MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మహేశ్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ పిక్.!

మహేశ్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ పిక్.!

‘ఎస్ఎస్ఎంబీ28’లో సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కొత్తగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మహేశ్ న్యూ లుక్ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో స్టైలిష్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 13 2022, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘సర్కారు వారి పాట’తో మంచి సక్సెస్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘ఎస్ఎస్ఎంబీ 28’లో నటిస్తున్నారు. SSMB 28 చిత్రం స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్నది.. షూటింగ్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. 
 

26

గత కొన్నేండ్లుగా మహేశ్ బాబు తన సినిమాల్లో కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కథతో పాటు.. లుక్ లోనూ భారీ ఛేంజ్ తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఎస్ఎస్ఎంబీ 28’ కోసం మహేశ్ బాబు పూర్తిగా తన లుక్ ను మార్చేశారు. సరికొత్త లుక్ లో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. 
 

36

ఈ క్రమంలో కొన్నిరోజుల నుంచి మహేశ్ బాబు న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతూ వస్తోంది. మరోవైపు మహేశ్ కూడా న్యూ లుక్ లో వరుసగా ఫొటోలను షేర్  చేస్తూ వస్తున్నారు. తాజాగా మరో స్టైలిష్ పిక్ ను హేయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ఇంటర్నెట్ లో వదిలారు. ప్రస్తుతం ఆ ఫొటోలో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది.  

46

ఈ పిక్ లో మహేశ్ బాబు.. చెదిరిన జుట్టు, కొద్దిపాటి గడ్డం, మీసాలతో అల్ట్రా స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే బయటికి వచ్చిన పిక్స్ వైరల్ అవుతుండగా.. తాజాగా మరో ఫొటోలు ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

56

ఇక పదేండ్ల తర్వాత మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 28’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కాంబోలో గతంలో ‘అతడు’,‘ఖలేజా’ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైంది.
 

66

గత నెల 28న మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి మరణించడంతో సినిమాను వాయిదా వేశారు. రీసెంట్ గా పెద్దకర్మను కూడా పూర్తి చేయడంతో ప్రస్తుతం షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. హేయిర్ స్టైలిష్ షేర్ చేసిన పిక్ తో ఈ విషయం అర్థమవుతోంది. మూవీలో హారిక అండ్ హాసిని నిర్మిస్తున్న చిత్రంలో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Funky vs Couple Friendly Box Office: ఫంకీ, కపుల్‌ ఫ్రెండ్లీ మూవీ కలెక్షన్లు.. విశ్వక్‌ సేన్‌కి సంతోష్‌ శోభన్‌ షాక్‌
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Feb 19: నర్మదకు దొరికిపోయిన సాగర్, డబ్బులు కొట్టేసేందుకు వల్లి ప్లాన్
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved