MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ ఎడ్యుకేషన్స్.. ఆర్ట్స్ ఎవరు? సైన్స్ ఎవరు?ఎక్కువ డిగ్రీ ఎవరిది?

Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ ఎడ్యుకేషన్స్.. ఆర్ట్స్ ఎవరు? సైన్స్ ఎవరు?ఎక్కువ డిగ్రీ ఎవరిది?

ఎడ్యుకేషన్ ఒకప్పుడు సొసైటీలో స్టేటస్ సింబల్ గా ఉండేది. ఈ రోజుల్లో ఇంటికి ఇద్దరు ఇంజినీర్లు, వీధికొక్క డాక్టర్ ఉంటున్నారు కానీ... ఆ రోజుల్లో డిగ్రీ చదివినోడు ఊరి మొత్తం మీద ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 28 2022, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
social media

social media

సామాన్యుడి కైనా సెలెబ్రిటీ కైనా చదువు చాలా ముఖ్యం. లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్స్ ఎంత చదువుకున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే కనీస సౌకర్యాలు లేని కాలపు హీరోలు డిగ్రీలు చదివితే మన తరం హీరోలలో కొందరు డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అలనాటి నుండి ఈనాటి వరకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఎవరెవరు ఎంత వరకు చదువుకున్నారో చూద్దాం... 
 

212

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సైన్స్ స్టూడెంట్.  భీమవరంలోని డి ఎన్ ఆర్ స్కూల్ లో ప్రాథమిక విద్య పూర్తి చేసిన  ప్రభాస్ హైదరాబాద్ లో  ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. పెదనాన్న కృష్ణంరాజు స్పూర్తితో హీరోగా మారాడు. 
 

312

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డిగ్రీ పూర్తి చేశాడు.  హైదరాబాద్ లోని ఎమ్మెస్సార్ కాలేజ్ నుండి BBA  చదివాడు. డిగ్రీ తర్వాత గంగోత్రి మూవీతో హీరోగా మారారు.

412

 టీనేజ్ పూర్తి కాకుండానే హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ (Ntr)పెద్దగా చదువుకోలేదు. ఎన్టీఆర్ హైదరాబాద్ లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుండి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి, తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. అయితే తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ భాషలు ఎన్టీఆర్ అనర్గళంగా మాట్లాడుతారు. 
 

512


టాలీవుడ్ టాప్ స్టార్  మహేష్ బాబు (Mahesh babu) మద్రాస్ లోని లయోలా కాలేజ్ లో B.Com  పూర్తి చేశారు. చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియంలో చదివిన మహేష్ బాబుకు తెలుగు కనీసం చదవడం, రాయడం రాదు. 

612

మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi)నర్సాపురం డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. చిరంజీవి కామర్స్ స్టూడెంట్ కావడం విశేషం. డిగ్రీ కంప్లీట్ చేసిన చిరంజీవి నటుడు కావాలని భరతనాట్యం, నటనలో శిక్షణ తీసుకున్నారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్ అయ్యాడు.

712


నట సింహం బాలకృష్ణ (Balakrishna)ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో సాగింది. బాలకృష్ణ  నిజాం కాలేజీలో B.Com పూర్తి చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా చదువుకునే రోజుల్లోనే బాలకృష్ణ ముఖానికి రంగేసుకున్నారు. 

812

విక్టరీ వెంకటేష్ అమెరికాలో MBA పూర్తి చేశారు. లెజెండరీ ప్రొడ్యూసర్ రామానాయుడు కొడుకు వెంకటేష్ ని విదేశాల్లో చదివించారు. బిజినెస్ మాన్ కావాలనుకున్న వెంకటేష్ అనూహ్యగా హీరో అయ్యారు. 

912


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ పూర్తి చేశారు పవన్ (Pawan Kalayan)విద్యాబ్యాసం నెల్లూరు, బాపట్ల ప్రాంతాల్లో సాగింది. సిల్వర్ స్క్రీన్ పై అల్లాడించే పవన్ చదువులో మాత్రం పూర్. అందుకే ఆయన ఎడ్యుకేషన్ ఇంటర్ తో ఆగిపోయింది. 
 

1012


కింగ్ నాగార్జున(Nagarjuna) సైతం విదేశాల్లో ఉన్నత డిగ్రీలు పూర్తి చేశారు.   నాగార్జున  మిచిగాన్ యూనివర్సిటీలో  ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో పీజీ  చేశారు. కనీసం ప్రాథమిక విద్య పూర్తి చేయలేకపోయిన నాగేశ్వరరావు నాగార్జున బాగా చదువుకోవాలని ఆశపడ్డారు.

1112
ఎన్టీఆర్‌(నందమూరి తారకరామారావు) అరుదైన, ఎప్పుడూ చూడని ఫోటోలు.

ఎన్టీఆర్‌(నందమూరి తారకరామారావు) అరుదైన, ఎప్పుడూ చూడని ఫోటోలు.

ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు డిగ్రీ వరకు చదువుకున్నారు. గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్  పూర్తి చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలేసి హీరో కావాలనే కోరికతో చెన్నై ట్రైన్ ఎక్కారు. 

1212

  ఆన్ స్క్రీన్ దేవదాసు, దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు ప్రాథమిక విద్య కూడా పూర్తి చేయలేదు. ఆయన కేవలం మూడో క్లాస్ వరకు చదువుకున్నారట. హీరో అయ్యాక నాగేశ్వరరావు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం విశేషం.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
పవన్ కళ్యాణ్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: శివని కాపాడబోయి చిక్కుల్లో బాలు, బాలు అరెస్ట్, ఏడేళ్ల జైలు శిక్ష..?
Recommended image2
ఎన్టీఆర్ ను భయపెట్టిన పాత్ర ఏంటో తెలుసా? తారక్ కు ఇష్టమైన సినిమా ఎందుకు చేయడంలేదు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode:జ్యోకు స్ట్రాంగ్ కౌంటర్-కాంచన ఏడుపు-దీపను జీవితంలో క్షమించనన్న కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved