బాలకృష్ణతో హీరోయిన్ గా మహేశ్ బాబు సోదరి.. ఆ ఘటనతో ప్లాన్ రివర్స్..
సినీయర్ నటుడు కృష్ణ కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనా ఒక ఘటనతో ఆమె సినీ రంగంలో హీరోయిన్ గా వెలుగొందలేకపోయింది.

సినీయర్ నటుడు కృష్ణ (Krishna) ను అభిమానించే వారు కోట్లల్లో ఉంటారు. కొన్ని వందల సినిమాల్లో విభిన్న పాత్రలో నటించిన ఆయన వేలాది మందిని అభిమానులుగా మార్చుకున్నారు. ఆయన తర్వాత కుటుంబ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) వెండితెరపై వెలుగొందుతున్నారు.
అయితే కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేశ్ బాబు కాకుండా ఆయన తోబుట్టువులు కూడా సినీ రంగ ప్రవేశం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ మహేశ్ బాబు అంతటి క్రేజ్ ను దక్కించుకోలేకపోయారు. మహేశ్ బాబు పెద్ద అన్నయ్య రమేశ్ బాబు కూడా కొన్నాళ్ల పాటు సినీ ఫీల్డ్ లో కొనసాగినా స్టార్ డమ్ ను చూడలేదు.
కృష్ణ రెండో కూతురు మంజుల ఘట్టమనేని కూడా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదగాలని తన యంగ్ ఏజ్ లో ఎన్నో కలలు కనిందంట. సినీ రంగ ప్రవేశం చేసేందుకు ప్రత్యేకంగా నటనలో శిక్షణ కూడా పొందింది. ఇందుకు తొలుత కృష్ణ ఒప్పుకోలేదు. అయినా మంజుల ఒప్పించి గ్లామర్ ఫీల్డ్ కు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. పక్కా ప్లాన్ తో చిత్రపరిశ్రమలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశించింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)తో 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా కూడా ఎంపికైంది. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరిగిన ఘటన మంజుల సినీ కేరీర్ కు బ్రేక్ వేసింది.
కృష్ణ ఫ్యాన్స్ ఆయనను హీరోగా కాకుండా ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీలవుతుంటారు. అయితే ఆయన కూతురు అంటే ఫ్యాన్స్ కు కూడా సోదరిలాంటిదేనని భావనలో అప్పట్లో వారిలో ఉండేది. దీంతో కృష్ణ కూతురును గ్లామర్ ఫీల్డ్ లో చూడటానికి మేం ఇష్టపడటం లేదంటూ దర్శకనిర్మాతలకు తెలియజేశారు. నచ్చజెప్పినా ఫలితం లేకపోవడంతో మంజుల సినిమా నుంచి తప్పుకోవాల్సింది వచ్చింది. దీంతో తన కేరీర్ ప్లాన్ రివర్స్ అయ్యింది.
అయితే, ఇదే విషయాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మంజుల ఘట్టమనేని యూట్యూబ్ ఛానెల్ లో తెలియజేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికరమైన అంశంగా మారింది. మంజుల ప్రొడ్యూసర్ మరియు యాక్టర్ విజయ్ స్వరూప్ ను గతంలోనే పెళ్లి చేసుకున్నారు.
కానీ కొన్నాళ్ల తర్వాత మంజుల పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. మరికొన్ని చిత్రాల్లోనూ పలు కీలక పాత్రల్లో నటించి తన లక్ష్యాన్ని కొంత మేరకు రీచ్ కాగలికారు. మంజుల 2018లో ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేసింది. చివరిగా ‘నషా’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఈ సిరీస్ ఇంకా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది.