- Home
- Entertainment
- `పోకిరి` టైమ్‌లో చేసిందే ఇప్పుడు చేస్తున్న మహేష్.. ఫ్యాన్స్ కి లెటర్.. రికార్డులు బ్రేక్ చేయడానికేనా?
`పోకిరి` టైమ్‌లో చేసిందే ఇప్పుడు చేస్తున్న మహేష్.. ఫ్యాన్స్ కి లెటర్.. రికార్డులు బ్రేక్ చేయడానికేనా?
మహేష్‌బాబు చూడబోతుంటే `పోకిరి` సినిమా సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఆయన విడుదల చేసిన ఓపెన్ లెటర్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీంతో అనేక ఊహాగనాలకు తావిస్తుంది. పలు సందేహాలు కలుగుతున్నాయి.

మహేష్‌బాబు(Maheshbabu) ప్రస్తుతం `సర్కారు వారి పాట`(Sarkaru Vaari Paata)లో నటించారు. ఈ చిత్రం ఈ నెల(మే) 12న భారీగా విడుదల కాబోతుంది. `గీతగోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించింది. బ్యాంక్ కుంభకోణాలు, హవాలా నేపథ్యంలో సాగే చిత్రమని అర్థమవుతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ దుమ్మురేపుతుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. కచ్చితంగా `సర్కారు వారి పాట` బ్లాక్ బస్టర్‌గా నిలవబోతుందనే సంకేతాలనిస్తుంది. ఇందులో మహేష్ చెప్పిన డైలాగ్‌లు విశేషంగా ఆకట్టుకోవడం విశేషం.
ఇక `సర్కారు వారి పాట` చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ (Sarkaru Vaari Paata Pre Release Event)ఈ రోజు(శనివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈవెంట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు మహేష్ తన అభిమానులకు ఓపెన్ లెటర్ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఆయన చెప్పిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సర్వత్రా చర్చనీయాంశమవుతుంది.
ఇందులో మహేష్ (Mahesh Letter) చెబుతూ, `ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ వంటి ప్రముఖ సంస్థలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్, అచంట రామ్, అచంట గోలు సంయుక్తంగా నిర్మిస్తున్న `సర్కారు వారి పాట` షూటింగ్ పూర్తయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 12 ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఈ చిత్రం ఆడియో `సరేగమ` కంపెనీ ద్వారా మార్కెట్‌లో విడుదలై, రేటింగ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాలతో వస్తోన్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయండి` అని పేర్కొన్నారు మహేష్.
దీంతోపాటు తన తదుపరి చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ కూడా ఇచ్చారు. త్రివిక్రమ్(Trivikram) తో చేయబోతున్న సినిమా షూటింగ్ అప్‌డేట్ తెలిపారు. `దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ(చినబాబు) నిర్మించే చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జూన్‌లో మొదలు కానుంది` అని పేర్కొన్నారు మహేష్. ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఆయన లెటర్ ద్వారా తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.
అయితే ఆయన ఈ రోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రావడం లేదా? అనే సందేహాలు ఊపందుకున్నాయి. ఎలాగూ ఈవెంట్‌లో మాట్లాడతారు, అదే విషయాన్ని ఈవెంట్‌లోనే చెప్పొచ్చు. కానీ ఇలా ముందుగానే ఓపెన్‌గా అభిమానులకు లెటర్ విడుదల చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ లెటర్ వెనకాల మహేష్ సెంటిమెంట్ దాగుందని తెలుస్తుంది. మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన `పోకిరి` సినిమా టైమ్‌లోనూ ఇలానే లెటర్ విడుదల చేశారట మహేష్. అదే సెంటిమెంట్‌ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నట్టు టాక్.
2006లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన `పోకిరి` చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమా సుమారు రూ.66కోట్లు వసూలు చేసి అప్పటి వరకు హైయ్యేస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇండస్ట్రీకి కలెక్షన్ల టేస్ట్ ని చూపించడంతోపాటు కలెక్షన్లు అనే ట్రెండ్‌ని క్రియేట్ చేసింది. సినిమా పరంగానూ ఓ ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అయితే ఇప్పుడు `సర్కారు వారి పాట` చిత్రంలోనూ అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని, అంతటి హిట్ కావాలనే ఉద్దేశ్యంతో మహేష్ ఈ లెటర్ విడుదల చేసినట్టు ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న టాక్. మరి ఇందులో నిజమెంతా ఉందో తెలియాల్సి ఉంది. ఒకవేళ మహేష్ సెంటిమెంటే అయితే `సర్కారు వారి పాట` ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ ని భలేగా సర్‌ప్రైజ్ చేశారని చెప్పొచ్చు.