MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మహేష్‌ బాబుకి తొమ్మిదేళ్లుగా ఓవర్సీస్‌లో ఒక్క హిట్‌ కూడా లేదా? ఇదేం ట్రోలింగ్‌ రా బాబూ..!

మహేష్‌ బాబుకి తొమ్మిదేళ్లుగా ఓవర్సీస్‌లో ఒక్క హిట్‌ కూడా లేదా? ఇదేం ట్రోలింగ్‌ రా బాబూ..!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` మూవీ ప్రస్తుతం థియేటర్లో రన్‌ అవుతుంది. అయితే ఈ సందర్భంగా ఆయనపై ఓ ట్రోలింగ్‌ నడుస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 21 2024, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మహేష్‌ బాబు నటించిన `గుంటూరు కారం` సంక్రాంతికి విడుదలైంది. ఈ మూవీ చాలా చోట్ల బ్రేక్‌ ఈవెన్‌ అయ్యిందని నిర్మాతలు, కాలేదని కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయి. ఆ వివాదం సోషల్‌ మీడియాలో పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా మహేష్‌ బాబు గత రికార్డులను వెలికి తీస్తున్నారు నెటిజన్లు. మహేష్‌ బాబుకి ఫ్లాప్‌లను లెక్క గడుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మహేష్‌ బాబు బిగ్గెస్ట్ హిట్‌ మూవీ `శ్రీమంతుడు`. అప్పట్లో అది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. గన్‌ షాట్‌ హిట్‌ అయ్యింది. ఆ మూవీ ఓవర్సీస్‌లోనూ మంచి వసూళ్లని రాబట్టింది. సుమారు 20కోట్లకు పైగా వసూలు చేసింది. అక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఎనిమిది కోట్లు. దీంతో మంచి లాభాలనే తెచ్చిపెట్టింది. 
 

37

ఆ తర్వాత మహేష్‌ బాబుకి ఓవర్సీస్‌లో ఒక్క హిట్‌ లేదట. ఆ తర్వాత ఆయన్నుంచి `బ్రహ్మోత్సవం`, `స్పైడర్‌`, `భరత్‌ అనే నేను`, `మహార్షి`, `సరిలేరు నీకెవ్వరు`, `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` చిత్రాలు వచ్చాయి. `బ్రహ్మోత్సవం` ఓవర్సీస్‌లో ఐదున్నర కోట్లు(13కోట్ల బిజినెస్‌ అయ్యింది) చేసింది. అన్ని చోట్ల ఇది డిజాస్టర్‌ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన `స్పైడర్‌` 12కోట్లు వసూలు చేసి బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకోలేదు. ఈ మూవీ 23కోట్ల ఓవర్సీస్‌ బిజినెస్‌ అయ్యింది. 
 

47

`బ్రహ్మోత్సవం` తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించిన `భరత్‌ అనే నేను` మూవీ ఓవర్సీస్‌లో 18కోట్ల బిజినెస్‌ చేసింది. ఈ మూవీ 35కోట్ల కలెక్షన్లని సాధించింది. చిన్నపాటి నష్టాలతో ముగిసింది. ఓ కోటీ వరకు నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక వంశీపైడి పల్లి దర్శకత్వంలో వచ్చిన `మహర్షి` మూవీ ఓవర్సీస్‌ బిజినెస్‌ 14కోట్లు. ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్లు 21కోట్ల గ్రాస్‌, పది కోట్ల షేర్‌ వచ్చింది. నాలుగైదు కోట్లు నష్టాలే వచ్చాయి. 
 

57

మహేష్‌ బాబు నటించిన `సరిలేరు నీకెవ్వరు` కూడా ఓవర్సీస్‌లో పెద్ద నష్టాలను తెచ్చింది. అనిల్‌ రావిపూడి రూపొందించిన ఈ మూవీ ఇక్కడ హిట్‌ ఖాతాలో పడింది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దెబ్బకొట్టింది. ఇది ఓవర్సీస్‌లో 17కోట్ల బిజినెస్‌ అయ్యింది. కానీ కలెక్షన్లు మాత్రం 11కోట్ల గ్రాస్‌ వచ్చింది. మూడొంతులు నష్టాలు తెచ్చింది. ఇక `సర్కారు వారి పాట`తో ఓవర్సీస్‌లో 15కోట్ల బిజినెస్‌ అయ్యింది. ఈ మూవీ 14కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. సగానికిపైగా నష్టాలు వచ్చాయి. 
 

67

ఇప్పుడు `గుంటూరు కారం` సినిమా ఓవర్సీస్‌లో 20కోట్ల బిజినెస్‌ జరిగింది. ఈ చిత్రం ప్రస్తుతం ఓవర్సీస్‌లో 30కోట్లు వసూలు చేసింది. అంటే 15కోట్ల షేర్‌ వచ్చింది. ఇంకా ఐదు కోట్ల నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఇంకా థియేటర్లో ఉంది. కానీ ఓవర్సీస్‌లో మాత్రం దీనికి అంతగా ఆదరణ లభించడం లేదని తెలుస్తుంది. అక్కడ ఇది కూడా నష్టాలనే మిగిల్చేలా ఉంది. ఇలా తొమ్మిదేళ్లుగా మహేష్‌ బాబుకి ఓవర్సీస్‌లో విజయాలు లేవని చెబుతున్నారు ట్రేడ్‌ వర్గాలు. 
 

77

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన `గుంటూరు కారం`లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి కీలకపాత్రలో మెరిసింది. తండ్రీకొడుకు సెంటిమెంట్‌, ఎమోషన్స్ కి రాజకీయ రంగు, మాస్‌ ఎలిమెంట్లని జోడించి ఈ మూవీని రూపొందించారు త్రివిక్రమ్‌. సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో మిశ్రమ స్పందన రాబట్టుకుంది. విపరీతమైన నెగటివ్ టాక్ కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించిందని తెలుస్తుంది.  
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved