MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SSMB 29 షూటింగ్ జరిగే ప్రధాన లొకేషన్స్ ఇవే.. మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ వెళ్లే ఛాన్స్

SSMB 29 షూటింగ్ జరిగే ప్రధాన లొకేషన్స్ ఇవే.. మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ వెళ్లే ఛాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రపంచ స్థాయి చిత్రం ప్రారంభం అయింది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు రాజమౌళి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 30 2025, 02:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రపంచ స్థాయి చిత్రం ప్రారంభం అయింది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ మొదలైనట్లు రాజమౌళి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చారు. మహేష్ బాబుని బంధిస్తునట్లు, ఆయన పాస్ పోర్ట్ లాగేసుకునట్లు రాజమౌళి పోస్ట్ చేశారు. అంటే ఇకపై మహేష్ బాబు ఫారెన్ కి వెళ్లకుండా రాజమౌళి చిత్ర షూటింగ్ కోసమే సమయం కేటాయించాలి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఆమె హైదరాబాద్ కి రావడం, చిలుకూరు బాలాజీ టెంపుల్ ని సందర్శించడం జరిగింది. ప్రస్తుతం లింగంపల్లి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతోందట. 

34

ఈ చిత్రానికి రాజమౌళి కొన్ని ప్రధాన లొకేషన్స్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అటవీ నేపథ్యంలో జంగిల్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ చిత్ర కథ పుట్టిందే ఆఫ్రికా అడవుల నుంచి. ఆఫ్రికన్ నవలా రచయిత విల్బర్ స్మిత్ రాసిన రచన ఆధారంగా ఈ చిత్ర కథని రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. కాబట్టి అడవులు ఉండే లొకేషన్స్ షూటింగ్ కి చాలా అవసరం. ప్రస్తుతానికి రాజమౌళి రెండు లొకేషన్స్ ని ఫైనల్ చేశారట. 

44

ఒకటి కెన్యా అటవీ ప్రాంతం కాగా.. మరొకటి హైదరాబాద్. ఈ రెండు లొకేషన్స్ లో కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయి. సో మహేష్ బాబు పాస్ పోర్ట్ లాక్కున్న  రాజమౌళి.. కెన్యాకు వెళ్ళడానికి మహేష్ కి తిరిగి ఇవ్వాల్సిందే అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కెన్యా అడవుల్లో మహేష్ బాబు చాలా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అటవీ సన్నివేశాలకి సంబంధించిన విజువల్స్ హాలీవుడ్ లో కూడా నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉంటాయట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Sudigali Sudheer: తన హీరోయిన్‌ని పరిచయం చేసిన సుడిగాలి సుధీర్‌.. బిగ్‌ బాస్‌ బ్యూటీతో రొమాన్స్
Recommended image2
Ugly Story OTT: విడుదలైన 14 రోజులకే ఓటీటీలోకి అవికా గోర్ సినిమా.. ప్లాట్‌ఫామ్‌ ఏంటంటే?
Recommended image3
నయనతార సంసారంలోకి ఒకప్పటి ఐటెమ్‌ క్వీన్‌ ఎంట్రీ.. విఘ్నేశ్ శివన్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved