- Home
- Entertainment
- Mahesh Babu Social Service: చిన్నారుల పాలిట దైవంలా మారిన మహేష్ బాబు, ఒకే రోజు 30 మందికి ప్రాణదానం
Mahesh Babu Social Service: చిన్నారుల పాలిట దైవంలా మారిన మహేష్ బాబు, ఒకే రోజు 30 మందికి ప్రాణదానం
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ హీరో అనిపించుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎంతో మంది చిన్నారుల జీవితాలలో వెలుగులు నింపుతున్నాడు మహేష్. ఇక ఒకేసారి 30 మంది జీవితాలలో వెలుగు నింపాడు స్టార్ హీరో.

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ డమ్ ఉన్న హీరో. కృష్ణ వారసత్వంతో వచ్చినా.. తన సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు స్టార్ హీరో. అయితే అందరు హీరోల్లా కాకుండా సమాజసేవలో దూసుకుపోతున్నాడు మహేష్. ముఖ్యంగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తూ ఎన్నో కుటుంబాలలో వెలుగులు నింపుతున్నాడు మహేష్.
పుట్టుకతోనే హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడుతున్న చిన్నారులకు తన సోంత ఖర్చుతో ఆపరేషన్లు చేయిస్తున్నాడు మహేష్. ఈ విషయం గురించి ఎన్నో సార్లు వివరించాడు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ లో బాలయ్యతో చెపుతూ... గౌతమ్ నెలలు నిండకముందే పుట్టాడని.. అప్పుడు పెద్ద హాస్పిటల్స్ లో ఉంచి గౌతమ్ ను కాపాడుకున్నామన్నాడు.
మనకంటే డబ్బులు ఉన్నాయి. డబ్బులేని తల్లీ తండ్రులకు ఈ బాధ ఉండకూడదు అనే చిన్నారులకు ఇలా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ.. తన వంతు సాయం చేస్తున్నా అన్నారు మహేష్. సూపర్ స్టార్ చేస్తున్నఈ సేవకు ఫ్యాస్స్ తో పాటు.. సెలబ్రిటీల్ కూడా ఫిదా అవుతున్నారు.
ఇక ఇప్పుడు మహేశ్ బాబు మరో రికార్డ్ స్థాయిలో మంచి పని చేశారు. ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో కాపాడిన మహేష్ ..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ స్పెషల్ డేన ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు. ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా నమ్రత ఏపీ గవర్నర్‌కు అలాగే, ఆంధ్ర ఆసుపత్రి వారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో మహేష్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. మారోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప పనికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత పెట్టిన ఈ పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలు చేస్తూనే ఇటు సేవాకార్యక్రమం కంటీన్యూ చేస్తున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈమూవీ రిలీజ్ కు ముస్తాబవుతుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే త్రివిక్రమ్ మూవీలో జాయిన్ కాబోతున్నాడు మహేష్.