianet Image

సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న `యానిమల్‌` మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌ ముఖ్య పాత్రలు పోషించారు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మించారు. ఈ మూవీ డిసెంబర్‌ 1న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. తెలుగులో దీన్ని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. భారీ అంచనాలతో వస్తోన్న ఈ మూవీపై మంచి హైప్‌ ఉంది. 

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories