స్టార్ డైరెక్టర్, రెండు బ్లాక్ బస్టర్ మూవీస్, రిజెక్ట్ చేసిన మహేష్ బాబు, ఏంటా సినిమా, ఎవరా దర్శకుడు..?
సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాడని మీకు తెలుసా..? అది కూడా ఒకే దర్శకుడు చెప్పిన రెండు కథలను మహేష్ బాబు రిజెక్ట్ చేశారని తెలుసా..? బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆ రెండు సినిమాలు ఏంటి..? ఆ దర్శకుడు ఎవరు..?
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కోసం ప్రతీ దర్శకుడు ప్రయత్నిస్తాడు.. చిన్న దర్శకులైతే.. కలలు కంటుంటారు. అయితే చాలామంది కొత్తవారికి అవకాశం ఇచ్చాడు మహేష్. ఇండస్ట్రీలో కొత్తగా పేరు తెచ్చుకున్న దర్శకులకు కూడా మహేష్ అవకాశం ఇచ్చాడు. అంతే కాదు చాలా మంచి దర్శఖులు, సీనియర్ డైరెక్టర్ల కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు లేకపోలేదు.
ఒకానొక సంరద్భంలో వరుసగా ప్లాప్ లు చూశాడు మహేష్ బాబు. తను ఎంచుకున్న కథలు, దర్శకుల మూలాన డిజాస్టర్లు కూడా ఫేస్ చేశాడు. కాని అదే టైమ్ లో హిట్ సినిమా కథలను రిజెక్ట్ చేసి పొరపాటు చేశాడు సూపర్ స్టార్. ఒకే దర్శకుడు చెప్పిన రెండు బ్లాక్ బస్టర్ కథలను రిజెక్ట్ చేశాడట. దాంతో రెండు హిట్ సినిమాలను ఆయన మిస్ అయ్యాడు. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి...? ఎవరా దర్శకుడు.
ఒక్కొ సారి అనుకున్నవి జరగకపోయవచ్చు అలానే మహేష్ బాబు కూడా ఈ కథలు బాగోవు అనుకుంటే అవే హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఇక మహేష్ బాబు తన కెరీర్‌లో ఎంతోమంది దర్శకులతో పనిచేశాడు.. ఎంతో మంది దర్శకుల కథలను రిజెక్ట్ చేశాడు.
అయితే మహేష్ బాబు వద్దు అనుకున్న సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ సినిమాలు చేసి ఉంటే మహేష్ బాబు కెరీర్ కు చాలా ప్లస్ అయ్యేది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరంటే శేఖర్ కమ్ములా. టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. క్లాస్ ఎంటర్టైనర్ సినిమాలతో ఆయన టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్నారు.
నేచురల్ సినిమాల దర్శకుడిగా శేఖర్ కమ్ములకు పేరుంది. ఆయన తీసిన ప్రతీ సినిమా ఒక ఆణిముత్యమే. ఒక రకంగా శేఖర్ కమ్ముల కూడా ఇంత వరకూ ఓటమి ఎరుగని దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల రెండు సినిమాలను మహేష్ బాబు రిజెక్ట్ చేశారట.
అవి కూడా సూపర్ హిట్ క్లాసిక్ మూవీస్. ఇప్పటికీ ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఆ సినిమాలు మరేవో కాదు గోదావరి, ఫిదా. అవును కొన్ని సంవత్సరాలు క్రితం సుమంత్ హీరోగా శేఖర్ కమ్ముల గోదావరి అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కథను మొదటగా శేఖర్.. మహేష్ బాబుకు వినిపించాడట.
ఆ సమయంలో మహేష్ బాబు అంత క్లాస్ టచ్ ఉన్న సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట.దీంతో ఈ సినిమా ని రిజెక్ట్ చేశారు. అయితే గోదావరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే శేఖర్ కమ్ముల చేసిన మరో అద్భుతమైన సినిమా ఫిదా. . వరుణ్ తేజ్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా సినిమా తెరకెక్కించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఫిదా : 42.9 Cr
అయితే ఈసినిమాలో వరుణ్ పాత్రను మొదట శేఖర్ కమ్ముల.. మహేష్ బాబు చేయాలన్న ఉద్దేశంతో ఆయనకు కథ మొత్తం చెప్పారట. మొత్తం విన్న మహేష్ బాబుకు ఈ సినిమా కథ సూపర్ గా నచ్చిందట. కానీ ఆ టైమ్ లో వేరే సినిమాలు చేస్తుండటంతో.. బిజీగా ఉండి.. ఫిదా సినిమాను చేయలేకపోయాడట.
దాంతో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రెండు సినిమాలు మిస్ అవ్వడంతో పాటు.. తన కెరీర్ లో రెండు బ్లాక్ బస్టర్ కథలను తానే స్వయంగా చేజార్చుకున్నాడు మహేష్. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో సందడి చేసిన మహేష్.. రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ హీరోగా మారబోతున్నాడు. ఈసినిమాతో ఆయన రేంజ్ ఎక్కడికో వెల్ళబోతోంది.