MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు శిరీష్, నవదీప్ పరువు తీసిన మహేష్ బాబు.. అందరి ముందు సెటైర్, ఏం జరిగిందంటే

అల్లు శిరీష్, నవదీప్ పరువు తీసిన మహేష్ బాబు.. అందరి ముందు సెటైర్, ఏం జరిగిందంటే

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ.. ఎవరైనా కెలికితే మాత్రం వెంటనే సెటైర్లు పడిపోతాయి. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 08 2024, 11:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు చూడడానికి సైలెంట్ గా కనిపిస్తారు కానీ.. ఎవరైనా కెలికితే మాత్రం వెంటనే సెటైర్లు పడిపోతాయి. చాలా సందర్భాల్లో మహేష్ బాబు తనలోని ఫన్నీ యాంగిల్ చూపించారు. 

 

26

ఓ అవార్డుల కార్యక్రమంలో మహేష్ దెబ్బకి నవదీప్, అల్లు శిరీష్ పరువు పోయింది. కొన్నేళ్ల క్రితం ఐఫా అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకి నవదీప్, అల్లు శిరీష్ హోస్ట్ లుగా చేశారు. చాలా సరదాగా నవ్విస్తూ, ఫన్నీ చేష్టలు చేస్తూ వేదికపై సందడి చేశారు. వీరికి రెజీనా కూడా తోడైంది. 

 

36

ఇక ఉత్తమ నటుడికి అవార్డు ఇచ్చే క్రమంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. ఉత్తమ నటుడిని ప్రకటించడానికి నాగార్జున, అమల వేదికపైకి వచ్చారు. అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి, ఎన్టీఆర్ టెంపర్, మహేష్ బాబు శ్రీమంతుడు, ప్రభాస్ బాహుబలి, నాని  భలే భలే మగాడివోయ్ చిత్రాలతో ఉత్తమ నటుడి కేటగిరిలో నామినేట్ అయ్యారు. 

 

46

అమల విజేతని ప్రకటిస్తూ సస్పెన్స్ తో చంపేశారు. వెంటనే నాగార్జున అందుకుని మహేష్ బాబు అంటూ అనౌన్స్ చేశారు. అమల, నాగార్జున చేతుల మీదుగా మహేష్ అవార్డు అందుకున్నారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ.. శ్రీమంతుడు చిత్రం నా కెరీర్ లోనే బెస్ట్ మూవీస్ లో ఒకటి. ఇలాంటి చిత్రం ఇచ్చిన కొరటాల గారికి రుణపడి ఉంటాను అని అన్నారు. 

 

56

వెంటనే నవదీప్ మాట్లాడుతూ ఇన్ని అవార్డులు తీసుకుంటే లావైపోతారు సర్.. తిరిగి ఇచ్చేయండి అని అన్నాడు. వెంటనే మహేష్ రా తీసుకో అంటూ ఇచేయబోయారు. దీనితో అంతా నవ్వేశారు. 

 

66

ఆ తర్వాత మా జూనియర్స్ కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని నవదీప్, అల్లు శిరీష్ మహేష్ ని అడిగారు. నేను మెసేజ్ లు ఇవ్వను. అయినా మీ లాంటోళ్ళకి ఎవరైనా మెసేజ్ ఇస్తారా అంటూ పరువు తీశాడు. అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతుకు చేతబడి చేశారా ? ఎస్పీబీ కి నరకం చూపించిన పాట ఏదో తెలుసా?
Recommended image2
బన్నీ నుంచి మహేష్ బాబు వరకు : హైదరాబాద్‌లో మన స్టార్ హీరోల రెస్టారెంట్లు ఇవే!
Recommended image3
రామ్ చరణ్ పెద్ది సినిమాను మిస్ అయిన ముగ్గరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved