MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • రాజమౌళి సినిమాకి మహేష్‌ బాబు పారితోషికం ఎంతో తెలుసా? జక్కన్న ప్లాన్‌ వేరే లెవల్‌

రాజమౌళి సినిమాకి మహేష్‌ బాబు పారితోషికం ఎంతో తెలుసా? జక్కన్న ప్లాన్‌ వేరే లెవల్‌

మహేష్‌ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి మహేష్‌ బాబు తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 09 2025, 11:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ యాత్రికుడిగా మహేష్‌ బాబు
Image Credit : Instagram/Rajamouli

ప్రపంచ యాత్రికుడిగా మహేష్‌ బాబు

తెలుగు సినిమాల్లోనే కాదు, భారతీయ సినిమాల్లోనూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం మహేష్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా. `ఎస్‌ఎస్‌ఎంబీ29` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతుంది. గ్లోబల్‌ ట్రోటర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న. ఇందులో మహేష్‌ ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారట. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, మహేష్‌ అడ్వెంచరర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు రాజమౌళి.

DID YOU
KNOW
?
రాజమౌళితో మొదటిసారి
రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు తొలిసారి నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీని రూపొందిస్తున్నారు జక్కన్న.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మహేష్‌ బాబు పుట్టిన రోజు ఫ్యాన్స్ కి నిరాశ పరిచే వార్త
Image Credit : Instagram/ Mahesh babu

మహేష్‌ బాబు పుట్టిన రోజు ఫ్యాన్స్ కి నిరాశ పరిచే వార్త

నేడు మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి అప్‌ డేట్‌ వస్తుందని భావించారు ఫ్యాన్స్. ఈగర్‌గా వెయిట్‌ చేశారు. కానీ ఎలాంటి పోస్టర్‌ ఇవ్వలేదు. పైగా ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని, ఇప్పటి వరకు చూడని ఒక కొత్త సినిమాని చూపించబోతున్నామని, అందుకోసం శ్రమిస్తున్నామని తెలిపారు రాజమౌళి. నవంబర్‌లో ఫస్ట్ లుక్‌ విడుదల చేయబోతున్నట్టు చెప్పారు. అభిమానులను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు రాజమౌళి.

35
ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో మహేష్‌ మూవీ
Image Credit : x/ Mahesh Babu

ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో మహేష్‌ మూవీ

ఇందులో మహేష్‌ బాబుతోపాటు మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయనది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. ఆ మధ్య ఈ సినిమా నుంచి ఓ సీన్‌ లీక్‌ అయ్యింది. అందులో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తన సైన్యంతో మహేష్‌ ని బ్లాక్‌ చేశారు. ఆయన ముందు మహేష్‌ ని మోకాళ్లపై కూర్చోబెట్టారు. ఆ సీన్‌ పూనకాలు తెప్పించేలా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేసింది. రాజమౌళి ఈ సారి గట్టిగానే వండబోతున్నారనిపించింది. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో ఈ మూవీని రూపొందిస్తున్నారు జక్కన్న. అదే స్థాయిలో మార్కెట్‌ చేయబోతున్నారు. కొత్త ఆడియెన్స్ సినిమా చూసేలా ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

45
ఎస్‌ఎస్‌ఎంబీ29 ప్రీ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌
Image Credit : facebook / Mahesh Babu

ఎస్‌ఎస్‌ఎంబీ29 ప్రీ లుక్‌తో మైండ్‌ బ్లాక్‌

ఇదిలా ఉంటే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో మహేష్‌ బాబు ప్రీ లుక్‌ అదిరిపోయింది. తల నుంచి రక్తం కారుతుండగా, మెడలో శివుడి లాకెట్‌ ఉంది. ఇందులో త్రిశూలం, నంది, శివుడి నామాలున్నాయి. మహేష్‌ యాక్షన్‌లోకి దిగిన సమయంలో తీసిన ఫోటోని ఇలా ప్రీ లుక్‌ లాగా విడుదల చేసినట్టుగా అనిపించింది. జస్ట్ ప్రీ లుక్కే పిచ్చెక్కించేలా ఉంది. ఈ సినిమా కథ  శివతత్వం చుట్టూ తిరుగుతుందని, హీరో మహేష్‌ శివ భక్తుడిగా కనిపించబోతున్నాడని  అర్థమవుతుంది. ఇటీవల కాలంలో దైవత్వానికి సంబంధించిన సినిమాలు బాగా ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో రాజమౌళి కూడా ఆ టచ్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది.  

55
మహేష్‌ బాబుకి వంద కోట్ల పారితోషికం
Image Credit : Asianet News

మహేష్‌ బాబుకి వంద కోట్ల పారితోషికం

ఇదిలా ఉంటే ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. సుమారు వెయ్యి కోట్లతో తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. దీనికి మహేష్‌ బాబు పారితోషికం కూడా షాకిస్తుంది. ఈ సినిమాకి ఆయన వంద కోట్లు తీసుకుంటున్నారట. అయితే వంద కోట్లు లిక్విడ్‌ రూపంలో కాదు, షేర్‌ రూపంలో తీసుకోబోతున్నారట.  సినిమా వసూళ్లలో షేర్‌ తీసుకుంటున్నారు మహేష్‌. ఇదంతా రాజమౌళి ప్లానే అని సమాచారం.  పారితోషికం ఇస్తే నిర్మాతకు ఇబ్బంది అని చెప్పి, ముందుగా ఇవ్వకుండా కలెక్షన్లలో లాభాలను ఇవ్వబోతున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్‌ నారాయణ ఈ మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 2027లో ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Related Stories
Recommended image1
సావిత్రి జీవితాన్నే మార్చేసిన `మిస్సమ్మ` అరుదైన రికార్డులు.. కల్ట్ క్లాసిక్‌గా నిలిపిన అంశాలు.. తెరవెనుక కథ
Recommended image2
`వార్‌ 2`లో హీరో ఎవరు? బయటపడ్డ ఎన్టీఆర్‌, హృతిక్‌ ల మధ్య ఈగో క్లాష్‌.. ఏకంగా సోషల్‌ మీడియాలో గొడవ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved