- Home
- Entertainment
- టాంజానియా బయలుదేరిన మహేష్ బాబు, కిరాక్ లుక్ వైరల్.. ఈస్ట్ ఆఫ్రికా అడవుల్లో ఇక విధ్వంసమే
టాంజానియా బయలుదేరిన మహేష్ బాబు, కిరాక్ లుక్ వైరల్.. ఈస్ట్ ఆఫ్రికా అడవుల్లో ఇక విధ్వంసమే
SSMB 29 కొత్త షెడ్యూల్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈస్ట్ ఆఫ్రికాకి పయనమైనట్లు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాట్టర్ చిత్ర లాంగ్ షెడ్యూల్ కెన్యా, టాంజానియా దేశాల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

టాంజానియాలో SSMB 29 కొత్త షెడ్యూల్
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు SSMB 29 కొత్త షెడ్యూల్ కోసం టాంజానియా బయలుదేరినట్లు తెలుస్తోంది. సోమవారం ఆయన హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కనిపించారు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 సినిమా కొత్త షెడ్యూల్ ఈస్ట్ ఆఫ్రికాలో ప్రారంభం కానుంది.
KNOW
ఎయిర్ పోర్ట్ లో నమ్రత, మహేష్
ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రత ఇద్దరూ కలిసి కనిపించారు. దీనితో ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నమ్రత కూడా మహేష్ బాబుతో పాటు టాంజానియా వెళ్లిందా లేక ఆమె కేవలం మహేష్ కి సెండాఫ్ ఇవ్వడానికి వెళ్లిందా అనేది క్లారిటీ లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇద్దరూ టాంజానియా వెళ్లినట్లు తెలుస్తోంది. మహేష్ పొడవాటి గడ్డం, జుట్టుతో కొత్త లుక్‌లో కనిపించారు. ఈ రూపం చూసిన అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా స్పందిస్తున్నారు.
హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ రంగంలోకి
ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఒక భారీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ టాంజానియా, కెన్యా లాంటి ఈస్ట్ ఆఫ్రికా దేశాల్లో అటవీ ప్రాంతంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన భారీ యాక్షన్ అడ్వెంచర్ సన్నివేశాలు మొత్తం ఈ షెడ్యూల్ లోనే చిత్రీకరిస్తారట. ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ ని రాజమౌళి రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తోంది.
హీరోయిన్ గా ప్రియాంక చోప్రా
ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా నటిస్తుండగా, మలయాళ సూపర్‌స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి బృందం మీడియాతో ఎలాంటి అధికారిక సమాచారం పంచుకోలేదు.
నవంబర్ లో ఫస్ట్ రివీల్
మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న దర్శకుడు రాజమౌళి ఓ ప్రత్యేక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన ప్రకారం, ఎస్‌ఎస్‌ఎంబీ 29 ఫస్ట్ రివీల్ నవంబర్‌లో విడుదల కానుంది. దీంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.