- Home
- Entertainment
- మహేష్ గ్యారేజ్‌లోకి లగ్జరీ రేంజ్ రోవర్ కార్.. ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్.. టోటల్ కార్ల జాబితా ఇదే..
మహేష్ గ్యారేజ్‌లోకి లగ్జరీ రేంజ్ రోవర్ కార్.. ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్.. టోటల్ కార్ల జాబితా ఇదే..
సూపర్ స్టార్ మహేష్.. కొత్త కారు కొన్నారు. లగ్జరీ కార్లని వాడటంలో ముందుండే మహేష్.. తాజాగా మరో అత్యంత ఖరీదైన, లగ్జరీ అయినా రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశారు. దీని ధరే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.

సూపర్ స్టార్ మహేష్‌బాబు.. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకునే హీరోల్లో ఒకరు. ఆయన ఒక్కో సినిమాకి సుమారుగా 70-80కోట్లు తీసుకుంటారు. టాలీవుడ్‌లో అత్యంత లగ్జరీ లైఫ్ స్టయిల్ మెయింటేన్ చేసే హీరోల్లో ఆయన ముందుంటారు. ఆయన వాడేది ఏదైనా హై బ్రాండెడ్ అయి ఉంటుంది. అత్యంత కాస్ట్లీగా ఉంటుంది. మహేష్‌కి లగ్జరీ కార్లంటే ఇష్టం. ఆయన గ్యారేజ్‌లో ఓ పది వరకు లగ్జరీ కార్లుంటాయి. తాజాగా మరో కార్ కొనుగోలు చేశారు. రేంజ్ రోవర్ కారుని భారీ ధరకి కొనడం విశేషం.
మహేష్‌కి ఇష్టమైన కార్లలో రేంజ్ రోవర్ కారు ఒకటి. మిగిలిన వాటికంటే దీనికే ఆయన ప్రయారిటీ ఇస్తారు. చాలా కాలంగా ఆయన రేంజ్ రోవర్ కారు వాడుతున్నారు. తాజాగా మరో కొత్త సిరీస్ రేంజ్ రోవర్ కారుని కొన్నారు. `రేంజ్ రోవర్ ఎస్వీ` మోడల్ కారు తాజాగా మహేష్ గ్యారేజ్‌లోకి చేరిపోయింది. అయితే దీని ధర మాత్రం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ కొత్త కారు ధర ఏకంగా రూ.5.4కోట్లు అని సమాచారం. ఇది మైండ్ బ్లాక్ చేస్తుంది.
లగ్జరీ కార్లలో రోల్స్ రాయిస్, లాంబోర్గిని వంటి కార్లు అత్యంత కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు ఆ రేంజ్‌లో ఖరీదైన రేంజ్ రోవర్ కారుని మహేష్ కొనుగోలు చేయడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ లేటెస్ట్ మోడల్ కారు కేవలం మహేష్ వద్ద మాత్రమే ఉందని, ఈ కారును సొంతం చేసుకున్న తొలి టాలీవుడ్ స్టార్ మహేష్ అని సమాచారం. ఇది గోల్డ్ కలర్‌లో ఉంటుందని, ఇలాంటి కలర్ ఉన్న ఫస్ట్ కారు కూడా మహేష్‌దే అని సమాచారం.
ప్రస్తుతం మహేష్‌బాబు వద్ద దీంతోపాటు రేంజ్ రోవర్ వోగ్ ఉంది. దీని ధర మూడున్నర కోట్లు, కోటీ ఇరవై లక్షల విలువైన `ఆడి ఈ ట్రాన్`, 2.2కోట్ల విలువైన రేంజ్ రోవర్ వోగ్ ఆటో బయోగ్రఫీ, 1.30కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 730 ఎల్‌డీ, 90లక్షల విలువైన మెర్సిడేజ్ బెంజ్ ఈ, 2.80కోట్ల విలువైన లాంబోర్గిని గల్లార్డో, కోటి విలువ చేసే మెర్సిడేజ్ జీల్ క్లాస్, టోయోటో ల్యాండ్ క్రూయిజర్ వీ8 కారు మహేష్ వద్ద ఉన్నాయి.
ఇక కెరీర్ పరంగా చూస్తే.. ప్రస్తుతం మహేష్ `గుంటూరు కారం` చిత్రంలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలో మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తుంది. హారికా అండ్ హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనేక అవాంతరాలు, వాయిదాల అనంతరం శనివారం నుంచే నెక్ట్స్ షెడ్యూల్‌కి సంబంధించిన షూటింగ్ ప్రారంభమయ్యింది. గ్యాప్ లేకుండ రెండు మూడు నెలలు ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు.