MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Unstoppable: బాలయ్యనే కదిలించిన మహేష్‌.. గౌతమ్‌ వెనకాల ఇంత స్టోరీ ఉందా?

Mahesh Unstoppable: బాలయ్యనే కదిలించిన మహేష్‌.. గౌతమ్‌ వెనకాల ఇంత స్టోరీ ఉందా?

మహేష్‌బాబు.. తాజాగా బాలయ్య హోస్ట్ గా ప్రసారమవుతున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే` షోలో పాల్గొన్నారు. ఇందులో తన కుమారుడు గౌతమ్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ని బయటపెట్టారు. బాలయ్యనే భావోద్వేగానికి గురి చేశారు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 22 2022, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలకృష్ణ(Balakrishna) ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా చేస్తున్న `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే`(Unstoppable) టాక్‌ షో `ఆహా`లో విజయవంతంగా రన్‌ అవుతుంది. దీనికి విశేష ఆదరణ దక్కింది. పలు రికార్డులు క్రియేట్‌ చేసింది. బాలయ్య ఫస్ట్ టైమ్‌ ఎంట్రీతోనే రికార్డ్ లు క్రియేట్‌ చేశారు. అంతేకాదు తనలోని మరో యాంగిల్‌ని బయటపెట్టారు. ఈషోకి ఇప్పటికే చాలా మంది స్టార్స్ పాల్గొన్నారు. మోహన్‌బాబు, నాని, బన్నీ, విజయ్‌ దేవరకొండ, రవితేజ, రానా, రాజమౌళి వంటి వారు పాల్గొని సందడి చేశారు. అనేక కొత్త విషయాలను పంచుకున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇదిలా ఉంటే ఈ టాక్‌ షో చివరి దశకు చేరుకుంది. మహేష్‌బాబు(Maheshbabu)తో ఫినిష్‌ కాబోతుంది.ఫిబ్రవరి 4న మహేష్‌బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. దీంతో ఈ టాక్‌ షో మొదటి సీజన్‌ పూర్తవుతుంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మహేష్‌ చెప్పిన విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మహేష్‌ పలు ఆసక్తికర, తెలియని కొత్త విషయాలు పంచుకోవడమే అందుకు కారణం. 

36

కృష్ణగారు సెటైర్లు బాగా వేస్తారు.. మీరు సెటైర్లకి బాప్‌ అని విన్నాను అని Balakrishna అనగా, నవ్వులు పూయించారు Mahesh. అంతేకాదు చివరల్లో ఓ పంచ్‌ కూడా వేశాడు. `నేన్‌ కొడితే అబ్బా నొప్పి అంటాడు, ఆ నొప్పి లోనే ఉన్నాడు దేవుడు` అని బాలయ్య చెప్పగా. ఆడియెన్స్ ని చూస్తూ ఎమ్మా దేవుడిని ఎవరన్నా చూస్తారా? అని మహేష్‌ వేసిన పంచ్‌ కి షో మొత్తం దద్దరిల్లింది. దీంతో ఒక్కటి వచ్చింది..తీస్తా అన్నీ బయటకు తీస్తా అంటూ బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. 

46

ఈ సందర్భంగా మహేష్‌ ఓ సీక్రెట్‌ని బయటపెట్టారు. ప్రోమోలో.. మహేష్‌ వెయ్యికిపైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయించారు. ఈ విషయాన్ని బాలయ్య చెబుతూ, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదంటారు, అన్నదానం కంటే ప్రాణదానం గొప్పదంటారు. వెయ్యి మందికిపైగా చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయించి గుండెల్లో నిలిచిపోయాడు మహేష్‌` అని బాలయ్య చెప్పడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ ఫ్యామిలీ తమ ఇద్దరు చిన్నారులను స్టేజ్‌పైకి తీసుకొచ్చారు బాలయ్య. తమ చిన్నారి ఇక బతకడనే విషయాన్ని చెబుతూ తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. 

56

ఈ సందర్భంగా మహేష్‌ దీని గురించి ఓపెన్‌ అయ్యారు. గౌతమ్‌ ఆరు వారాలు ముందే పుట్టాడని, ఆ టైమ్‌లో తన అరచేయి పొడవంతా ఉన్నాడని తెలిపారు. ఇప్పుడు సిక్స్ ఫీట్స్ పెరిగాడని, అయితే `మాకు డబ్బులున్నాయి. మాకు ఓకే. చాలా మంది పరిస్థితి ఏంటని ఏదో ఒకటి చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు చెప్పారు మహేష్‌. అప్పటి నుంచి చిన్నారులకు హార్ట్ ఆపరేషన్‌ చేయిస్తున్నట్టు తెలిపారు. 

66

మహేష్‌ చెప్పిన వ్యాఖ్యలకు బాలయ్య కరిగిపోయారు. భావోద్వేగానికి గురయ్యారు. వెరీ గుడ్‌ అంటూ మహేష్‌ని అభినందించారు. ఈ సన్నివేశం షోలో అందరిని కదిలించింది. అందరిని భావోద్వేగానికి గురి చేసింది. ప్రశంసలందుకుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతూ ఆద్యంతం ఆకట్టుకుంది. మహేష్‌ నిజంగానే సూపర్‌ స్టార్‌ అని, రియల్‌ హీరో అని అభినందిస్తున్నారు నెటిజన్లు, ఆయన అభిమానులు. `ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ఇచ్చిన మహేష్‌ అన్న నువ్వు నిజంగా దేవుడవు` అని ప్రశంసలు కురిపించడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Recommended image2
Super Star Krishna: కృష్ణతో రొమాంటిక్ సీన్, వెళ్లి దున్నేసేయ్ అని ఆయన భార్యే అన్నారు.. హీరోయిన్ కామెంట్స్
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved